Breaking News: మిజోరంలో ఘోర ప్రమాదం, క్వారీలో చిక్కుకున్న 12 మంది కూలీలు!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
సూపర్ స్టార్ కృష్ణ (Krishna Ghattamaneni) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈ రోజు ఉదయం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఉన్నారు. దాంతో ఘట్టమనేని, మహేష్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం ఎలా ఉందంటే?
కృష్ణ కొన్ని రోజులుగా కృష్ణ బయటకు రావడం లేదు. వయసు రీత్యా ఆయనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందువల్ల, ఎక్కువగా ఇంటికి పరిమితం అవుతున్నారు. గతంలో మహేష్ బాబు సినిమా ఫంక్షన్స్‌కు అటెండ్ అయ్యేవారు. ఈ మధ్య అది కూడా లేదు. ఫంక్షన్స్ గట్రా అవాయిడ్ చేస్తున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Krishna Hospitalized : కృష్ణకు ఆస్థమా ఉందని, వాతావరణంలో మార్పులు రావడంతో కొద్దిగా నలత చేసిందని, అందువల్ల ఆస్పత్రికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. అభిమానులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రెగులర్ చెకప్ కోసమే కృష్ణ ఆసుపత్రికి వెళ్లారని ఘట్టమనేని ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణకు ఏం కాలేదని, 24 గంటల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని నటుడు వీకే నరేష్ తెలిపారు.
భార్య, కుమారుడి మరణం తర్వాత...
కుటుంబం అంటే కృష్ణకు ఎక్కువ ప్రేమ. ముఖ్యంగా పిల్లలు అంటే ఆయనకు పంచ ప్రాణాలు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్ను మూశారు. ఏడాది ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. భార్య, కుమారుడి మరణం ఆయనను బాధకు గురి చేసిందని సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.
కృష్ణ, ఇండియా దేవి దంపతులకు ఐదుగురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. మూడో అమ్మాయి ప్రియదర్శిని యువ హీరో సుధీర్ బాబుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సోదరుడు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. ఇక, మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ స్టార్‌గా, తండ్రి తగ్గ తనయుడిగా స్టార్ డమ్ కొనసాగిస్తున్నారు.
మే 31న కృష్ణ బర్త్ డే. ఆ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా ఆయన్ను కుమార్తె మంజుల ఇంటర్వ్యూ చేశారు.
View this post on Instagram
మిజోరంలో ఘోర ప్రమాదం, క్వారీలో చిక్కుకున్న 12 మంది కూలీలు!
మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్టోన్ క్వారీలో జరిగిన ప్రమాదంలో 12 కార్మికులు మట్టిలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. మిజోరంలో సోమవారం రాత్రి క్వారీ కూలిపోవడంతో బీహార్‌కు చెందిన 12 మంది కూలీలు చిక్కుకుపోయారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక అప్ డేట్, నిందితుల బెయిల్ పిటిషన్ రిజెక్ట్
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు వేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక అప్ డేట్, నిందితుల బెయిల్ పిటిషన్ రిజెక్ట్
ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల బెయిల్ పిటిషన్‌ను సీఐడీ కోర్టు కొట్టివేసింది. దర్యాప్తు వేళ బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఐడీ ప్రత్యేక కోర్టు ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Breaking News: షూటింగ్‌లో కళ్లు తిరిగి పడిపోయిన హీరో నాగశౌర్య
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. ఓ సినిమా షూటింగ్‌లో పొల్గొన్న నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయారు. నాగశౌర్యను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏపీ, కర్నాటకలో సిట్ దర్యాప్తు
తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన కేసు దర్యాప్తు స్పీడ్ అందుకుంది. దీనిపై ప్రభుత్వం వేసిన సిట్... తెలంగాణసహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తోంది. కర్నాటక, హర్యానా, ఏపీ, తెలంగాణలో తనిఖీలు చేస్తోంది. రామచంద్రభారతి వ్యక్తిగత వైద్యుడి ఆసుపత్రిలో కూడా సోదాలు చేసింది. ఈ సోదాల సంగతి తెలుసుకున్న ఆయన అక్కడి నుంచి జారుకున్నట్టు సమాచారం.