అన్వేషించండి

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Background

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మళ్లీ రేపు సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో భాగంగా ఏర్పాటు చేసిన కర్టెన్ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 
సోమవారం సాయంత్ర తాడేపల్లిలో బయల్దేరనున్న సీఎం జగన్... రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడే జన్‌పథ్‌లో బస చేస్తారు.

రేపు(మంగళవారం) జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సాయంత్రం వరకు సాగనుంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో చాలా మంది దౌత్యవేత్తలు పాల్గొంటారని... సీఎంతో సమావేశమవుతారని ప్రభుత్వం చెబుతోంది. 
గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్‌ టేబుల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం చాలా మంది వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, రాయబారులను పిలిచింది. ఏపీలో పెట్టబడులు పెట్టేందుకు ఉన్న అనేక వనరులను, అనుకూల పరిస్థితులను వారికి వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. వచ్చిన వారందరితో సీఎం జగన్ సమావశమై.. రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాలు వివరించనున్నారు. 

మార్చి మూడు, నాలుగు తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. విశాఖ వేదికగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ మీటింగ్‌లో బీటుబీ, బీటూజీ సమావేశాలు, నిర్వహించనున్నారు. మరికొన్ని కీలక సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేస్తున్న సెక్టార్లలో కనిపిస్తున్న అభివృద్ధి. చేపట్టే కార్యక్రమాలను అతిథులకు వివరించనున్నారు. 
ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన... పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి అనుభవాలను ఈ వేదికపై నుంచి అతిథిలకు వివరిస్తారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వారి ద్వారానే ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు 28 విదేశీ పెట్టుబడులుదారులను, 44 దేశాలకు చెందిన రాయబారులు వస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఏపీ అడ్వాంటేజ్‌ అనే థీమ్‌తో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వం అతిథులకు వివరించనుంది. ఇలాంటి కార్యక్రమాలు అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో కూడా నిర్వహించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అక్కడ చిన్న చిన్న సమావేశాలు, రోడ్‌షోలు, చిట్‌చాట్‌లాంటి కార్యక్రమాలతో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ను విజయవంతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం.

 దిల్లీ టూర్ కు ముందు ఏపీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా మూడో ఏడాది జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుకగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.

చేదోడు పథకం 

రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు రూ. 330.15 కోట్ల ఆర్థిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో  బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.  జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 30,000 ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ల కాలంలో  ఈ పథకం ద్వారా  ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 927.51 కోట్లు.  

21:12 PM (IST)  •  30 Jan 2023

అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

చిత్తూరు : అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, మోర్ధానపల్లె సమీపంలోని అమర్ రాజా ఫ్యాక్టరీలో‌ భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఫ్యాక్టరీ నుండి భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం.. సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.. భారీగా ఆస్తీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

17:40 PM (IST)  •  30 Jan 2023

ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ విమానం గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం సీఎం జగన్ దిల్లీకి బయలుదేరారు. కానీ టేకాఫ్ అయిన తరువాత సాంకేతిక లోపం తలెత్తడంతో గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో, సీఎం జగన్ క్షేమంగా ఉన్నారని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

17:00 PM (IST)  •  30 Jan 2023

సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది బాలికలకు అస్వస్థత 

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల అల్పాహారంలో  ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలకు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు.  దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

15:02 PM (IST)  •  30 Jan 2023

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామ సమీపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అంకోల్ గ్రామానికి చెందిన నీరడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్టీసీలో ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నోటిలో మద్యం సీసాలతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు పోలీసులు.  మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

14:54 PM (IST)  •  30 Jan 2023

గవర్నర్‌ వివాదంపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు

గవర్నర్‌ తమిళిసై వివాదంలో తెలంగాణ సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు తెలిపింది. అంతే కాకుండా కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొంది. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Bengaluru: మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
మీరెక్కిన క్యాబ్ డ్రైవర్ నిద్రమత్తులో ఉంటే ఏం చేస్తారు? - ఈయన చేసింది మాత్రం వైరల్ అయింది !
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Embed widget