(Source: ECI/ABP News/ABP Majha)
Viral News: టేకాఫ్ అవుతుండగా ఫ్లైట్‌ని ఢీకొట్టిన పక్షి, ఇంజిన్‌లో నుంచి భారీగా పొగలు
Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొట్టింది. అప్పటికప్పుడు టేకాఫ్‌ని నిలిపివేశారు. ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు.
Bird Hits Flight: గోవాలోని డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ని పక్షి ఢీకొట్టింది. సరిగ్గా టేకాఫ్ అయ్యే సమయంలో ఢీకొట్టడం వల్ల వెంటనే అప్రమత్తమైన పైలట్ అక్కడే ఆపేశాడు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని టేకాఫ్‌ని అప్పటికప్పుడు నిలిపివేశాడు. ప్యాసింజర్స్ అందరూ సురక్షితంగా ఉన్నారని సిబ్బంది వెల్లడించింది. ఫ్లైట్‌ని అన్ని విధాలుగా చెక్ చేసినట్టు స్పష్టం చేసింది. స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం తక్షణమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఉదయం 6.45 గంటలకు ఈ ఘటన జరిగింది. పక్షి ఢీకొట్టిన వెంటనే ఫ్లైట్ ఇంజిన్‌లో నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఫలితంగా టేకాఫ్ నిలిచిపోయింది. గోవా నుంచి ముంబయికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది చాలా తీవ్రమైన విషయం అని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా రన్‌వేపై పక్షులు ఎలా ఉన్నాయో ఆరా తీస్తున్నామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ స్పష్టం చేసింది.
"డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయానికి పక్షి ఢీకొట్టింది. పైలట్ వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ని నిలిపివేశాడు. స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులకు మా సిబ్బంది అన్ని విధాలుగా సహకారం అందించింది. వేరే ఫ్లైట్‌లో వాళ్లందరినీ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. కొంత మందికి ఫుల్ రీఫండ్ ఇచ్చాం. వాళ్ల కోరుకున్న తేదీలో మరో ఫ్లైట్‌ని బుక్ చేశాం"
- ఎయిర్ ఇండియా మేనేజ్‌మెంట్
“Air India flight AI684 from Goa, Dabolim to Mumbai this morning experienced a bird-hit during its take-off run. The cockpit crew discontinued the take-off as per Standard Operating Procedures to ensure safety of customers and crew. All passengers had disembarked safely, and the… pic.twitter.com/WApVHWJzcE
— ANI (@ANI) August 14, 2024
Also Read: Viral Video: కుక్కలు సింహాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా - వీడియో