Rich Metal Asteroid: ఈ ఆస్ట్రాయిడ్ భూమ్మీదకు తెస్తే, అందరూ అంబానీలు అదానీలు అయిపోతారు
Rich Metal Asteroid: సైక్ గ్రహశకలాన్ని భూమ్మీదకు తెచ్చి పంచితే కనీసం ఒక్కొకరికి 7 వేల కోట్ల రూపాయలు వస్తాయట.
16 Psyche Rich Metal Asteroid:
ఉన్నపళంగా మీకో 7 వేల కోట్ల రూపాయల డబ్బు కావాలా. అదేంటీ డబ్బు ఇస్తామంటే ఎవరికి మాత్రం వద్దు అంటారు అనుకుంటున్నారా. అయితే దానికి చాలా కష్టపడాలి. అంతరిక్షంలో భూమికి చాలా దూరంగా తిరుగుతున్న ఓ ఉల్కను భూమి మీదకు తీసుకురావాలి. దాన్ని భూమి మీదకు తెస్తే నువ్వేంటీ ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రజలకు అందరికీ పంచేసినా కనీసంలో కనీసం ఒక్కొకరికి 7 వేల కోట్ల రూపాయలు వస్తాయి. ఎస్ ఆ ఆస్ట్రాయిడ్ పేరే సైక్.
సైక్ ఆస్ట్రాయిడ్ ఎక్కడుంది..?
నాసా ఈ గ్రహశకలం గురించి పూర్తి డీటైల్స్ తెలుసుకోవాలని ప్రయోగాలు చేస్తూనే ఉంది. 1852 మార్చి 7న ఈ గ్రహశకలాన్ని కనిపెట్టారు. సాధారణంగా మనకు తెలిసిన గ్రహాలన్నీ అయితే స్టోన్ తోనో లేదా ఐస్ తోనో ఉన్నాయి. కానీ అతి తక్కువగా ఉండే M Type ఆస్ట్రరాయిడ్ ఇది. M అంటే మెటల్. ఐరన్, నికెల్ తో ఏర్పడిన ఓ పెద్ద లోహ గ్రహశకలం అన్నమాట ఇది. మన భూమి కోర్ కూడా ఇలాగే మెటల్ రిచ్ కానీ పైన మనం ఉన్న స్టోన్ లేయర్ ఉంది. ఓన్లీ కోర్ ఒక్కటే విడిగా ఉండిపోయింది అనుకోండి. ఇదిగో అచ్చం ఇలా సైక్ ఆస్ట్రాయిడ్ లా ఉండేది భూమి కూడా. మొత్తం 226 కిలోమీటర్లు ఉంటుంది దీని డయా మీటర్. మన చందమామలో జస్ట్ 1 శాతం ఉంటుంది. జ్యూపిటర్ కి మార్స్ కీ మధ్య ఓ ఆస్ట్రాయిడ్ బెల్డ్ ఉంది. ఆ బెల్ట్ లో కొంచెం బయటనే ఉంది సైక్ ఆస్ట్రాయిడ్ . సూర్య కుటుంబం ఏర్పడే క్రమంలో జ్యూపిటర్ భారీ తనం వల్ల గ్రహశకలాలుగా మిగిలిపోయిన వాటిలో ఇది కూడా ఒక్కటి అన్నమాట.
సైక్ పరిశోధనలకు ఓ స్పేస్ క్రాఫ్ట్ :
జనవరి 2017లో నాసా ఓ ప్రోగ్రాం టేకప్ చేసింది. ఈ సైక్ ఆస్ట్రాయిడ్ కక్ష్యలోకి ఓ స్పేస్ క్రాఫ్ట్ ను పంపించాలని ప్లాన్ చేసింది దాని పేరు కూడా సైక్ స్పైస్ క్రాఫ్ట్ అనే పెట్టింది. మొత్తం 17 ప్రఖ్యాత యూనివర్సీటీలు ఈ ప్రాజెక్ట్ మీద పరిశోధన చేస్తున్నాయి. ఆరిజోనా యూనివర్సిటీ లీడ్ గా వ్యవహరిస్తోంది. 2022లోనే స్పేస్ ఎక్స్ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించాలని చూసినా టెక్నికల్ ప్రాబ్లంతో వాయిదా పడింది. 2023 అక్టోబర్ 1 న లాంఛ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సోలార్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ద్వారా మార్స్ పక్క నుంచి వెళ్లి సైక్ ఆస్ట్రాయిడ్ చుట్టూ తిరుగుతూ స్పేస్ క్రాఫ్ట్ కి ఉండే గామా రే స్పెక్రోమీటర్, న్యూట్రాన్ స్పెక్ట్రోమీటర్, మాగ్నటో మీటర్స్ ద్వారా దాన్ని ఫోటోలు తీయటం, దాన్ని ప్రొపర్టీస్ మీద స్టడీ చేసే విధంగా ఈ స్పేస్ క్రాఫ్ట్ కు రూపకల్పన చేశారు.
వేల కోట్లకు అధిపతులం మనమే :
ఈ గ్రహశకలం వల్ల భూమికి ఎప్పటికీ నష్టం లేదు. కానీ మనకు ఇది చాలా విలువైంది. అసలు మెటల్ ఎలా ఫామ్ అయ్యింది ఈ ఆస్ట్రాయిడ్ మీద తెలుసుకోవటంతో పాటు కొన్ని లక్షల సంవత్సరాలకు భూమికి సరిపడా లోహఖనిజాలు దీనిపైన ఉన్నాయి. ఈ లోహాల విలువ 10వేల క్వాడ్రిలియన్ డాలర్లు. సింపుల్‌గా చెప్పాలంటే భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పంచితే కనీసం ఏడువేల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా. ఈ ఆస్ట్రాయిడ్ మీద నికెల్, ఉక్కు నిల్వలు 17 మిలియన్ బిలియన్ టన్నులుగా ఉండొచ్చని బెర్న్‌స్టీన్ అనే రీసెర్చ్ సంస్థ లెక్కలు గట్టింది. సో సైక్ స్పేస్ క్రాఫ్ట్ కనుక ఆ ప్రాపర్టీస్ ను లెక్కగట్టి..పరిశోధనలకు వీలయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అందించగలిగితే..ఫ్యూచర్ మెటల్స్ కోసం భూమిని నాశనం చేసుకోవాల్సిన అవసరం తప్పే అమూల్య సంపద మన కళ్ల ముందే ఉందన్నమాట.