Rahul Gandhi: భారత్‌లో జెన్-Z ఉద్యమం- ఓట్ చోరీతోనే మొదలు- రాహుల్ సంచలన ట్వీట్
Breaking News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.
LIVE

Background
Andhra Pradesh Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి మాన్‌సూన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి కూడా వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు అవుతున్నారు. మండలిలో మాత్రం సభకు హాజరవుతున్నారు.
ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభంకానుంది. పది గంటలకు శాసన మండలి సమావేశమవుతుంది. రెండు సభలు కూడా ప్రశ్నోత్తరాలతోనే ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ గ్యాప్‌లో బీఏసీ భేటీ జరుగుతుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలి. ఏయే అంశాలు చర్చించాలనే అంశాలను నిర్ణయిస్తారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేనురాజు అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా చర్యలపై చర్చించారు.
కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. వీటి స్థానంలో ఇప్పుడు బిల్లులు తీసుకురానుంది. వీటితోపాటు సూపర్-6 పీ-4, రాష్ట్రంలో కొత్త పరిశ్రమలకు ఆహ్వానించే అంశాలు, మెగా డీఎస్సీ ఇలా పదికిపైగా అంశాలపై చర్చిస్తారు.
ఇవాళ మంత్రిమండలి సమావేశం కానుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన తీరుపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. మండలిలో ప్రతిపక్షం వ్యూహాలపై కూడా మాట్లాడనున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి కూడా తన పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకపోయినా, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. అందుకే మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చిస్తారు. ఎలాంటి అంశాలను సభలో ప్రస్తావించాలనే విషయాలపై బ్రీఫింగ్ ఇస్తారు.
Rahul Gandhi:భారత్‌లో జెన్-Z ఉద్యమం- ఓట్ చోరీ నుంచే మొదలు- రాహుల్ సంచలన ట్వీట్
Rahul Gandhi: భారత్‌లో జెన్-Z ఉద్యమం వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశంలో ఓట్లను గల్లంతు చేసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆరోపించిన ఆయన దీనిపైనే యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని వార్నింగ్ ఇచ్చారు. వారితో కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పని చేస్తారనని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
देश के Yuva
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
देश के Students
देश की Gen Z
संविधान को बचाएंगे, लोकतंत्र की रक्षा करेंगे और वोट चोरी को रोकेंगे।
मैं उनके साथ हमेशा खड़ा हूं।
जय हिंद! pic.twitter.com/cLK6Tv6RpS
Air India: విశాఖ- హైదరాబాద్ విమానం ఇంజిన్‌లో ఇరుక్కున్న పక్షి- ఆకాశంలో టెన్షన్ టెన్షన్
Air India: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ముప్పు తప్పింది. మధ్యాహ్నం 2.38 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయల్దేరిన వివిమానం ఇంజిన్‌లో పక్షి ఇరుక్కుంది. హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీన్ని గమనించిన పైలట్ జాగ్రత్తగా మళ్లీ ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన టైంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు.





















