Artifical Intelligence: ముస్తఫా ముస్తఫా అని బీచ్‌లో పాడుకుంటున్న జుకర్, మస్క్ - అంతా AI మాయ
Artifical Intelligence: ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ AI పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Artifical Intelligence:
AI పిక్స్ వైరల్..
ట్విటర్‌కి పోటీగా మార్క్ జుకర్ బర్గ్ Threads యాప్‌ని ఈ మధ్యే లాంఛ్ చేశాడు. అప్పటి నుంచి ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ మధ్య బయటకు కనిపించని యుద్ధం కొనసాగుతూనే ఉంది. జుకర్‌ని కవ్విస్తూ కొన్ని సెటైరికల్ ట్వీట్‌లు చేశాడు మస్క్. జుకర్ బర్గ్ కాపీ క్యాట్ అంటూ కొందరు గట్టిగానే విమర్శిస్తుంటే...ఆ కామెంట్స్‌ని ఎంజాయ్ చేశాడు మస్క్. ఇద్దరి మధ్య వైరం పెరుగుతున్న క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. AI జనరేటెడ్ పిక్స్‌ని చూసి నెటిజన్లు "వావ్" అంటున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే...ఎలన్ మస్క్, జుకర్ బర్గ్ కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సముద్ర తీరంలో నడుస్తున్నారు. సడెన్‌గా చూస్తే ఇది నిజమేనేమో అనుకునేంత సహజంగా ఉన్నాయి ఈ AI ఫొటోలు. మరో హైలైట్ ఏంటంటే...జుకర్ బర్గ్, ఎలన్ మస్క్ ఒకరినొకరు హగ్ చేసుకున్న ఫొటో కూడా ఇందులో కనిపించింది. ఈ కొలేజ్‌కి "The Good Ending" అని క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఇద్దరూ కలిసిపోయి ఇలా ఫ్రెండ్లీగా ఉంటే ఎలా ఉంటుందో అనే థాట్‌తో ఈ AI పిక్స్‌ని జనరేట్ చేశారు. చాలా క్యాజువల్‌గా టీషర్ట్, జీన్స్‌లలో కనిపించారు ఈ ఫొటోల్లో. అలా ట్విటర్‌లో పెట్టారో లేదో వెంటనే వైరల్ అయిపోయాయి. ఏకంగా ట్విటర్ బాస్ ఎలన్ మస్క్ కూడా ఈ ఫొటోలపై స్పందించాడు. లాఫింగ్ ఎమోజీతో రియాక్ట్ అయ్యాడు.
The good ending ❤️ pic.twitter.com/smQjNTzc45
— Sir Doge of the Coin ⚔️ (@dogeofficialceo) July 14, 2023
మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది. ఇది ట్విట్టర్‌కు డైరెక్ట్ కాంపిటీషన్‌గా నిలిచింది. మీ ఇన్స్టాగ్రామ్ ఐడీతో థ్రెడ్స్‌లో లాగిన్ చేయవచ్చు. అయితే ప్రైవసీ పరంగా థ్రెడ్స్ యాప్ సేఫేనా? థ్రెడ్స్ మన డేటాను ఎంత మేరకు కలెక్ట్ చేస్తుంది? వీటి గురించి కూడా డిస్కషన్ ప్రారంభం అయింది. 2020లో యాపిల్ కొత్త పాలసీని తీసుకువచ్చింది. మన ఫోన్లో ఇన్స్టాల్ చేసే యాప్స్ ఎంత సమాచారాన్ని కలెక్ట్ చేస్తాయో లిస్ట్ చేసి వినియోగదారులకు చూపిస్తారు. యాప్ స్టోర్‌లో దీనికి సంధించిన అధికారిక లిస్టింగ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. థ్రెడ్స్ మనకు సంబంధించి ఎంత డేటాను కలెక్ట్ చేస్తుందో ఈ లిస్ట్‌లో చూడండి.థ్రెడ్స్ కలెక్ట్ చేసే డేటా ఇదే
1. హెల్త్, ఫిట్నెస్
2. ఆర్థిక పరమైన సమాచారం
3. మన ఫోన్లోని కంటెంట్ (ఫొటోలు, వీడియోలు, ఫోన్లోని ఫైల్స్)
4. బ్రౌజింగ్ హిస్టరీ
5. మనం ఫోన్లో ఏమేం ఉపయోగిస్తున్నామనే డేటా
6. యాపిల్ డయాగ్నోస్టిక్స్
7. మనం చేసే కొనుగోళ్లు
8. లొకేషన్
9. కాంటాక్ట్స్
10. ఐఫోన్ ఐడెంటిఫయర్స్
11. మనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం
14. ఇతర సమాచారం (Other Data)నిజానికి ట్విట్టర్ కూడా మన ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. కానీ థ్రెడ్స్ స్థాయిలో ఎప్పుడూ కలెక్ట్ చేయలేదు. వినియోగదారుల హెల్త్, ఫిట్నెస్ డేటాను కూడా థ్రెడ్స్ కలెక్ట్ చేయడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం.
Also Read: హనుమంతుడికి మించిన గొప్ప రాయబారి ఎవరూ లేరు, మోదీ ప్రధాని అవడం ఈ దేశం అదృష్టం - జైశంకర్