News
News
X

Punjab CM Bhagwant Mann: 'ఫుల్లుగా తాగిన సీఎం- విమానం నుంచి దించేసిన సిబ్బంది!'- మాన్‌పై సంచలన ఆరోపణలు

Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్.

FOLLOW US: 

Punjab CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై సంచలన ఆరోపణలు చేసింది శిరోమణి అకాలీ దళ్ పార్టీ. ఇటీవల జర్మనీ పర్యటనలో సీఎం భగవంత్‌ మాన్‌ మద్యం మత్తులో ఉన్నందున.. ఆయన్ను ఫ్లైట్‌ నుంచి దించేశారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అందుకే మాన్.. దిల్లీలో జరిగిన ఆప్‌ జాతీయ సమావేశానికి హాజరుకాలేక పోయారని విమర్శించారు. 

తీవ్ర ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలు ఇబ్బంది పడేలా సీఎం భగవంత్ మాన్ ప్రవర్తించారని శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు.

" మద్యం మత్తులో కనీసం నడవలేని స్థితిలో ఉన్న భగవంత్ మాన్​ను విమానం నుంచి దించేశారు. దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైంది. ఆప్​ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను ఇబ్బందిపడేలా చేశాయి. ఈ విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అసలు ఏం జరిగిందో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంగా చెప్పాలి. పంజాబ్​ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి.                       "
-సుఖ్‌బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ అధినేత

ఖండించిన ఆప్

ఈ ఆరోపణలను ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షాలు అక్కసుతో ఈ విమర్శలు చేశాయని ఆప్‌ అధికార ప్రతినిధి మల్విందర్‌ సింగ్‌ కాంగ్‌ అన్నారు.

" సీఎం సెప్టెంబర్‌ 19న షెడ్యూల్‌ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్‌ తన పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్‌ ఎయిర్‌లైన్స్‌లో తనిఖీ చేసుకోండి.                                                       "
-మల్విందర్ సింగ్, ఆప్ అధికార ప్రతినిధి

ఇదీ జరిగింది

ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఆదివారం భారత్​కు తిరిగొచ్చారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం ఆలస్యంగా రావడంతో ఈ ఆరోపణలు వచ్చాయి. 

Also Read: Joe Biden On Covid-19: కరోనా కథ ముగిసింది- జో బైడెన్ కీలక ప్రకటన

Also Read: Nandigram Cooperative Body Election: బంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్- భాజపా భారీ విజయం!

Published at : 19 Sep 2022 05:28 PM (IST) Tags: Punjab CM Bhagwant Mann Heavily Drunk Deplaned In Germany AAP Denies Charge

సంబంధిత కథనాలు

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Gandhi Jayanti 2022: శుక్రవారానికి గాంధీజీకి ఓ స్పెషల్ లింక్ ఉందట, ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు ఆయనే

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

Moola Nakshatra : రేపు బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

మూలాన‌క్ష‌త్రంలో దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులు- విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

Russia Ukraine War: మిస్టర్ పుతిన్ మీకు అర్థమవుతోందిగా, ఒక్క ఇంచును కూడా తాకనివ్వం - బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

IND W vs SL W T20: గెలుపుతో ఆసియా కప్‌ ప్రారంభించిన టీమిండియా - శ్రీలంక మహిళల జట్టుపై భారీ విజయం!

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?