Lavanya and Raj Tarun case: లావణ్య, రాజ్ తరుణ్ మధ్యలో మంత్రి - వడ్డీకి డబ్బులిచ్చారట - ఇంటిపైనే కన్ను ?
Raj Tarun: రాజ్ తరుణ్ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారు. ఆ ఇంటిని తనఖా పెట్టుకుని యాభై లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Actress Lavanya: కోకాపేటలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రాజ్ తరుణ్ ఇంట్లో లావణ్య నివాసం ఉంటున్నారు. ఇద్దరూ అక్కడే చాలా కాలం పాటు సహజీవనం చేశారు. అయితే తర్వాత రాజ్ తరుణ్ బయటకు వెళ్లిపోయారు. లావణ్య మాత్రం ఆ ఇంట్లోనే ఉంటున్నారు. మూడు రోజుల కిందట అది తన కుమారుడి ఇల్లు అని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చారు. లావణ్య ఇంట్లోకి రానివ్వకపోవడంతో అక్కడే ధర్నా చేశారు. చివరికి కొంత మంది తనపై దాడి చేశారని లావణ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు చివరికి లావణ్యకు సర్ది చెప్పి రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి వెళ్లేలా చేశారు.
రాజ్ తరుణ్ ఇంటిని తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన మంత్రి ?
అయితే ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఇంటిని తనఖా పెట్టుకుని ఓ మంత్రి రాజ్ తరుణ్, లావణ్యలకు పదిహేను లక్షలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారు తిరిగి చెల్లించకపోవడంతో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారని అంటున్నారు. యాబై లక్షల్లో 35 లక్షలు రాజ్ తరుణ్..పదిహేను లక్షలు లావణ్య తీసుకున్నారని చెబుతున్నారు. వడ్డీలతో కలిసి ఈ మొత్తం చాలా పెద్ద మొత్తం కావడంతో కట్టేందుకు రాజ్ తరణ్, లావణ్య సిద్ధపడటం లేదు. పైగా ఇద్దరి మధ్య వివాదాలు రావడంతో అసలు పట్టించకోలేదు.
అప్పు చెల్లించకపోవడంతో ఇంటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో మంత్రి ?
తన డబ్బులను వడ్డీతో సహా తనకు ఇవ్వకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని ఆ మంత్రి తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో లావణ్య మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. రాత్రి నలుగురు మహిళలు వచ్చి వేధించారని.. తనను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారని అలా చేస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని.. అలా చేసుకునేది ఏదో పోలీస్ స్టేషన్ ముందే చేసుకుంటానని వాపోయారు. మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి నలుగురు మహిళలు తన ఇంటికి చేసిన రచ్చపై ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఆ వడ్డీ వ్యాపారి మంత్రి ఎవరు ?
రాజ్ తరుణ్, లావణ్యలకు అప్పు ఇచ్చిన ఆ మంత్రి ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమా వాళ్లతో సన్నిహితంగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేసే వారు అయి ఉంటారని భావిస్తున్నారు. ఆయన ఎవరు అన్నది ఇంకా బయటకు రాలేదు. ఈ వివాదంలో రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదు. ఆయన ఇటీవలి కాలంలో బయటకు కనిపించడం లేదు ఆ ఇల్లు తనదా.. లావాణ్యదా.. ఎవరికైనా తాకట్టు పెట్టారా అన్న అంశాలపై ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.




















