Arpita Mukherjee Profile: ఎవరీ అర్పిత ముఖర్జీ, బెంగాల్ ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో ఆమె పాత్ర ఏంటి?
Arpita Mukherjee Profile: పూజా కమిటీ ద్వారా మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీకి పరిచయం ఏర్పిడనట్టు తెలుస్తోంది.
Arpita Mukherjee Profile:
కేసులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా అర్పిత ముఖర్జీ
ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ సంచలన సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకుంది. అసలు ఈ కేసు మలుపు తిరిగిందే ఈ అర్పిత ముఖర్జీతో. ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ఏకంగా రూ.20 కోట్లు నోట్ల కట్టలు దొరికాయి. ఆమె వద్దకు ఇంత డబ్బు ఎలా వచ్చింది..అన్న ప్రశ్నతో మొదలైన విచారణ...ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పుడీ కేసులో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది అర్పిత ముఖర్జీ. ఇంతకీ ఈమె ఎవరు..? పార్థ ఛటర్జీకి, ఆమెకు ఉన్న సంబంధం ఏంటి..?
పూజా కమిటీతో పరిచయం...
ఈడీ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే...అర్పిత ముఖర్జీ, పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలు. కాస్తంత లోతుల్లోకి వెళ్తే...వీళ్లిద్దరకీ పరిచయం ఎక్కడ ఏర్పడిందో...తెలుస్తోంది. సౌత్ కోల్‌కతాలోని పార్థ ఛటర్జీ నేతృత్వంలో దుర్గా పూజా కమిటీ నడుస్తోంది. ఈ కమిటీకి ప్రచారకర్తగా ఉండే వారు అర్పిత ముఖర్జీ. క్యాంపెయిన్‌లు కూడా నిర్వహించేవారు. ఈ పూజా కార్యక్రమాలకు పార్థ ఛటర్జీ తరచుగా హాజరయ్యేవారు. ఆ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అంతే కాదు. బెంగాలీ, తమిళ్, ఒడియా చిత్రాల్లో నటించటం వల్ల అర్పిత ముఖర్జీ పేరు అందరికీ సుపరిచితమైంది. ఇక కమిటీకి సంబంధించిన పనుల్లోనూ చురుగ్గా ఉండటం వల్ల పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య సాన్నిహిత్యం బలపడింది.
Rose Valley scam: Rs 40,000 crore
— Abhijit Majumder (@abhijitmajumder) July 22, 2022
Saradha scam: Rs 2,500 crore
Coal scam: 19,000 crore
From cow smuggling to Covid relief robbery, #Bengal has normalised it all.
Rs 20 crore from TMC minister Partha Chatterjee’s ‘close associate’ Arpita Mukherjee’s house is a drop in the ocean. pic.twitter.com/ZlT6okDc3F
CM Madam @MamataOfficial, not too long ago, praised her close confidante @itspcofficial’s aid” Arpita Mukherjee saying “keep doing the good work”. Since yesterday, what that “good work” is has become evident. She also mentions Arpita going to “Bobby” Firhad Hakim! Ali Baba’s 40… pic.twitter.com/uWg3EWfOxy
— Dr. Anirban Ganguly (@anirbanganguly) July 23, 2022
Rs. 20 crore cash recovered by @dir_ed from the residence of Arpita Mukherjee; close aide of WB Education Minister Partha Chatterjee in the SSC scam case.
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) July 22, 2022
Sources claim that piles of cash were found inside WB Govt Education Ministry envelopes with
National Emblem printed on them. pic.twitter.com/xLsWQeVzL2