![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bengal Bypolls 2022: ఉపఎన్నికల బరిలో శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో- టికెట్ ఇచ్చిన టీఎంసీ
Bengal Bypolls 2022: బంగాల్ ఉపఎన్నికల బరిలో బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా, సింగర్ బాబుల్ సుప్రియోలు టీఎంసీ తరఫున బరిలోకి దిగుతున్నారు.
![Bengal Bypolls 2022: ఉపఎన్నికల బరిలో శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో- టికెట్ ఇచ్చిన టీఎంసీ Bengal Bypolls 2022: TMC Fields Shatrughan Sinha For Asansol LS Bypoll, Babul Supriyo To Contest Ballygunge Assembly Seat Bengal Bypolls 2022: ఉపఎన్నికల బరిలో శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియో- టికెట్ ఇచ్చిన టీఎంసీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/083083e9f7e631332ffd1391c08bb453_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా, గాయకుడు బాబుల్ సుప్రియోలు ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని టీఎంసీ అధినేత్రి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అసాన్‌సోల్ లోక్‌సభ స్థానం నుంచి సిన్హా, బల్లీగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి సుప్రియో పోటీ చేయనున్నట్లు దీదీ ట్వీట్ చేశారు.
Happy to announce on behalf of the All India Trinamool Congress that Sri Shatrughan Sinha, former Union Minister and famed actor, will be our candidate in Loksabha by-election from Asansol. (1/2)
— Mamata Banerjee (@MamataOfficial) March 13, 2022
భాజపాతో ఏర్పడిన అభిప్రాయ భేదాల వల్ల బాబుల్ సుప్రీం గత ఏడాది అక్టోబర్‌లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అసాన్‌సోల్ స్థానం ఖాళీగా ఉంది. ఆ తర్వాత ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మంత్రి సుబ్రతా ముఖర్జీ హఠాన్మరణంతో బల్లీగంజ్ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో బాబుల్ సుప్రియోను తృణమూల్ కాంగ్రెస్ తమ పార్టీ నుంచి బరిలోకి దింపుతోంది.
దీదీ ఆరోపణలు
నరేంద్ర మోదీ సర్కార్‌పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఫైర్ అయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు.
Also Read: Mamata Banerjee: ఎన్నికల్లో గెలిచిన వెంటనే మోదీ గిఫ్ట్ ఇచ్చారు: మమతా బెనర్జీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)