Viral News: వరుడికి 72 ఏళ్లు, వధువుకి 27 మాత్రమే - మూడేళ్ల సహజీవనం తర్వాత కూడా పెళ్లి - రాజస్థాన్‌లో ఉక్రెయిన్ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ !
Ukrainian Couple: రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. 72 ఏళ్ల ఉక్రెయిన్ పురుషుడు 27 ఏళ్ల మహిళను హిందూ ఆచారాలతో వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వాళ్లు 3-4 సంవత్సరాలు సహజీవనం చేశారు

At 72 Ukrainian Man Marries 27 Yr Old Woman: రాజస్థాన్‌లోని 'సన్ సిటీ'గా పేరుగాంచిన జోధ్‌పూర్ మరోసారి అంతర్జాతీయ పెళ్లి డెస్టినేషన్‌గా మారింది. ఈ సారి ఉక్రెయిన్‌కు చెందిన 72 ఏళ్ల స్టానిస్లావ్ , 27 ఏళ్ల అంహెలీనా జంట, హిందూ వేదిక ఆచారాలతో పెళ్లి చేసుకున్నారు. 3-4 సంవత్సరాలు ఉక్రెయిన్‌లో కలిసి జీవించిన ఈ జంట, భారతీయ సంస్కృతికి ఆకర్షితులై తమ పెళ్లికి జోధ్‌పూర్‌ను ఎంచుకున్నారు. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ వంటి సెలబ్రిటీల పెళ్లికి ఆతిధ్యం ఇచ్చిన ఈ నగరం, ఇప్పుడు క్రాస్-కల్చరల్ యూనియన్‌లకు కూడా ప్రసిద్ధి చెందుతోంది.
Yet another foreign couple marries in india. It was in Jodhpur and that too with full Hindu wedding traditions.
— Unfiltered Aakash☢️ (@AakashHere1990) September 22, 2025
The age of this Ukrainian chutpaglu is what you'd get by interchanging the place values of the age of the bride which is 27.
Indeed! A beautiful couple it is.😍 pic.twitter.com/KyOu7ryIrM
స్టానిస్లావ్ , అంహెలీనా, ఉక్రెయిన్‌లోని కీవ్‌లో కలిసి జీవిస్తూ భారతదేశానికి వచ్చారు. తమ మొదటి పర్యటనలో హిందూ ఆచారాలను చూసి ఆకర్షితులయ్యారు. జైపూర్, ఉదయపూర్‌లను పరిశీలించిన తర్వాత, జోధ్‌పూర్‌లోని ఖాస్ బాగ్ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు ఉదయం హల్దీ సెరిమనీ, సాయంత్రం బరాత్‌తో ప్రారంభమైంది. పెళ్లికొడుకు షెర్వానీ, పెళ్లికూతురు ట్రెడిషనల్ మార్వారీ బ్రైడల్ వస్త్రధారణలో కనిపించారు. పండితుడు పాణిగ్రహణం వంటి ఆచారాలు నిర్వహించి, సప్తపదులతో పెళ్లి పూర్తి చేశారు. ఈ జంటకు ఇది కేవలం పెళ్లి కాదు, భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి గౌరవంగా మారిందని వెడ్డింగ్ కోఆర్డినేటర్లు తెలిపారు. అంహెలీనా ప్రతి ఆచారాన్ని భక్తితో పాటించారు.
जोधपुर में यूक्रेन कपल ने हिंदू रीति-रिवाज से की शादी, उम्र में भारी अंतर
— Kadak (@itskadak) September 19, 2025
▶ 72 वर्षीय स्टानिस्लाव और 27 वर्षीय अनहेलीना ने सात फेरे लेकर शादी की
▶ कपल तीन-चार साल से लिव-इन में रह रहा था#Rajasthan | Rajasthan #Jodhpur #UkrainianCouple | Ukrainian Couple pic.twitter.com/gRJLlurfwn
జోధ్‌పూర్ పెళ్లి టూరిజం హబ్‌గా మారడంతో, అంతర్జాతీయ జంటలు ఇక్కడ హిందూ ఆచారాలతో పెళ్లి చేసుకోవడం పెరుగుతోంది. ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ప్రియాంక-నిక్ పెళ్లి నుంచి, ఈ ఉక్రెయిన్ జంట వరకు చాలా మంది ప్రముఖులు అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పెళ్లి, వయసు, సరిహద్దులు మించి ప్రేమ ఎలా వికసిస్తుందో చూపించే ఒక ఉదాహరణగా మారిందని నెటిజన్లు అంటున్నారు.





















