News
News
X

Mamata Banerjee: ఎన్నికల్లో గెలిచిన వెంటనే మోదీ గిఫ్ట్ ఇచ్చారు: మమతా బెనర్జీ

Mamata Banerjee: ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

FOLLOW US: 

Mamata Banerjee: నరేంద్ర మోదీ సర్కార్‌పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఫైర్ అయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు.

" ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన వెంటనే భాజపా ప్రభుత్వం గిఫ్ట్ కార్డు బయటికి తీసింది. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాలనాటి స్థాయికి తగ్గించాలని ప్రతిపాదించడం ద్వారా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. కరోనా సంక్షోభ సమయంలో మధ్యతరగతి, పేద ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.  ఇది ఓ అనాగరిక, ప్రజా, కార్మిక వ్యతిరేక నిర్ణయం. రైతులు, కార్మికులు, మధ్య తరగతి వర్గాలవారిని పణంగా పెట్టి పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తోంది. ఈ చీకటి చర్యలను సమైక్య నిరసనల ద్వారా తప్పనిసరిగా ఎదిరించాలి.                                                             "
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

చందాదారులకు షాక్

పీఎఫ్‌ చందాదారులకు.. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ( EPFO ) షాక్ ఇచ్చింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ నిల్వపై వడ్డీ రేటు 8.10 శాతంగా నిర్ణయించింది. ఇది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ వడ్డీ రేటు. 40 ఏళ్ల నుంచి కనీసం 8.5 శాతం వడ్డీ ఉంటూ వస్తోంది. ఇప్పుడు అతి తక్కువ శాతానికి తగ్గించారు. ఈ మేరకు శనివారం ఈపీఎఫ్‌ఓ నిర్ణయ మండలి కేంద్ర ధర్మకర్తల బోర్డు ( CBT ) సమావేశమై నిర్ణయం తీసుకుంది.  8.1శాతం వడ్డీరేటు నిర్ణయాన్ని సీబీటీ.. కేంద్ర ఆర్థికశాఖకు పంపనుంది.

Also Read: Russia Ukraine Crisis: భారత భద్రతా సన్నద్ధతపై మోదీ సమీక్ష- రష్యా- ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ

Also Read: Ukraine: జీవరసాయన ఆయుధాలు అంటే ఏమిటి? పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మనుషులను సైలెంట్‌గా ఎలా చంపుతాయి?

Published at : 13 Mar 2022 04:46 PM (IST) Tags: Mamata Banerjee provident fund interest rate cut EPFO Interest

సంబంధిత కథనాలు

ఏడాది పాటు రోజుకు 2.5 జీబీ డేటా- ఉచితంగా ఓటీటీలు- జియో ఇండిపెండెన్స్‌డే ఆఫర్‌ ప్లాన్

ఏడాది పాటు రోజుకు 2.5 జీబీ డేటా- ఉచితంగా ఓటీటీలు- జియో ఇండిపెండెన్స్‌డే ఆఫర్‌ ప్లాన్

Suicide Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి! ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి - ఇద్దరు సైనికుల వీరమరణం

Suicide Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి! ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి - ఇద్దరు సైనికుల వీరమరణం

ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం

ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం

పెట్రోల్‌ కూడా ఫ్రీ అంటారు- ఉచితాలపై ప్రధాని మోదీ సెటైర్లు

పెట్రోల్‌ కూడా ఫ్రీ అంటారు- ఉచితాలపై ప్రధాని మోదీ సెటైర్లు

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా

టాప్ స్టోరీస్

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!

Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు

Tabu Injured : హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం

Tabu Injured : హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం