Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొనే సెలెబ్రటీలకు డబ్బులిస్తున్నారు, బీజేపీ నేత ఆరోపణలు - కాంగ్రెస్ ఫైర్
Bharat Jodo Yatra: భారత్‌జోడో యాత్రలో పాల్గొనేందుకు సెలెబ్రెటీలకు కాంగ్రెస్ డబ్బులిస్తోందంటూ బీజేపీ లీడర్ నితేష్ రాణే ఆరోపించారు.
Bharat Jodo Yatra:
నితేష్ రాణే కామెంట్స్..
భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సెలబ్రెటీలకు డబ్బులిస్తున్నారంటూ బీజేపీ నేత నితేష్ రాణే విమర్శించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు. దీనిపై స్పందిస్తూ...నితేష్ రాణే అలా విమర్శలు చేశారు. అయితే...దీనిపై బాలీవుడ్ నటి పూజా భట్ కౌంటర్ ఇచ్చారు. నితేష్ రాణే ట్విటర్ వేదికగా చేసిన వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ మండి పడ్డారు. "రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పలువురు బాలీవుడ్ నటులు పాల్గొంటున్నారు. బహుశా వారికి కాంగ్రెస్ భారీ మొత్తంలో డబ్బు ముట్టు చెబుతున్నట్టుంది. అంతా గోల్‌మాల్" అని ట్వీట్ చేశారు..మహారాష్ట్ర బీజేపీ నేత నితేష్ రాణే. అయితే...ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పూజాభట్ ఓ కోట్‌ని షేర్ చేశారు. నితేష్ రాణే పేరు ప్రస్తావించకుండానే..పరోక్షంగా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. "వాళ్ల ఆలోచనా విధానం అలాగే ఉంటుంది. వాళ్లవి మాత్రమే గొప్ప అభిప్రాయాలు అనుకుని వాళ్లను వాళ్లే గౌరవించుకుంటారు. వాళ్ల గురించి ఆలోచిస్తూ బతకడానికి ముందు నాతో నేను, నాకోసం నేను బతకాలి. దేనికీ కట్టుబడనిది ఏదైనా ఉందంటే..అది మనస్సాక్షి మాత్రమే" అని హార్పర్ లీ రాసిన కొటేషన్‌ను ట్వీట్ చేశారు. పూజాభట్ మాత్రమే కాదు. అమోల్ పాలేకర్, రియా సేన్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి లాంటి బాలీవుడ్ ప్రముఖులు రాహుల్‌తో కలిసి నడిచారు. ఈ స్టార్స్ రాకతో...రాహుల్ భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా హైలైట్ అయింది.
“They're certainly entitled to think that, and they're entitled to full respect for their opinions... but before I can live with other folks I've got to live with myself. The one thing that doesn't abide by majority rule is a person's conscience.”
— Pooja Bhatt (@PoojaB1972) November 22, 2022
Harper Lee pic.twitter.com/F1hbBfGf87
రాహుల్‌కు బాంబు బెదిరింపులు..
భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. అయితే..రాహుల్ గాంధీని బాంబు పెట్టి చంపుతామని బెదిరిస్తూ ఇండోర్‌లోని ఓ స్వీట్ షాప్‌లో ఓ లేఖ దొరకటం కలకలం సృష్టిస్తోంది. ఈ షాప్‌లో ఎవరూ ఈ లెటర్‌ను పెట్టి వెళ్లారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు. జుని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీలోని విజువల్స్‌ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో రాహుల్ గాంధీ నవంబర్ 24వ తేదీ రాత్రి బస చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు బాంబు బెదిరింపులు రావడం సంచలనమైంది. ఎవరో కావాలనే తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటివి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నా...విచారణ మాత్రం కొనసాగిస్తున్నారు. రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే..ఆయనకు బాంబు బెదిరింపు వచ్చింది. సోషల్ మీడియాపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికల్లో ఏ పార్టీనైనా గెలిపించే సామర్థ్యం సోషల్ మీడియాకి ఉంది" అని అన్నారు. "ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ సెక్యూర్ అయినప్పటికీ..భారత్‌లోని ఎన్నికలన్నీ సోషల్ మీడియాపైనే ఆధారపడి ఉంటున్నాయి" అని వ్యాఖ్యానించారు. కావాలనే కొందరి అకౌంట్స్‌పై పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించిన ఆయన...తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అందుకు ఉదాహరణ అని చెప్పారు.
Also Read: EWS Reservation: ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్