అన్వేషించండి

Breaking News Live Updates: ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు అనుమతి

Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP 10th Exams KTR Sircilla AP Telangana Breaking News Live Updates 4th May 2022 Breaking News Live Updates: ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు అనుమతి
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివాహ వేడుక సహా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారం, దళితులు నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు శంకుస్థాపన, ఓ సర్పంచ్ సోదరుడి వివాహానికి హాజరు కావడంతో పాటు పలు ఈవెంట్లలో మంత్రి కేటీఆర్ నేడు పాల్గొననున్నారు.

ఉదయం  11 గంటలకు సిద్ధిపేటలోని రెడ్డి పంక్షన్ హాల్‌లో జరగనున్న అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాలరెడ్డి కుమారుడి వివాహానికి కేటీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరు కానున్నారు మంత్రి కేటీఆర్.

మధ్యాహ్నం 1 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకోనున్న రైస్ మిల్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మధ్యాహ్నం 1:30 గంటలకు సాయిమణికంఠ గార్డెన్‌లో జరగనున్న రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుని వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు..

దక్షిణ అండమాన్ సముద్రంలో అలజడి తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్, అంబర్ పేట, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, గుడిమల్కాపూర్, నాచారం, గోషామహల్, బాలానగర్, కాచిగూడ , గన్‌ఫౌండ్రీ, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కాప్రా ప్రాంతాల్లో బుధవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది.

భారీ వర్షం కారణంగా పవర్ కట్..
భారీ వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అమీర్ పేట, మలక్ పేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పవర్ కట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోగా, హైదరాబాద్‌లోని మరికొన్ని ఏరియాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెట్లు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మైత్రీవనం స్టేట్‌హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

భారీ ట్రాఫిక్..
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు చికురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్ వద్ద రోడ్డు మీద ఉన్న గుంతలో కారు ఇరుక్కుపోయింది. అదే ఏరియాలో ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 4th May 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 

తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.119.22 కాగా, 13 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.105.23 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, డీజిల్ ధర రూ.105.64 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.17 కాగా, డీజిల్‌‌పై 35 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.04కి అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.  పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 4th May 2022) లీటర్ ధర రూ.121.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.106.69 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 26 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ పై 59 పైసలు తగ్గడంతో లీటర్ రూ.121.48 కాగా, డీజిల్‌పై 55 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.02 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 

 

18:24 PM (IST)  •  04 May 2022

ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆదేశాలు ఇవ్వాలని ఓయూ వీసీని ఆదేశించింది. 

15:12 PM (IST)  •  04 May 2022

Paddy Procurement: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై శ్వేత పత్రం విడుదల

Paddy Procurement In India: వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ అగ్రస్థానంలో లేదనే అక్కసుతో రైతులపై కేంద్రం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిందని, రా రైసే తీసుకుంటామని మొండికేసీనా 3000 కోట్ల పైచీలుకు నష్టాన్ని భరించి ధాన్యం కొంటున్నారు సీఎం కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కానీ, నేడు ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను ఆపేలా కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. సౌకర్యాలు లేవని, గన్నీలు లేవని అసంబద్ద ఆరోపణలు చేస్తున్నారని, దీటుగా స్పందించి మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేశారు. 

కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు మిల్లులకు ధాన్యం చేరవద్దనే ప్రస్థుతం పిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అకాల వర్షాలకు తోడు రైతులకు త్వరగా డబ్బులు రాకుండా, ధాన్యం కొనకుండా అడ్డుకునేలా కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు. కేంద్రం ఒక్క బ్యాగు ఇవ్వకున్నా 7.77 కోట్ల గన్నీలు అందుబాటులో ఉంచామన్నారు. ఒకరిద్దరు మిల్లర్లు చేసే అక్రమాలు బూచీగా చూపి కొనుగోళ్లను అడ్డకోవడం సమంజసమేనా, తప్పుచేసిన మిల్లర్లపై క్రిమినల్ చర్యలు, ముక్కుపిండి వసూళ్లు చేస్తామన్నారు. 

అసలు ధాన్యం కొనడానికి ఒక్క రూపాయి ఇవ్వని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మీ తిరుతో కొనుగోల్లు నిలిచిపోయి తడిసిన ధాన్యంపై బాధ్యత తీసుకుంటారా అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. కొనుగోల్లు ఇప్పుడే మొదలైతే ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పుడే ఎలా మొదలుపెడతారో చెప్పాలన్నారు. జూలైలో వెరిఫికేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణ ఓట్లతో గెలిచిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రైతుల పక్షాన మాట్లాడాలని సూచించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget