Vikrant Rona Release Date: సుదీప్ పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ' రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే?
Kichcha Sudeep's Vikrant Rona movie latest release date: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vikrant Rona movie update: కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. ఉగాది సందర్భంగా సినిమా విడుదల తేదీ ప్రకటించారు. జూలై 28న (Vikrant Rona On July 28th, 2022) ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు నేడు వెల్లడించారు.
Vikrant Rona Release Date Teaser Out Now: 'విక్రాంత్ రోణ' విడుదల తేదీ టీజర్‌ను తెలుగులో చిరంజీవి, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో శింబు విడుదల చేయడం విశేషం. కన్నడతో పాటు ఈ నాలుగు భాషల్లో సినిమా విడుదల కానుంది.
అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'విక్రాంత్ రోణ'ను తెరకెక్కించినట్టు టాక్. ఈ సినిమాలో సుదీప్ సరసన జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించారు. అనూప్ భండారి దర్శకత్వం వహించారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మించారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ గురించి రాజమౌళి తండ్రి ఏమన్నారంటే?
కరోనా కారణంగా రెండుసార్లు 'విక్రాంత్ రోణ' విడుదల తేదీ మారింది. తొలుత గత ఏడాది ఆగస్టు 19న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24ను కూడా కన్సిడర్ చేశారు. అప్పుడూ కుదరలేదు. ఈసారి మాత్రం వాయిదా పడే అవకాశాలు లేవు. జూలై 28న (Vikrant Rona July28 worldwide in 3D) తప్పకుండా థియేటర్లలోకి సినిమా రావడం ఖాయమే.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.