Delhi Excise Policy Case: ఫేక్ కేసులో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు: దిల్లీ డిప్యూటీ సీఎం
Delhi Excise Policy Case: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం ఆప్ కీలక నేత, దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
Delhi Excise Policy Case: ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణ నిమిత్తం దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ అగ్ర నేత మనీష్ సిసోడియా సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆయనకు సీబీఐ ఆదివారం సమన్లు జారీ చేసింది. సీబీఐ కార్యాలయానికి చేరుకునేముందు సిసోడియా ఓ ట్వీట్ చేశారు.
मेरे ख़िलाफ़ पूरी तरह से फ़र्ज़ी केस बनाकर इनकी तैयारी मुझे गिरफ़्तार करने की है. मुझे आने वाले दिनों में चुनाव प्रचार के लिए गुजरात जाना था। ये लोग गुजरात बुरी तरह से हार रहे हैं। इनका मक़सद मुझे गुजरात चुनाव प्रचार में जाने से रोकना है। 1/N
— Manish Sisodia (@msisodia) October 17, 2022
14 గంటలు
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వారం ప్రారంభంలో 25కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
ఇదీ కేసు
దిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.
దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇటీవల ఘజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉన్న సిసోడియా బ్యాంకు లాకర్‌ను కూడా ఆయన సమక్షంలో సీబీఐ పరిశీలించింది.
Also Read: Joe Biden Advice: బాలికకు బైడెన్ సలహా- అప్పటివరకు సీరియస్ డేటింగ్ వద్దట!