అన్వేషించండి

Dry Ice: ఐస్‌క్రీమ్ అనుకుని డ్రై ఐస్ తిన్న మూడేళ్ల బాలుడు, చికిత్స పొందుతూ మృతి

Dry Ice: ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల బాలుడు డ్రై ఐస్ తిని అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Boy Dies After Consuming Dry Ice: ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్ల బాలుడు డ్రై ఐస్ తిని (Dry Ice) ప్రాణాలు కోల్పోయాడు. గత వారంలో జరిగిన ఓ పెళ్లికి వెళ్లిన బాలుడు అక్కడ ఫాగ్ ఎఫెక్ట్స్ కోసం తీసుకొచ్చిన ఐస్‌ని ఐస్‌క్రీమ్‌ అనుకుని తినేశాడు. ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. మామూలు ఐస్‌ అని పొరపాటు పడి డ్రై ఐస్‌ని మింగడం వల్ల బాలుడు ఇలా అనారోగ్యానికి గురై మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. డ్రై ఐస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పొరపాటున కూడా ఈ ఐస్‌ని తినకూడదని తేల్చి చెబుతున్నారు. గత నెల కూడా ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. గుడ్‌గావ్‌లోని ఓ కేఫ్‌లో మౌత్‌ ఫ్రెషనర్‌ పేరుతో డ్రై ఐస్‌ని సర్వ్ చేశారు. ఈ ఐస్‌ని తిన్న ఐదుగురు ఆసుపత్రిపాలయ్యారు. తిన్న వెంటనే వాళ్లు రక్తం కక్కుకున్నారు. నోరంతా మండిపోయింది. మౌత్ ఫ్రెష్‌నర్ అనుకుని పొరపాటున డ్రై ఐస్‌ని సర్వ్ చేసినట్టు కేఫ్ సిబ్బంది సంజాయిషీ చెప్పింది. 

ఏంటీ డ్రై ఐస్..?

డ్రై ఐస్ అనేది అసలు ఐస్ కాదు. కార్బన్ డయాక్సైడ్‌తో తయారు చేసిన ఓ ఘనపదార్థం. చూడడానికి ఐస్‌లానే ఉంటుంది. ప్రమాదవశాత్తు దీన్ని నోట్లో వేసుకుంటే నోరంతా మంటెక్కుతుంది. ఫుడ్‌, ఫార్మసీ ఇండస్ట్రీలలో ప్రొడక్ట్స్‌ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచేందుకు ఈ డ్రై ఐస్‌ని వాడతారు. -78 డిగ్రీల సెల్సియస్ వద్ద తయారు చేసే ఈ ఐస్‌ని ఆహార పదార్థాల ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి తొందరగా కరిగిపోవు. ఇక స్పెషల్ ఎఫెక్ట్స్ కోసమూ ఈ డ్రై ఐస్‌ని వాడతారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Supreme Court: ఏఐతో పిటిషన్ రాసుకొచ్చి సుప్రీంకోర్టులోనే అభాసుపాలయ్యాడు - ఈ స్వెట్టర్ వ్యాపారి ఇలా తెల్లారింది !
ఏఐతో పిటిషన్ రాసుకొచ్చి సుప్రీంకోర్టులోనే అభాసుపాలయ్యాడు - ఈ స్వెట్టర్ వ్యాపారి ఇలా తెల్లారింది !
ఈ బైక్‌ మీ దగ్గర ఉంటే సేఫ్టీ మీ చుట్టూ ఉన్నట్లే! - అత్యంత చవకైన Dual Channel ABS బైకులు
డ్యూయల్ ఛానల్ ABS ఉన్న చవకైన బైకులు ఇవే - రూ.1.05 లక్షల నుంచే అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్
First Passive Euthanasia: హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు
హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు పర్మిషన్.. తీర్పు వెల్లడిస్తూ జడ్జి కన్నీళ్లు.. భారత్‌లో తొలి కేసు

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget