Daycare abuse: డే కేర్‌లో పిల్లల్ని వదిలేవారు తెలుసుకోవాల్సిన విషయం - నోయిడాలో జరిగింది ఎక్కడైనా జరగొచ్చు !
Noida daycare: కుటుంబం గడవాలంటే భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. పిల్లల్ని చూసుకోవాలని డే కేర్‌లో వేస్తే వారు హింసిస్తున్నారు.

15 month old child abused at Noida daycare : బిజీ జీవితంలో పిల్లల్ని చూసుకునేందుకు పెద్దవాళ్లు ఉండటం లేదు. తల్లిదండ్రులకు తీరిక ఉండటం లేదు. అందుకే డే కేర్ సెంటర్లు అన్ని చోట్లా స్థాపించారు. కానీ వాటిలో పిల్లల్ని ఎలా చూస్తున్నారన్నదానిపై తల్లిదండ్రులకు అవగాహన ఉండటం లేదు. ఆ చిన్న పిల్లలకు తమను డే కేర్‌లో హింసించాలని చెప్పడం కూడా చేతకాదు. నోయిడా డే కేర్ లో జరిగిన ఈ ఘటన... డే కేర్‌లో పిల్లల్ని వదిలి వెళ్లేవారికి షాక్‌కు గురి చేస్తుంది.
నోయిడాలోని సెక్టార్ 142లో ఉన్న బ్లిప్పీ డేకేర్ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక మహిళా కార్యకర్త, 15 నెలల చిన్నారిపై దాడి చేసింది. సీసీటీవీ పుటేజ్‌లో ఈ మహిళ చిన్నారిని మూడుసార్లు నేలపై విసిరి, వీపు , ముఖంపై కొట్టడం, అలాగే బిడ్డ కాలుపై కొరకడం వంటివి చేసినట్లుగా కనిపిస్తుంది. బిడ్డ శరీరంపై కొరికిన గుర్తులు , ఇతర గాయాలు కనిపించాయి. ఈ దారుణమైన దాడి సీసీటీవీలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
#NOIDA DAY CARE में मासूम बच्ची के साथ मेड ने करी दरिंदगी
— PRIYA RANA (@priyarana3101) August 11, 2025
15 महीने की मासूम को को मेड ने दांतो से काटा
बच्ची को मेड ने पटक दिया
पूरी घटना डे-केयर के CCTV में कैद हो गई
पैरेंट्स की शिकायत की आरोपी गिरफ्तार
सेक्टर-137 स्थित पारस टेरिया सोसायटी स्थित प्ले स्कूल की घटना… pic.twitter.com/zG5WmNsd6d
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, సెక్టార్ 142 పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఆ చిన్నారిపై దాడికి పాల్పడిన యువతి మైనర్ కావడంతో, ఆమెను జువెనైల్ హోమ్‌కు పంపారు. డేకేర్ సెంటర్ యజమానిని కూడా ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో బాధితురాలైన 15 నెలల చిన్నారి, దాడి చేసిన యువతి మైనర్ కావడంతో, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు సమాచారం అందించాపు, డేకేర్ యజమానిపై కూడా చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు లేఖ రాశారు. ఇతర డేకేర్ సెంటర్‌ల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లను తనిఖీ చేయాలని నిర్ణియంచారు.
A Noida daycare attendant has been detained after CCTV footage showed her assaulting a 15-month-old girl, leaving bite marks and intentionally dropping her to the ground.
— The CSR Journal (@thecsrjournal) August 11, 2025
The incident occurred at a daycare in Paras Tierea residential complex, Sector 137, run by the residents’… pic.twitter.com/oV5nJvZLuk
ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది, డేకేర్ సెంటర్‌లలో పిల్లల భద్రతపై సమాజంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన డేకేర్ సౌకర్యాలలో సరైన నియంత్రణ , పర్యవేక్షణ లోపాలను బహిర్గతం చేసింది.





















