At Home in Raj Bhavan: ఏపీ రాజ్ భవన్‌లో ఎట్ హోం, సీఎం జగన్ దంపతులు హాజరు
AP Raj Bhavan News: విపక్షాల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు.
CM Jagan in At Home Raj Bhavan: గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం తరహాలోనే రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం (జనవరి 26) నాడు విజయవాడలోని రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోంను.. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేశ్, ధర్మాన ప్రసాదరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ లాంటి వైసీపీ కీలక నేతలు కూడా హాజరయ్యారు.
విపక్షాల నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎట్ హోంలో పాల్గొన్నారు. కానీ, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో ఉండడంతో చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
అంతేకాక, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఎట్ హోంకు హాజరయ్యారు. ఏపీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఈ ఎట్ హోం ఏర్పాటు చేశారు.
On the occasion of 75th Republic Day, Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer has hosted ‘AT HOME’ function at Raj Bhavan lawns on Friday.
— governorap (@governorap) January 26, 2024
Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jagan Mohan Reddy along with his wife Smt. Y.S. Bharathi Reddy, pic.twitter.com/VxASKRVcJY