అన్వేషించండి

Anantapur: మాట్లాడుకుందాం రమ్మని లవర్‌కి ఆహ్వానం, కారుతో ఢీ కొట్టిన ప్రియుడు - ట్విస్ట్ ఏంటంటే

యువతితో మాట్లాడాలని ఓ యువకుడు ఆమెను రమ్మని పిలవగా ఆమె స్కూటీలో అతను కార్లో బయలుదేరారు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో స్కూటీని వెనక నుండి కారు ఢీ కొట్టింది.

Anantapur Lovers News: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్కూటీ కారు ఢీ కొన్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో యువతి తలకి, కాలికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణంలోని గుండ్లప్ప దొడ్డి కాలానికి చెందిన గుజ్జల మైతిలిగా పోలీసులు గుర్తించారు. తొలుత దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే, విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.

యువతితో మాట్లాడాలని ఓ యువకుడు ఆమెను రమ్మని పిలవగా ఆమె స్కూటీలో అతను కార్లో బయలుదేరారు. ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో స్కూటీని వెనక నుండి కారు ఢీ కొట్టింది. యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. కారు డ్రైవర్ గుజ్జల భాస్కర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి డ్రైవర్ ను పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేశారు. దీంతో అతను ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని నిర్దారించి కేసు నమోదు చేశారు.

పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసిన మరో కోణం
ప్రియురాలిది ప్రియుడిది ఒకే గ్రామం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం అమ్మవారి పేటకు చెందిన వారిగా సమాచారం. మైతిలి తల్లి సువర్ణమ్మ కళ్యాణదుర్గం పట్టణంలో పోస్ట్ మాన్ గా విధులు నిర్వహిస్తోంది గత కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతి చెందగా, భర్త ఉద్యోగం భార్యకు వచ్చింది.

అమ్మవారిపేటలో నివాసం ఉన్న సమయంలో ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన భాస్కర్ అనే యువకుడు మైథిలిని వేధించేవాడు. ఇటీవల ఉద్యోగ బదిలీల్లో భాగంగా గత ఆరు నెలల నుంచి తల్లితో పాటు కళ్యాణ దుర్గంలో నివాసం ఉండేది. పెళ్లికి ఆ యువతి నిరాకరించడంతో పథకం ప్రకారమే హత్యాయత్నం చేసినట్లుగా  పోలీసులు తేల్చారు. అయితే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ యువతి యువకులు దూరపు బంధువులని వరుసకు అతను ఆమెకు సోదరుడు అవుతాడని గ్రామస్థులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget