News
News
X

FDFS Review: ఫస్ట్ డే ఫస్ట్ షో రివ్యూ: అనుదీప్ కథ ఆకట్టుకుంటుందా? జాతి రత్నాలు స్థాయిలో ఉందా?

ఫస్ట్ డే ఫస్ట్ షో తెలుగు సినిమా రివ్యూ

FOLLOW US: 

సినిమా రివ్యూ: ఫస్ట్ డే ఫస్ట్ షో
రేటింగ్: 1.5/5
నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, సీవీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా తదితరులు
కథ: అనుదీప్ కేవీ
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి
సంగీతం : రథన్
నిర్మాత: శ్రీజ ఏడిద, శ్రీరాం ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి 
విడుదల తేదీ: సెప్టెంబర్ 2, 2022

‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కథ అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. అనుదీప్ కథ అందించడం, పవన్ కళ్యాణ్ ఖుషి నేపథ్యంలో నడిచే పీరియాడిక్ కామెడీ సినిమా కావడం, ట్రైలర్‌లో మంచి ఫన్ కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందా? 

కథ: ఖుషి సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచి సినిమా మార్నింగ్ షో పడే వరకు జరిగే కథ ఇది. శ్రీను (శ్రీకాంత్ రెడ్డి) పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. తను ప్రేమించే అమ్మాయి లయ (సంచితా బసు) కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఖుషి సినిమా మొదటి రోజు మొదటి ఆట శ్రీనుతో కలిసి చూడాలని, దానికి టికెట్లు సంపాదించమని శ్రీనును లయ అడుగుతుంది. దానికి శ్రీను ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఖరికి టికెట్లు సంపాదించాడా? ఇద్దరూ కలిసి ఖుషి సినిమా చూశారా? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ: ‘జాతి రత్నాలు సినిమాలో కథ ఎక్కడుంది? అన్నీ కామెడీ సీన్లేగా... కానీ అన్నీ వర్కవుట్ అయ్యాయి.’ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ‘అలీతో సరదాగా’ షోలో చెప్పిన మాటలివి. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా దాదాపు అంతే. కథానాయకుడు ఖుషి సినిమా టికెట్లు సంపాదించడం అనే పాయింట్ మీద కామెడీ సీన్లతో సినిమా నడిపించేయాలని డిసైడ్ అయ్యారు. ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్‌నే ఈ సినిమాకు కూడా కథ అందించారు. కానీ జాతి రత్నాలు మ్యాజిక్ మాత్రం ఇక్కడ అస్సలు వర్కవుట్ కాలేదు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడీ టైమింగ్ అక్కడ పెద్ద ప్లస్ కాగా, ఈ సినిమాలో లీడ్ కాస్ట్ అంతా కొత్త వాళ్లే కావడం దెబ్బ కొట్టింది.

‘కథ రాయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. మంచి కథ రాసుకుంటే మంచి సినిమా అక్కడ తీసేసినట్లే.‘ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు కథ అందించిన అనుదీప్ చెప్పిన మాటలివి. కానీ ఈ సినిమాలో సీన్లు మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా సాగుతాయి. టికెట్ల కోసం హీరో చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టించాలి. కానీ భారీగా విసిగిస్తాయి. మన దగ్గర టికెట్లు ఉంటే అవే హీరోకు ఇచ్చేసి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. శవం జేబులో నుంచి టికెట్లు దొంగిలించడానికి చేసే ప్రయత్నాలు చూస్తే జాతి రత్నాలు తీసిన డైరెక్టరేనా ఇలాంటి సీన్లు రాసింది అనిపిస్తుంది.

ఈ సినిమాకు వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహించారు. వీరిలో ఒకరైన ఒకరైన వంశీధర్ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ఉండే ఒక పాత్రలో కనిపించారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు ఇద్దరు నిర్వర్తించారేమో అనిపిస్తుంది. జాతిరత్నాలు వంటి హిట్ సినిమా తర్వాత అనుదీప్ నుంచి ఆశించే స్థాయి సినిమా ఇది అస్సలు కాదు. ఓటీటీలో కూడా స్కిప్ చేసుకుంటూ గంటలోపే చూసేయవచ్చు. రథన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ‘నీ నవ్వే’, ‘ఓ లయ’, ‘మజా.. మజా..’ ఇలా పాటలు తెర మీద కనిపించినప్పుడల్లా కొంచెం రిలీఫ్ కనిపిస్తుంది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాకు తగ్గట్లు సినిమాటోగ్రఫీని అందించారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇందులో ప్రధాన పాత్రల్లో ఉన్నది కొత్త నటీనటులే అయినా బాగా నటించారు. హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పాత్రలో శ్రీను ఆకట్టుకుంటాడు. ఇక సంచితా బసుకి పెద్దగా నటించే అవకాశం దొరకలేదు. కానీ స్క్రీన్‌పై అందంగా కనిపిస్తుంది. దర్శకుడు వంశీధర్ గౌడ్ అక్కడక్కడా నవ్విస్తారు. ఆయనకు హాస్యనటుడిగా మరిన్ని చాన్స్‌లు రావచ్చు. జాతిరత్నాలు తరహా తండ్రి పాత్రలోనే తనికెళ్ల భరణి కనిపించారు. ఆయన పాత్రలో ఎటువంటి కొత్తదనం లేదు. హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించే సాయి చరణ్ బొజ్జా ఆకట్టుకుంటాడు. వెన్నెల కిషోర్, మహేష్ ఆచంటలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు.

ఫైనల్‌గా చెప్పాలంటే... పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా చూడటం కంటే ఇంట్లో కూర్చుని ఖుషి సినిమానే మళ్లీ చూడటం బెటర్. ఓటీటీలో వచ్చాక ఇందులో అక్కడక్కడా పేలిన కామెడీ సీన్ల కోసం చూసేయచ్చు.

Published at : 02 Sep 2022 02:46 PM (IST) Tags: ABPDesamReview First Day First Show Anudeep KV FDFS First Day First Show Review FDFS Review First Day First Show Telugu Movie Review First Day First Show Movie Review

సంబంధిత కథనాలు

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Nene Vasthunna Review - 'నేనే వస్తున్నా' రివ్యూ : ధనుష్ డబుల్ యాక్షన్ ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Alluri Movie Review: అల్లూరి రివ్యూ: శ్రీవిష్ణు కోరుకున్న హిట్ కొట్టాడా?

Alluri Movie Review: అల్లూరి రివ్యూ: శ్రీవిష్ణు కోరుకున్న హిట్ కొట్టాడా?

Krishna Vrinda Vihari Review - 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

Krishna Vrinda Vihari Review - 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

Chup Movie Review - హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?

Chup Movie Review - హిందీ సినిమా 'చుప్' రివ్యూ : రివ్యూలు రాస్తే చంపేస్తారా భయ్యా?

టాప్ స్టోరీస్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

YSR Kalyanamasthu : నేటి నుంచి అమల్లోకి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా- వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం జగన్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్

Rains In AP Telangana: మరో 2 రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ - IMD ఎల్లో అలర్ట్