Jagan Review Meeting: గడప గడపకూ మన ప్రభుత్వంపై నేడు సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష
Jagan Review Meeting: గడప గడపకూ మన ప్రభుత్వం పై నేడు సీఎం జగన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రకరకాల సర్వేల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు సీఎం వద్దకు చేరాయి.
Jagan Review Meeting: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకూ మన ప్రభుత్వంపై నేడు సీఎం జగన్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే నుంచే గడప గడపకూ మన ప్రభుత్వం మొదలైంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ పలు రకాల సర్వేలు చేయించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పర్ఫామెన్స్ పై ఇప్పటికే సీఎం జగన్ కు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల ఇళ్లకు వెళ్తున్న వారిలో సరిగ్గా పర్ఫామ్ చేయని ఎమ్మెల్యేలకు జూన్ నెల వరకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత టికెట్లు ఎవరికి, ఎవరు ఎక్కడ పోటీ అనే అంశంపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
పార్టీ అధ్యక్షులు, రీజనల్ కో ఆర్టినేటర్లకు పూర్తి బాధ్యతలు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజక వర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్టినేటర్లు తదితరులు పాల్గొంటారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభిృద్ధి పథకాల వల్ల ప్రతీ ఇంటికీ జరిగిన మేలును వివరించడమే లక్ష్యంగా... ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. పార్టీ అధ్యక్షులకు, రీజనల్ కో ఆర్డినేటర్లకు పూర్తి బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్.. గతంలోనే ఐ ప్యాక్ టీమ్‌ను పరిచయం చేసి తగిన సాయం చేస్తారని వివరించారు. ఐ ప్యాక్ టీమ్ తో కోఆర్డినేషన్ చేసుకుని మంచి పలితాలు రాబట్టాలని, 175 స్థానాలు మన టార్గెట్ గా పని చేయాలని జగన్ మరోసారి వారికి గుర్తు చేశారు. బలహీనమైన నియోజకవర్గాల బాధ్యతలు కూడా మీవేనని పార్టీ నేతలకు జగన్ గతంలో లక్ష్యాన్ని నిర్దేశించారు.
సంక్షేమ పథకాలు వివరించడమే లక్ష్యంగా..
వీక్ గా ఉన్న చోట ఎమ్మెల్యే లను బలపరిచే బాధ్యత కూడ మీపైనే ఉందని జగన్ స్పష్టం చేశారు. నెల నెలా ఎమ్మెల్యే లతో మాట్లాడతా.. మీరు వారం వారం రివ్యూ చేసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాల్లో ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్న సీఎం, ఈసారి మాత్రం ఎక్కడా రాజీ పడకుండా వ్యవహరించాలన్నారు. ఇక పై రాబోయే ప్రతి నిమిషం చాలా కీలకమని, ఇలాంటి పరిస్దితుల్లో పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడిపేందుకు అవసరం అయిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ సూచించారు. గడప గడపకు ధైర్యంగా వెళుతున్నామంటే, మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింతగా వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధివిధానాల పై అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గ స్దాయిలో పార్టీలో విభేదాలను ఎట్టి పరిస్దితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రస్తుతం పని చేస్తున్న శాసన సభ్యుడు పని తీరుపై కూడ రిపోర్ట్ తీసుకుంటామని కార్యకర్తలతో తాను డైరక్ట్‌గా మాట్లాడతానన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని, త్వరలో సోషల్ మీడియా ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కష్ట కాలంలో అండగా ఉన్న వారికి సోషల్ మీడియా నిర్వాహకులతో కూడా చర్చిస్తామన్నారు. భవిష్యత్ లో కూడ సీఎం జగన్ పార్టీ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయిస్తారని, ప్రభుత్వం తరపున సమీక్షలు చేస్తున్నట్లే, పార్టీ పరిస్దితులు పై కూడా జగన్ పూర్తిగా వివరాలను తీసుకోవటంతో పాటుగా ఐ ప్యాక్ టీం తో కూడ నిత్యం చర్చిస్తారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.