Air Chief Marshal: నూతన ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్, సెప్టెంబర్ 30న బాధ్యతల స్వీకరణ
New Air Chief Marshal : భారత వైమానిక దళ నూతన సారథిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియామకం.. సెప్టెంబర్ 30 నుంచి బాధ్యతల స్వీకరణ.. ప్రకటన చేసిన కేంద్రం
New Air Chief Marshal : ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.. భారత వైమానిక దళ సారథిగా ఈ సెప్టెంబర్ 30న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పదవీ కాలం సెప్టెంబర్ 30న ముగియనుండగా.. ఆ రోజు నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సీంగ్ బాధ్యతలు చేపడతారని.. కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటలో తెలిపింది. సీనియారిటీ క్రమంలో ప్రస్తుత చీఫ్‌కు వారసుడిగా అమర్ ప్రీత్ సీంగ్‌ను ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.
5 వేల గంటల ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్ సహా అమర్ సింగ్ ప్రత్యేకతలు ఎన్నో:
ప్రస్తుతం ఎయిర్ పోర్స్‌కు వైస్ చీఫ్ మార్షల్‌గా ఉన్న ఎయిర్ మార్షల్ ఈ పదవిలో 2023 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. దానికి ముందు సెంట్రల్ ఎయిర్ కమాండ్‌లో కమాండ్ ఇన్ ఛీప్‌గా సేవలందించారు. 1964 అక్టోబర్ 27న జన్మించిన సింగ్.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అండ్ నేషనల్ డిఫెన్స్ కళాశాలల్లో చదువుకున్న ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ 1984 నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో వివిధ విభాగాల్లో 40 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తన కెరీర్‌లో ఆపరేషనల్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో పనిచేయడం సహా ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. టెస్ట్ పైలట్ హోదాలో MIG-29 ఫైటర్ విమానాల అప్‌గ్రడేషన్ ప్రోగ్రాంకు మాస్కోలో నాయకత్వం వహించడం సహా భారత్‌లో తయారయ్య తేజస్ యుద్ధ విమానాల ప్రాజెక్ట్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.
ప్రస్తుతం ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్‌గా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో.. కొత్త ఫైటర్ జెట్లను భారతా వైమానిక దళంలోకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరపడం సహా.. ప్రాంతీయ సెక్యూరిటీ లాండ్‌స్కేప్ ఆధారంగా ఎదురయ్యే సవాళ్లను, చైనా సరిహద్దుల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఎదురయ్యే సంక్లిష్టతలను సమర్థంగా ఎదుర్కొనేలా మన వైమానిక దళాన్ని ఆధునికీకరించే బాధ్యతలు ఆయన ముందున్నాయి. భారత వైమానిక దళంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 42 ఫైటర్ స్క్వాడ్రన్‌లు ఉండాల్సి ఉండగా.. అవి 30 మాత్రమే ఉన్నాయి. ఈయన ఇటీవల తరంగ్ శక్తి పేరిట జరిగిన మల్టీనేషనల్ వార్‌గేమ్స్‌లోనూ కీలక పాత్ర పోషించారు. మంచి సైనిక వ్యూహకర్తగా పేరున్న అమర్ ప్రీత్ సింగ్.. సైనిక శక్తి సమకూర్చుకోవడంలో స్వయంసమృద్ధి సాధించాల్సి ఉందని.. అందుకు డీఆర్‌డీఓ సహా ఇతర ఏజెన్సీలు తమ పని పూర్తి చేయడంలో అలసత్వం సహించలేమని జులైలో స్పష్టం చేశారు. వారి అలసత్వం దేశ రక్షణకు మూల్యం చెల్లించే పరిస్థితి ఎదురు కాకూడదని బహిరంగంగానే సూచించారు.
Also Read: Female Chinese Official : 58 మంది లవర్స్ - రోజూ అదే పని - చైనాలో మహిళా గవర్నర్‌కు 13 ఏళ్ల జైలు శిక్ష
ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ గానూ.. ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా అనేక వైమానిక దళ ఆపరేషన్లలో పాల్గొన్న అనుభవం ఉంది. 5 వేల గంటల ఫ్లైయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆయన.. వివిధ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు నడిపారు. ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ సేవలకు గాను.. పరమ్ విశిష్ట్ సేవా మెడల్‌తో పాటు అతి విశిష్ట్ సేవా మెడల్స్ కూడా ఆయనకు భారత ప్రభుత్వం అందించింది.