Breaking News Live Updates: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, పేలిన రియాక్టర్ ట్యాంక్
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
Background
దక్షిణ అండమాన్ సముద్రంలో నిన్న అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయువ్య బంగాళాఖాతం దిశగా కదులుతూ నేటి సాయంత్రానికి బెంగాల్ తీరాన్ని చేరే అవకాశం ఉందని, మే 8న వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులుల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ఎండల నేపథ్యంలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
UP Road accident: రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 14 మంది మరణించారు. కారును గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యూపీలో ఏడుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఓ తీవ్రంగా గాయపడింది.
Mathura road accident: వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబలించింది. ఢిల్లీ నుంచి వస్తున్న కారును యమునా ఎక్స్ప్రెస్ వేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మథుర జిల్లా పోలీసులు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ మథురా జిల్లాలోని నౌజహిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి, ముగ్గురు పురుషులు ఉన్నారని పోలీసులు తెలిపారు. నోయిడాలో ఓ వివాహ వేడుకకు కారులో వెళ్తుండగా మార్గంమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.
నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పతనమైంది. రూ.320 మేర తగ్గడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 గా ఉండగా.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర రూ.1,200 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.66,500గా ఉంది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 7th May 2022 2022) 10 గ్రాముల ధర రూ.51,380 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెలలో రూ. 1500 మేర తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 అయింది.
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం, పేలిన రియాక్టర్ ట్యాంక్
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మాసిటీ అలివిర యానిమల్ హెల్త్ లిమిటెడ్ ఫార్మాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్ లో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. రియాక్టర్ ట్యాంక్ పేలుడు వల్ల మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం- ఎగసిపడుతున్న మంటలు
అనకాపల్లి జిల్లా జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. పరవాడ జవహార్‌లాల్ ఫార్మాసీటీ అలివిర యానిమల్ హెల్త్ లిమిటెడ్ ఫార్మాలో ప్రమాదం జరిగింది. ప్రొడక్షన్ బ్లాక్‌లో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. రియాక్టర్ ట్యాంక్ పేలుడు వల్ల ఘటన జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Firing Reported In Delhi: దిల్లీలో కాల్పులు కలకలం- పది రౌండ్లకుపైగా కాల్పులు
దిల్లీలోని సుభాష్ నగర్‌లో కాల్పులు కలకలం రేపాయి. 10 రౌండ్లకుపైగా కాల్పులు జరిగాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టారు. పశ్చిమ దిల్లీలో ఉందీ ప్రాంతం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TPCC Meeting: గాంధీభవన్‌లో మొదలైన టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశం
TPCC Meeting: హైదరాబాద్: టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశం గాంధీభవన్ లో ప్రారంభమైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అధక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు 300 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్లు సమాచారం.
Rahul Gandhi In Hyderabad: సంజీవయ్య పార్కుకు బయలుదేరిన రాహుల్ గాంధీ
Rahul Gandhi In Hyderabad: రాహుల్ గాంధీ హోటల్ తాజ్ కృష్ణా నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50 - 1:10మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15 కు సంజీవయ్య పార్కు నుంచి బయలుదేరి 1:30కి గాంధీ భవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు గాంధీ భవన్ లో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.