Bengaluru Metro Station: బెంగళూరులోని మెట్రో స్టేషన్ జలమయం, వారం క్రితమే ప్రారంభించిన ప్రధాని మోదీ
Bengaluru Metro Station: ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరులోని నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్ జలమయమైంది.
Bengaluru Metro Station:
ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు..
బెంగళూరులో గత వారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకు స్థాపన చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు మెట్రో సెకండ్ ఫేజ్ 13.71 కిలోమీటర్ల ప్రాజెక్టుని ప్రారంభించారు. వైట్ ఫీల్డ్ నుంచి కృష్ణరాజపురం లైన్ అందుబాటులోకి వచ్చింది. అయితే...ఈ లైన్‌లోని నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్ పేరు ఇప్పుడు మారు మోగుతోంది. ప్రారంభించి వారం అయిందో కాలేదో అప్పుడే ఈ స్టేషన్ జలమయమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు స్టేషన్‌లో నీళ్లు నిలిచిపోయాయి. రూ.4,249 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుని నిర్మించారు. వారం రోజుల్లోనే ఇలా జలమయం అవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతున్నాయి. నల్లూర్‌హళ్లి మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు నిలిచిపోయాయంటూ కొందరు నెటిజన్లు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. పనులు సరిగా పూర్తి కాకముందే హడావుడిగా ఎందుకు ప్రారంభించారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. "ఇంత తక్కువ వర్షం పడితేనే ఇలా ఉంటే...వానాకాలంలో పరిస్థితేంటి..?" అంటూ మరి కొందరు మండి పడుతున్నారు. పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయంటూ విమర్శిస్తున్నారు.
Inside the brand new Nallurhalli Metro station.
— Whitefield Rising (@WFRising) April 4, 2023
Water on the platform as well near the ticketing counter. @cpronammametro one rain, and water has seeped inside fully. pic.twitter.com/HhJFt8aQkw
Inside the brand new Nallurhalli Metro station.
— Kamran (@CitizenKamran) April 5, 2023
Water on the platform as well near the ticketing counter.
One light rain, and water has seeped inside fully. What will happen in rainy season?
Was incomplete metro innaugrated only for PM to get 2 mins of headlines? pic.twitter.com/T10qxWKnFN
This is what one can expect when metro stations are opened in hurry without properly completing the works..
— Shanoj Devassy (@shanojdevassy) April 4, 2023
రోడ్డు జలమయం..
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించారు. అయితే...కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఈ రోడ్లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వెహికిల్స్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలూ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన NHAI వీలైనంత త్వరగా ఈ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ఆగస్టులోనూ వర్షాలు పడినప్పుడు ఇదే దారిలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టెక్నికల్ టీమ్ ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఈ ఏడాది జనవరిలో పర్యటించిన సమయంలో హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకే కట్టుబడి ఉన్నామని వివరించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇదే హైవేలో నీళ్లు నిలిచిపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Amazon Lay Off: అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు, ఈ సారి ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఝలక్