News
News
X

Anti Hijab Row: ఇరాన్‌ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకున్న బాలీవుడ్ బ్యూటీ!

Anti Hijab Row: ఇరాన్‌లో మహిళలు చేస్తోన్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా తన జుట్టు కత్తిరించుకున్నారు హీరోయిన్ ఊర్వశి రౌతేలా.

FOLLOW US: 
 
Anti Hijab Row: ఇరాన్‌ మహిళల ఆందోళనలకు మద్దతుగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన జుట్టు కత్తిరించుకుంది. జుట్టు కత్తిరించుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

View this post on Instagram
 
A post shared by Urvashi Rautela (@urvashirautela)

" నా జుట్టు కత్తిరించుకున్నాను! మాషా అమిని చనిపోయిన తర్వాత ఆమెకు మద్దతుగా నిరసనలలో పాల్గొని మరణించిన ఇరాన్ మహిళలు, బాలికలకు మద్దతుగా నా జుట్టును కత్తిరించాను. ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల అంకిత భండారి కోసం కూడా ఈ పని చేశాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ జుట్టును కత్తిరించుకోవడం ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించండి. జుట్టును స్త్రీల అందానికి ప్రతీకగా చూస్తారు. అలాంటి జుట్టును బహిరంగంగా కత్తిరించడం ద్వారా తమపై జరిగే అన్యాయాన్ని, వివక్షను మహిళలు వ్యతిరేకిస్తున్నారు. తాము ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా జీవించాలో మహిళలు ఒకరి నుంచి తెలుసుకోవాల్సిన స్థితిలో లేరు. మహిళలు ఒక్కతాటిపైకి వచ్చి ఒక స్త్రీ సమస్యను మొత్తం స్త్రీజాతి సమస్యగా పరిగణిస్తే, స్త్రీవాదం మరింత బలంగా వినిపిస్తుంది.                                        "
-ఊర్వశి రౌతేలా, సినీ నటి

News Reels

ఇదీ జరిగింది

సెప్టెంబర్‌లో మాషా అమిని అనే ఇరాన్ మహిళ పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయింది. తన కేశాలను కొద్దిగా చూపించినందుకు.. కఠినమైన దుస్తుల నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు పోలీసులు ఆమెను చంపేశారని వార్తలు వచ్చాయి. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. నిరసన జ్వాలలతో అట్టుడుకిపోయింది.

బాలికలు, మహిళలు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లను తీసేసి ఆందోళనలకు దిగారు. మాషా అమిని హత్యకు నిరసనగా తమ జుట్లు కత్తించుకున్నారు. ఈ ఆందోళనలను అణిచేందుకు ప్రభుత్వం చేయించిన పోలీస్‌ దాడుల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఇరాన్ మహిళలకు మద్దతుగా జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా కూడా జుట్టు కత్తిరించుకుని మద్దతు తెలిపింది. తాము ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా బతకాలో అనేది ఎవరో నిర్ణయించాల్సిన అవసరం లేదనే సందేశం తమ నిరసనల్లో ఉందని పేర్కొంది.

Also Read: Delhi Excise Policy Case: ఫేక్ కేసులో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు: దిల్లీ డిప్యూటీ సీఎం

Published at : 17 Oct 2022 03:17 PM (IST) Tags: Hijab Row Anti Hijab Row Urvashi Rautela chops hair Iranian women protesters

సంబంధిత కథనాలు

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

ABP Desam Top 10, 4 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 4 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్