Air India : అప్పుడే పార్టీల్లో ఎయిరిండియా సిబ్బంది - ఆఫీసులోనే డీజే పార్టీలతో డాన్సులు - తిట్టిపోస్తున్న నెటిజన్లు
Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి దేశం ఇంకా మర్చిపోలేదు. ఎయిరిండియా ఉద్యోగులు మర్చిపోయారు. పార్టీలు చేసుకుంటున్నారు.

Air India SATS Executives DJ Party: అహ్మదాబాద్‌లో AI171 ఫ్లైట్ ప్రమాదంలో దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నష్టపోయిన కుటుంబాల గురించి .. వారి బాధల గురించి ఇంకా అందరూ మర్చిపోలేదు. అయితే ఎయిర్ ఇండియా SATS (AISATS) సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మాత్రం పార్టీలు చేసుకుంటున్నారు. విషాదం జరిగిన ఎనిమిది రోజుల తర్వాత గురుగ్రామ్ కార్యాలయంలో DJ పార్టీ చేసుకున్నారు. అందులో ఉద్యోగులు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడిోయ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చాలా మంది ఇప్పటికీ తమ కుటుంబసభ్యుల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 21 నాటికి 202 మాత్రమే అప్పగించారు. అనేక మంది మ-తులు ఇంకా DNA నిర్ధారణ కోసం మార్చురీల్లో ఉన్నారు.
జూన్ 20న జరిగిన వేడుకలో AISATS చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహం జకారియా, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ , బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ GM సంప్రీత్ కోటియన్ హాజరైనట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా లిమిటెడ్ , సింగపూర్‌కు చెందిన SATS లిమిటెడ్ మధ్య 50:50 జాయింట్ వెంచర్ అయిన AISATS, విమానాశ్రయ గ్రౌండ్ సేవలను నిర్వహిస్తుంది. వీరు సేవలు అందిస్తున్న విమానాల్లో అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ మార్గంలో కూలిపోయిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కూడా ఉంది.
It has only been a few days since the tragic Ahmedabad plane crash.
— Squint Neon (@TheSquind) June 22, 2025
Many families have not yet been able to see their loved ones for the last time; several bodies have still not been handed over.
Grief hangs heavy in households, funeral pyres are yet to cool. And at such a… pic.twitter.com/rrlekBNAeD
జూన్ 12న టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ఉన్న 241 మంది మరణించారు, చాలా మంది మృతదేహాలు తీవ్రంగా కాలిపోయాయి. ఈ వీడియోపై తీవ్ర విమర్శలు రావడంతో కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది, సోషల్ మీడియాలో వచ్చిన వీడిోయ ఏదైనా భావోద్వేగ అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు.
See this is what it is sab khud ka dekte hai hum ne bhi 1 week se khana khaya maze kiye ..
— sunny v sharma (@sunnyvsharma) June 22, 2025
Sirf family vale hi zindagi bhar pachtate hai
RIP and all strength to their families





















