Top Headlines Today: వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు సీరియస్ - తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త - నేటి టాప్ న్యూస్
Latest Telugu News 10 July 2024: ఏపీలో ఇసుక పాలసీపై వైసీపీ నేతల విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
![Top Headlines Today: వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు సీరియస్ - తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త - నేటి టాప్ న్యూస్ AP Sand Policy Andhra Pradesh Telangana Telugu News Today on 10 July 2024 Top Headlines Today: వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు సీరియస్ - తెలంగాణ రైతులకు త్వరలోనే శుభవార్త - నేటి టాప్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/46347961ae0324c21cb79ba80ac36bc01720604194436233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పార్టీలో ప్రక్షాళనపై దృష్టి సారించిన జగన్ - కదిరి మాజీ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో సిద్దారెడ్డికి జగన్ కేటాయించలేదు. మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మక్బూల్ అహ్మద్ అనే నేతకు టిక్కెట్ కేటాయించారు. దీంతో సిద్దారెడ్డి తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. ఎన్నికల సమయంలో ఆయనను బుజ్జగించారు. అప్పటికి వైసీపీ విజయం కోసం పని చేస్తానని చెప్పిన ఆయన తర్వాత.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ రైతులకు శుభవార్త-వచ్చే వారం నుంచే రుణమాఫీ-రెండు రోజుల్లో మార్గదర్శకాలు
రైతు రుణమాఫీ... దీని కోసం తెలంగాణ రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపిస్తామని లోక్‌సభ ఎన్నికల ముందు సవాల్ చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. 2లక్షల వరకు ఉన్న రుణాలు మాపీ చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వచ్చే వారం నుంచే పంట రుణమాఫీ ప్రారంభంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసం అవసరమైన నిధులను సమకూర్చుకుంటోంది. రెండు రోజుల్లోనే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఇంటింటికీ వెళ్లి ఇసుక ఇచ్చి రావాలా? వైసీపీ నేతల విమర్శలపై చంద్రబాబు సీరియస్
ఉచిత ఇసుకపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలో విద్యుత్‌పై వైట్‌పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ఉచిత ఇసుక విధానాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఉచిత ఇసుక ఇవ్వలేమని అన్నారు. ఇసుక కొనాల్సిన అవసరం లేకుండా చేశామన్న చంద్రబాబు.... రవాణా ఖర్చులు, కూలీల ఖర్చు, జీఎస్టీ ఎవరైనా ఇచ్చుకోవాల్సిందేనన్నారు. ఇవన్నీ చెల్లించినా గత ప్రభుత్వం హయాంలో ఉన్న రేట్లు కంటే సగం కంటే తక్కువకే ఇసుక వస్తుందని వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో అమల్లోకి రానున్న మరో కొత్త స్కీం- ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న అన్న క్యాంటీన్లు
నిరుపేదలకు రెండు పూటల నాలుగు వేలు నోట్లోకి వెళ్లడం చాలా కష్టం. అంతేకాదు... పని నిమిత్తం, ఆస్పత్రిలో చికిత్స కోసం బయట ప్రాంతాలకు వెళ్తుంటారు చాలా మంది. అక్కడ సరైన భోజనం దొరకదు. బయట హోటళ్లలో తినాలంటే... డబ్బులు సరిపోవు. అలాంటి వారికి కడుపునింపేందుకే... అన్న క్యాంటీన్ల (Anna Canteen)ను తీసుకొచ్చింది టీడీపీ. అయితే... గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో... అన్న క్యాంటీన్ల ఊసెత్తలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రేవంత్ సర్కారుకు ఎన్ఎంసీ షాక్, కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ
రేవంత్ రెడ్డి సర్కారుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) షాకిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానున గద్వాల, మెదక్, ములుగు, షాద్‌నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) తెలంగాణ దరఖాస్తు చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)