News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : ది ఘోస్ట్
రేటింగ్ : 3/5
నటీనటులు : నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు
సినిమాటోగ్రఫీ : ముఖేష్ జి.
సంగీతం: మార్క్ కె.రాబిన్స్, భరత్-సౌరభ్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహనరావు, శరత్ మరార్
రచన, దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
విడుదల తేదీ: అక్టోబర్ 5, 2022

బంగార్రాజు బ్లాక్‌బస్టర్ తర్వాత నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు తెరపై ఈ స్థాయి యాక్షన్ సన్నివేశాలు ఉన్న సినిమా ఇటీవలి కాలంలో రాకపోవడమే దీనికి కారణం. ప్రవీణ్ సత్తారు ముందు సినిమా ‘పీఎస్‌వీ: గరుడవేగ’ యాక్షన్ థ్రిల్లర్‌లోనే తెరకెక్కి సూపర్ హిట్ కొట్టింది. నాగార్జున కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ వస్తున్నా వెనక్కి తగ్గకుండా అదే రోజు విడుదల చేస్తున్నారు. మరి ‘ది ఘోస్ట్’ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగ్ కోరుకున్న హిట్ దక్కిందా?

కథ: విక్రమ్ (నాగార్జున) ఒక ఇంటర్‌పోల్ ఏజెంట్. తనకు కోపం కూడా చాలా ఎక్కువ. తోటి ఇంటర్‌పోల్ ఆఫీసర్ ప్రియ(సోనాల్ చౌహాన్)తో రిలేషన్ షిప్‌లో ఉంటాడు. ఒక డిప్లొమాట్ కొడుకును కాపాడాల్సిన మిషన్‌లో అనుకోని పరిణామాల మధ్య ఆ పిల్లాడు చనిపోతాడు. అది విక్రమ్‌ను ఇంకా బాధిస్తుంది. దీంతో అండర్‌వరల్డ్ మీద యుద్ధం చేయడానికి సిద్ధం అవుతాడు. ఇంటర్‌పోల్ జాబ్‌కు కూడా రిజైన్ చేస్తాడు. ఐదు సంవత్సరాల తర్వాత తనకు అక్క అను (గుల్ పనాగ్) దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తనకు, తన కూతురు అదితికి (అనిఖా సురేంద్రన్) ప్రాణ హాని ఉందని విక్రమ్ సాయం కోరుతుంది. వాళ్లను విక్రమ్ కాపాడగలిగాడా? ఈ ఐదు సంవత్సరాల్లో విక్రమ్ ఏం చేశాడు? తనకు ఘోస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఘోస్ట్ సినిమా ప్రారంభించినప్పటి నుంచి దీన్ని ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రచారం చేశారు. సినిమా చూశాక అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు తీయడంపై ప్రవీణ్ సత్తారుకు ఉన్న పట్టు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఫైట్‌లో కనిపిస్తుంది. పోరాట సన్నివేశాలన్నీ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో ఉంది. స్క్రీన్ మీద వయొలెన్స్, రక్తపాతం కూడా సాధారణ యాక్షన్ సినిమాల కంటే కొంచెం ఎక్కువగానే అనిపించినా కథకు అది అవసరం అనిపిస్తుంది. తన వాళ్లకు ఏమైనా జరిగితే విక్రమ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనే ఎమోషన్‌ను వయొలెన్స్ ద్వారా చక్కగా ప్రెజెంట్ చేశారు. టేకెన్, జాన్ విక్ వంటి హాలీవుడ్ సినిమాల తరహాలో ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. యాక్షన్ జోనర్‌ను ఇష్టపడే ప్రేక్షకులను థియేటర్‌లో ఇవి థ్రిల్ చేస్తాయి.

అయితే కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా మధ్యలో వచ్చే సన్నివేశాలు కూడా టేకెన్, జాన్ విక్‌లను తలపించడం ఇబ్బంది పెడుతుంది. ఈ స్థాయి యాక్షన్ ఉన్న సినిమాలో ఎమోషన్‌ను, అందులోనూ ఫ్యామిలీ సెంటిమెంట్‌ను మిక్స్ చేయడం చాలా కష్టమైన పని. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ సీన్లు పంటి కింద రాళ్లలా మారతాయి. ఇక్కడ ప్రవీణ్ సత్తారు కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది. గరుడవేగలో ఫ్యామిలీ సీన్లు ఉన్నా... అవసరం అయినంత మేరకే ఉంటాయి. ఘోస్ట్‌లో గుల్ పనాగ్ ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దీంతో కథతో డిటాచ్ అయిపోతూ ఉంటాం. ఇంట్రడక్షన్ సీన్‌తోనే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ రోల్ ఏంటి అనేది అర్థం అయిపోతుంది. నాగార్జున, సోనాల్ చౌహాన్ మధ్య లిప్‌లాక్‌లు, వేగం పాటలో సోనాల్ చౌహాన్ అందాల ప్రదర్శన యువతను ఆకట్టుకుంటుంది. అయితే కథ పరంగా చూస్తే తన పాత్ర లేకపోయినా నష్టం ఏమీ ఉండదు. ఫ్యామిలీ ఎమోషన్‌ను అవసరం అయినంత వరకే ఉంచి, రొమాంటిక్ ట్రాక్‌ను కట్ చేసి ఉంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన గొప్ప సినిమాల్లో ఒకటిగా ఘోస్ట్ నిలిచేది.

టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. దినేష్ సుబ్బరాయన్, కిచ్చా అందించిన యాక్షన్ సీన్లు సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం కూడా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అందించారు. మార్క్ కే.రాబిన్స్, భరత్-సౌరభ్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ ముఖేష్.జి విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా పూర్‌గా ఉంది. దానిపై మరింత దృష్టి పెట్టాల్సింది.

Also Read: 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

ఇక నటీనటుల విషయానికి వస్తే... నాగార్జునకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు గతంలో కూడా చేశాడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్‌గా చేసినట్లు కనిపిస్తుంది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఆకట్టుకుంటారు. మిగతా వారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే వారికి ఘోస్ట్ కచ్చితంగా నచ్చుతుంది. అస్సలు డిజప్పాయింట్ చేయదు.

Also Read : 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Published at : 05 Oct 2022 11:55 AM (IST) Tags: Sonal Chauhan Praveen Sattaru The Ghost ABPDesamReview Nagarjuna The Ghost Movie Review The Ghost Movie Review in Telugu The Ghost Review The Ghost Rating The Ghost Telugu Movie Review

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

టాప్ స్టోరీస్

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

తెలంగాణలో రేపే కౌంటింగ్‌-ఉదయం 10గంటల్లోగా తొలి ఫలితం

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?