Breaking News: రాజేంద్ర నగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు నిజామాబాద్ రాజకీయాల్లో లెక్కలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్సీల కోసం లీడర్లు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఆ కోటాలో ఎమ్మెల్సీగా కవిత కొనసాగుతున్నారు.
కవితే ఆ స్థానం నుంచి పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ కవిత రాజ్యసభకు వెళ్తున్నారన్న ప్రచారంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. లోకల్ బాడీ నుంచి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి మళ్లీ కవితకే ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు. కానీ ఆమె మొదటి నుంచి ఈ ఎమ్మెల్సీ కొంత అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీల ఎన్నికల కౌంటింగ్
రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు నగర కార్పొరేషన్ సహా.. 13 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల కౌంటిగ్ మరికొద్ది సేపట్లో మొదలవుతుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలనుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడిస్తారు.
దేశవ్యాప్తంగా ముగిసిన సీబీఐ సోదాలు..
దేశవ్యాప్తంగా సీబీఐ నిర్వహిస్తోన్న సోదాలు ముగిశాయి. 77 ప్రాంతాల్లో 14 రాష్ట్రాల్లో తనిఖీలు. ఇంటర్ పోల్, సీబీఐ సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. ఆన్‌లైన్ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులపై 23 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ 83 మంది నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి నుంచి బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ, ఆల్ టైమ్ రికార్డు ధరల దిశగా దూసుకెళ్తోంది. తాజాగా రూ.280 మేర పుంజుకోవడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,350 అయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.46,150 గా ఉంది. ఇక వెండి ధర రూ.700 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,500 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది.
ఇక ఏపీలోనూ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 మేర పెరగడంతో విజయవాడలో నేడు 10 గ్రాముల పసిడి ధర రూ.46,150 అయింది. రూ.280 మేర పుంజుకోవడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 అయింది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,500 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
మేడ్చల్ మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెలంగాణ: మేడ్చల్ లోని మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు. మంటల్లో చిక్కుకున్న మరో వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. నిల్వ చేసిన ఆయిల్ డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
రాజేంద్ర నగర్‌లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్‌నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారుచేసే కంపెనీలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Roja: పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్న రోజా
తిరుమల శ్రీవారిని నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రోజాకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ... పుట్టిన రోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం కోసం తిరుమలకు రావడం జరిగిందని, కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. జగన్ పరిపాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు..
కోళ్ల ఫామ్ లోకి వరద నీరు చేరడంతో మూడు వేల కోళ్లు మృతి
కోళ్ల ఫామ్ లోకి వరద నీరు చేరడంతో మూడు వేల కోళ్లు మృతిచెందాయి. అనంతపూర్ జిల్లా చిలమత్తూరు మండలంలోని కోడూరు, పాత చామలపల్లి , వీరాపురం, చిలమత్తూరు చెరువు, వీరాపురం వెంకటాపురం లాల పెళ్లి కోడూరు చిలమత్తూరు పెద్ద చెరువు నిండి ఉదృతంగా ప్రవహిస్తోంది. కుషావతి నది కూడా ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కోడూరు చెరువు సమీపాన ఉన్న కోళ్ల ఫామ్ లోకి వరద నీరు చేరడంతో మూడు వేల కోళ్లు మృతి.
దేశవ్యాప్తంగా ముగిసిన సీబీఐ సోదాలు.. 14 రాష్ట్రాల్లో తనిఖీలు
దేశవ్యాప్తంగా సీబీఐ నిర్వహిస్తోన్న సోదాలు ముగిశాయి. 77 ప్రాంతాల్లో 14 రాష్ట్రాల్లో తనిఖీలు. ఇంటర్ పోల్, సీబీఐ సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. ఆన్‌లైన్ వేదికగా చిన్నారుల లైంగిక వేధింపులపై 23 కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకూ 83 మంది నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది.