Election Results 2024: ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన బీజేపీ,అరుణాచల్ ప్రదేశ్‌లో ఘన విజయం
Election 2024: అరుణాచల్ ప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన బీజేపీ 2024 ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టింది.
Arunachal Pradesh Assembly Election Results 2024: 2024 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బోణీ కొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హిమాచల్‌లో బీజేపీ 46 స్థానాలు గెలుచుకుంది. వీటిలో 10 సీట్లను ఏకగ్రీవమయ్యాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) 5 సీట్లు గెలుచుకోగా, Nationalist Congress Party (NCP) మూడు చోట్ల విజయం సాధించింది. ఇతరులు ఆరు చోట్ల విజయం సాధించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి మరో 5 సీట్‌లను తమ ఖాతాలో వేసుకుంది. ముందే 10 సీట్‌లు ఏకగ్రీవం కావడం వల్ల 50 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరిగింది. బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లు గెలుచుకోవడమూ కాషాయ పార్టీ బలాన్ని పెంచింది.
Counting of votes for the Arunachal Pradesh Assembly Elections concludes; BJP sweeps the elections, bags 46 seats out of 60 Assembly seats.
— ANI (@ANI) June 2, 2024
National People's Party - NPEP gets 5 seats. Nationalist Congress Party - NCP gets 3 seats, People's Party of Arunachal - PPA gets 2… pic.twitter.com/knXckEOnYM
అటు సిక్కిమ్‌లో Sikkim Krantikari Morcha రెండోసారి అధికారంలోకి వచ్చింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాలున్న సిక్కిమ్‌లో SKM పార్టీ 31 చోట్ల విజయం సాధించి రికార్డు సృష్టించింది. Sikkim Democratic Front కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. SDF కీలక నేత పవన్ చమ్లింగ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరోసారి ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Counting of votes for the Sikkim Assembly Elections concludes; Sikkim Krantikari Morcha (SKM) led by CM Prem Singh Tamang sweeps the elections, bags 31 seats out of 32 Assembly seats. Sikkim Democratic Front gets 1 seat. pic.twitter.com/qLleouDiPz
— ANI (@ANI) June 2, 2024