News
News
X

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసుపై స్పందించిన స్మిత సబర్వాల్, పొలిటికల్ టర్న్‌ తీసుకున్న ట్వీట్

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదలై చేయటంపై IAS అధికారి స్మిత సబర్వాల్ స్పందించారు.

FOLLOW US: 

Smita Sabarwal: గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేయటంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే మహిళా నేతలు, ప్రముఖులు ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. బాధితురాలు బిల్కిస్ బానో కూడా స్పందించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరారు.

ఆమె హక్కుని తుడిచిపెట్టివేశాం: IAS అధికారి స్మిత సబర్వాల్ 

ఈ క్రమంలోనే ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కూడా ఈ వివాదంపై ట్విటర్ వేదికగా స్పందించారు. "ఓ మహిళగా, సివిల్ సర్వెంట్‌గా బిల్కిస్ బానో కేసుకి సంబంధించిన వార్తను చదివాక, పూర్తిగా నమ్మకం కోల్పోయాను. స్వతంత్ర దేశంలో ఉన్నాననే నమ్మకం కలగట్లేదు. ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా, స్వేచ్చగా ఊపిరి పీల్చుకునే ఆమె హక్కును మనం మళ్లీ తుడిచిపెట్టినట్టయింది. జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో" అని ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్. బాధితురాలు గుజరాత్ ప్రభుత్వానికి రాసిన లేఖనూ ట్వీట్‌కు జత చేశారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, తన కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వాలని అందులో బాధితురాలు పేర్కొన్నారు. అయితే స్మిత సబర్వాల్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నట్టుండి ఈ ట్వీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. తెలంగాణలో జరిగిన అత్యాచారాలపై స్పందించకుండా, ఎక్కడో గుజరాత్‌లోని ఘటనపై ఇంత ఘాటుగా స్పందించడమేంటి అని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆమె ట్వీట్‌పై తెలంగాణ భాజపా నేత శ్రావణ్ దాసోజు స్పందించారు. "జూబ్లీహిల్స్, సిరిసిల్ల అత్యాచార కేసుల్లోని దోషులకూ బెయిల్ రావటంపైనా ఆమె విశ్వాసం కోల్పోలేదా? కావాలనే కొన్ని ఘటనలపై మాత్రమేస్పందించటం సరికాదు. IAS అధికారిగా ఉండి ఇలా వ్యవహరించకూడదు" అని తప్పుబట్టారు. 

మా నోరు నొక్కేయాలని చూడకండి: స్మిత 

అయితే ఐఏఎస్ అధికారుల భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఈ సందర్భంగా చర్చ జరిగింది. దీనిపైనా స్మితా సబర్వాల్ స్పందించారు. "మా నోరు నొక్కేయాలని చూడటానికి ఇది సరైన సందర్భం కాదు. సివిల్ సర్వెంట్‌గా సర్వీస్‌లో భాగంగా దేశం కోసం ఎన్నో ఏళ్లు సేవలందిస్తాం. అలాంటప్పుడు మాపై ఈ ఆంక్షలెందుకు..?" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ప్రభుత్వాధికారుల "ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్"కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. "Freedom of Expression to Government Employees" అనే టైటిల్‌తో ఉన్న ఆర్టికల్‌ స్క్రీన్‌షాట్స్‌ని షేర్ చేశారు. 

Also Read: BJP Strategy In Telangana: తెలంగాణలో త్రిపుర తరహా వ్యూహం, తమ సక్సెస్‌పై ధీమాగా కమలనాథులు

Also Read: Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Published at : 19 Aug 2022 11:34 AM (IST) Tags: Smita Sabharwal Bilkis Bano Bilkis Bano Case Smita Sabharwal Tweet Freedom of Expression

సంబంధిత కథనాలు

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

Rains In AP Telangana: ఏపీలో అక్కడ భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్ - తెలంగాణలో వాతావరణం ఇలా

ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 25 September 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

T20 WC 2007 Recall: భారత్ టీ20 ప్రపంచకప్ విజయానికి 15 ఏళ్లు, మర్చిపోలేని విజయాలు, మైమరపించే క్షణాలు

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

Sitaram Yechury : కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుంది, ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ- సీతారాం ఏచూరి

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?