Bharat Jodo Yatra: అరెరే కేజీఎఫ్ పాట ఎంత పని చేసింది, రాహుల్‌పై కాపీరైట్ యాక్ట్ కేసు నమోదు
Bharat Jodo Yatra: అనుమతి లేకుండా కేజీఎఫ్ పాటలను భారత్ జోడో యాత్ర క్యాంపెయినింగ్‌కు వాడుకున్నారని రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు.
Bharat Jodo Yatra:
ముగ్గురిపై కేసు నమోదు..
బెంగళూరు పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ సుప్రియాపైనా కేసు నమోదైంది. సినిమా పాటల్ని ఎలాంటి అనుమతి లేకుండా భారత్ జోడో యాత్ర వీడియోలకు వాడుతుండటంపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్ పాటల కాపీరైట్స్‌ను అక్వైర్ చేసుకున్న బెంగళూరు కంపెనీ MRT మ్యూజిక్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. పాత పాటల కాపీ రైట్స్ దక్కించుకునేందుకు తమ కంపెనీ ఎంతో శ్రమించిందని వివరించింది MRT మ్యూజిక్. అయితే.. KGF-2 హిందీ పాటను భారత్ జోడో యాత్రకు సంబంధించిన వీడియోకు ఎలాంటి అనుమతి లేకుండా వాడుకోవడంపై ఈ కంపెనీ ఫిర్యాదు చేసింది. "MRT మ్యూజిక్ సంస్థ అనుమతి లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఆ పాటలను వాడుకుంది. ఆ పాటలతో మార్కెటింగ్ చేసుకుంటోంది" అని ఆ కంపెనీ ప్రెస్‌రిలీజ్‌లో తెలిపింది. ఈ మేరకు యశ్వంతపూర్ పోలీస్ స్టేషన్‌లో IPC Information Technology Act 2000, Copyrights Act, 1957 కింద కేసు నమోదు చేశారు. "ప్రైవేట్ సంస్థల హక్కులను ఏ మాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ ఈ పని చేయటం చాలా అన్యాయం. ప్రజల హక్కులు కాపాడేందుకు భారత్ జోడో యాత్ర చేస్తూ ఇలాంటి పని చేయటం సరికాదు" అని కంపెనీ లీగల్ కౌన్సిల్ అసహనం వ్యక్తం చేసింది.
After illegally using picture of Kannada actor Akhil Iyer in their campaign, Congress sued again. This time by MRT Music, which owns the popular music label of KGF2. Congress picked up songs from the movie for Bharat Jodo Yatra without seeking the firm's permission.
— Amit Malviya (@amitmalviya) November 5, 2022
हर जगह चोरी! pic.twitter.com/Kg1YWFmrgn
आओ, तुम्हें 'सपनों के भारत' की ओर लेकर चलें...#BharatJodoYatra pic.twitter.com/4sZinLl8sS
— Congress (@INCIndia) October 11, 2022
తెలంగాణలో జోడో యాత్ర..
ఇటీవలే తెలంగాణలో భారత్ జోడో యాత్ర మొదలైంది. ఈ సమయంలోనే...ఓ సభకు హాజరైన రాహుల్... దేశంలో బీజేపీ, ఆరెస్సెస్, హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. సామాన్యుల్లో భయాందోళన సృష్టిస్తున్నాయన్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీజేపీ దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేస్తోందన్నారు. నోట్ల రద్దుతో ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు. మోదీ తప్పుడు నిర్ణయాలతోనే దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ధనం కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. బీజేపీ, టీఆరెస్ వేరు కాదు.. ఇద్దరూ కలిసే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే బీజేపీ, టీఆరెస్ విధానం అన్నారు. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరిస్తున్నారని ఆరోపించారు.
Also Read: US Mid Term Election: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు ఇండియన్ అమెరికన్లు, అలా జరిగితే రికార్డే