అన్వేషించండి

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ ఫైనల్ ఎపిసోడ్స్ రివ్యూ - చివర్లో ఊహించని ట్విస్ట్స్, సీజన్-2 ఉంటుందా?

‘ఎస్కేప్ లైవ్’ 8, 9 ఎపిసోడ్స్ మే 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ రెండు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? సీజన్-2 ఉంటుందా?

వెబ్ సిరీస్ రివ్యూ: ఎస్కేప్ లైవ్
మొత్తం ఎపిసోడ్లు: 9 (మే 27 నుంచి ఫైనల్ ఎపిసోడ్స్)
రేటింగ్: 3/5
నటీనటులు: సిద్దార్థ్, జావేద్ జాఫేరి, వాలుస్చా డి సౌజా, ప్లాబితా బోర్తకూర్, సుమేద్ ముద్గల్కర్, రిత్విక్ సాహోర్, రోహిత్ చందేల్, ఆద్యా శర్మ, స్వస్తికా ముఖర్జీ, స్వేత త్రిపాఠి తదితరులు 
దర్శకత్వం: సిద్దార్థ్ తివారీ
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
స్ట్రీమింగ్ డేట్: మే 20 (7 ఎపిసోడ్స్) & మే 27 (2 ఎపిసోడ్స్)
 
సిద్ధార్థ్ కీలక పాత్రలో నటించిన ‘ఎస్కేప్ లైవ్’ వెబ్ సీరిస్ చివరి రెండు ఎపిసోడ్స్ కూడా ప్రస్తుతం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో స్ట్రీమ్ అవుతున్నాయి. ‘టిక్ టాక్’, ‘డబ్ స్మాష్’, ‘షార్ట్స్’, ‘రీల్స్’, ‘చింగారీ’, ‘టాకా టక్’ మోజులో పడిన యువత వైరల్ కావడానికి ఎంతకైనా తెగిస్తారనేది మీకు తెలిసిందే. దీన్ని ఆధారంగా చేసుకునే ‘ఎస్కేప్ లైవ్’ వెబ్ సీరిస్‌ను రూపొందించారు. మే 20న 7 ఏపిసోడ్స్‌తో పాత్రలను పరిచయం చేశారు. అయితే, కీలకమైన ఎపిసోడ్స్‌ను మాత్రం మే 27 విడుదల చేశారు. మొదటి ఏడు ఎపిసోడ్స్‌కు సంబంధించిన రివ్యును మీరు ఇప్పటికే చదివి ఉంటారు. ఒక వేళ మిసైతే ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 

Read Also: ‘ఏస్కేప్ లైవ్’ వెబ్ సీరిస్ తొలి 7 ఎపిసోడ్స్ రివ్యూ

కథ (7 ఎపిసోడ్స్): బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌ ఇంజినీర్ కృష్ణ రంగస్వామి(సిద్దార్థ్)కు తండ్రి లేకపోవడంతో తల్లి, చెల్లి బాధ్యతలను చూసుకోవల్సి వస్తుంది. దీంతో తన అర్హతకు తగిన ఉద్యోగం లభించకపోవడంతో ‘Escaype Live’ లైవ్ అనే షార్ట్ వీడియో యాప్‌లో మానిటర్‌గా చేరుతాడు. కృష్ణ సాంప్రదాయాలకు విలువ ఇచ్చే యువకుడు. అయితే, ‘ఎస్కేప్ లైవ్’లో వచ్చే అశ్లీల వీడియోలను బ్యాన్ చేయాలని చూస్తాడు. ఈ సందర్భంగా ఫేటిష్ గర్ల్ అనే యువతి పరిధి దాటుతుందనే కారణంతో ఆమె వీడియోను బ్యాన్ చేస్తాడు. అతడి బాస్(వాలుస్చా డి సౌజా) ఆదేశాల మేరకు అలాంటి వీడియోలపై చర్యలు తీసుకోలేడు. అంతర్లీనంగా మదనపడుతూ.. ఎలాగైనా ఆ యాప్‌లో అశ్లీలతకు అవకాశం లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇందుకు అతడు ఏం చేశాడనేది బుల్లితెరపైనే చూడాలి. అయితే, ఇందులో కేవలం కృష్ణ పాత్ర ఒక భాగం మాత్రమే. కృష్ణతోపాటు మరో ఐదు పాత్రల కథలు సమాంతరంగా సాగుతాయి. ఆ కథలన్నీ ‘ఎస్కేప్ యాప్’పైనే ఆధారపడి ఉంటాయి. ఈ యాప్‌లో ఎన్ని డైమండ్ ఎమోజీలు వస్తే.. వారు అంత పాపులర్ అవుతారు. అందుకు హీనా(ప్లబితా బార్దాకర్) అనే వెయిట్రెస్ ఖాళీ సమయంలో ఫేటిష్ గర్ల్‌గా తన అందాలను యాప్‌లో ప్రదర్శిస్తుంది. డార్కీ(సుమేధ్ ముద్గాల్కర్) అనే సైకో యువకుడు ప్రాంక్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదిస్తాడు. టీవీలో డ్యాన్స్ కాంపిటీషన్‌లో పాల్గొని పాపులర్ అవ్వాలని కలలుగనే తల్లి తన కూతురు రాణి(ఆద్యా శర్మ)ని తన తమ్ముడికి అప్పగిస్తుంది. దీంతో అతడు డ్యాన్స్ రాణిగా ఆమెకు ఎస్కేప్ యాప్‌లో పాపులారిటీ వచ్చేలా చేస్తాడు. ఆమె యువతిలా కనిపించేందుకు తల్లిదండ్రులకు తెలియకుండా హార్మోన్ ఇంజక్షన్లు కూడా చేయిస్తాడు. ఓ సూపర్ మార్కెట్లో పనిచేసే యువకుడు(రిత్విక్ షోరే) డార్కీకి అభిమాని. అతడిలా పాపులర్ అయ్యేందుకు ఆమ్చా స్సైడర్ పేరుతో ఒళ్లుగగూర్పాటు కలిగించే వీడియోలను చేస్తూ అభిమానులను సంపాదించుకొనే ప్రయత్నం చేస్తాడు. బ్యాంక్‌ ఉద్యోగం చేసే రాజ్ కుమార్‌(రోహిత్ చందేల్)కు సీక్రెట్‌గా మరో జీవితాన్ని గడుపుతాడు. అతడిలోని టాలెంట్ చూపించేందుకు మీనా పేరుతో అమ్మాయి వేషంలో వీడియోలు చేస్తుంటాడు. ఇతడికి సాయం చేసే యువతి పాత్రలో స్వేత త్రిపాఠి కనిపించింది. ‘ఎస్కేప్ లైవ్’ యాప్.. ఎక్కువ డైమండ్స్ సాధించేవారికి రూ.3 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వీరి జీవితాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతాయి. ఆ రూ.3 కోట్లు సాధించేందుకు వారు ఎంతకు తెగిస్తారు? ఎలాంటి పనులు చేస్తారు? కృష్ణ ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాడు? గెలుపు అంచుల వరకు చేరిన వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? చివరికి గెలిచేది ఎవరు? అనేది మిగతా కథ. 

కథ (8, 9 ఎపిసోడ్స్): లోవా లోవా అనే తన అభిమానిని కలుసుకోడానికి ఇంటి నుంచి బయటకు డ్యాన్సింగ్ రాణి బయటకు వెళ్లిపోతుంది. అయితే, అతడు నిజంగా లోవా లోవా కాదు. అతడు ఎవరో చెబితే థ్రిల్ పోతుంది. కాబట్టి, అతడి గురించి చెప్పడం. మళ్లీ.. కథలోకి వెళ్తే, ఆ వ్యక్తి డ్యాన్సింగ్ రాణిని కిడ్నాప్ చేసి దాన్ని ఎస్కేప్ లైవ్ యాప్‌లోనే లైవ్ పెడతారు. అతడు తన అకౌంట్‌ను అన్‌లాక్ చేయకపోతే ఆమెను చంపేస్తానని చెబుతాడు. దీంతో వారు అన్‌లాక్ చేస్తారు. కానీ, ఇతర వీక్షకులకు కనిపించకుండా చేస్తారు. రూ.3 కోట్ల పోటీ ఫైనల్స్ కావడం వల్ల ఆ వీడియోను ప్రసారం చేసినా, ఆ కిడ్నాప్ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన ఎస్కేప్ యాప్‌ను బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయని ఆ యాప్ సీఈవో రవి (జావేద్ జాఫేరి) భయపడతాడు. దీంతో ఆఫీసులో స్టాఫ్‌కు సంబంధించిన ఫోన్స్, ల్యాప్‌‌టాప్‌లను స్వాధీనం చేసుకుంటాడు. రవి అలా చేయడం కృష్ణ రంగస్వామికి, ఆ యాప్ టీమ్ లీరడ్ జియా బోస్(వాలుస్చా డి సౌజా)కు ఇష్టం ఉండదు. ఈ సందర్భంగా డ్యాన్సింగ్ రాణిని కాపాడేందుకు జియా, కృష్ణ రంగస్వామి ఏం చేస్తారు? పోలీసులకు డ్యాన్సింగ్ రాణి కిడ్నాప్ విషయం ఎలా తెలుస్తుంది? ఆమె ఫైనల్‌లో పాల్గొంటుందా? అనేది ఫైనల్ ఎపిసోడ్స్‌లోనే చూడాలి. మరోవైపు రాజ్ కుమార్(మీనా కుమారి) తాను ఆడపిల్లలనే విషయాన్ని తండ్రికి చెబుతాడా? మీనా కుమారి ఫైనల్స్‌లో పాల్గొంటుందా? ఇచ్చిన మాట ప్రకారం ఫేటిష్ గర్ల్ రంగస్వామిని కలుస్తుందా? ఫైనల్స్‌లో గెలిచేది ఎవరు? కృష్ణ రంగస్వామి చెల్లి ప్రేమ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? డార్కీ ఏమయ్యాడు? ఫేటిష్ గర్ల్ చనిపోతుందా? అనేది 8, 9 ఎపిసోడ్స్‌లో చూడాలి. 

విశ్లేషణ: గత ఏడు ఎపిసోడ్స్‌లో చెప్పుకున్నట్లే దర్శకుడు సిద్దార్థ్ తివారీ ఈ సబ్జెట్‌ను ఎంచుకోవడం సాహసమే. ఏడు ఎపిసోడ్స్‌తో పోల్చితే 8, 9 ఎపిసోడ్లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. కానీ.. ఈ ఎసిసోడ్స్‌లో ఎక్కువగా డ్యాన్సింగ్ రాణి, డార్కీ, ఫేటిష్ గర్ల్, మీనా కుమారి, కృష్ణ రంగస్వామి చుట్టూ తిరుగుతాయి. ప్రమాదంలో గాయపడ్డ ఆమ్చా స్సైడర్‌ 8, 9 ఎపిసోడ్స్‌లో కనిపించరు. అయితే, ఇవి ఫైనల్ ఎపిసోడ్స్ కావు. దీనికి రెండో సీజన్ ఉండబోతుందని చివర్లో హింట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ట్విస్టులు పెట్టి వదిలేశాడు. చెల్లి విషయం తెలిసిన తర్వాత.. ఆఫీసులో పార్టీకి వచ్చిన కృష్ణ రంగస్వామి తన సహచరుడిని అర్జంట్‌గా మూడు నాలుగు లక్షల రూపాయలు అప్పు కావాలని అడుగుతాడు. అలాగే, డార్కీ, ఫేటిష్ గర్ల్ బతికున్నారా? చనిపోయారా అనేది చూపించలేదు. డ్యాన్సింగ్ రాణి కిడ్నాప్ వల్ల ‘ఎస్కేప్ లైవ్’ యాప్‌పై పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా సస్పెన్స్‌లో పెట్టి వదిలేశారు. వాటి సమాధానాల కోసం సీజన్-2 వరకు వేచి చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
ఏసీబీ ఆఫీసు వద్ద హైడ్రామా, తీవ్ర అసంతృప్తితో అక్కడి నుంచి వెనుదిరిగిన కేటీఆర్
First HMPV Case In India: భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
భారత్‌లో తొలి HMPV Virus కేసు! బెంగళూరులో 8 నెలల చిన్నారికి పాజిటివ్
Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానుల‌కు రూ. 10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన దిల్‌ రాజు
Maadhavi Latha: నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
నాపై కక్ష కట్టి ఇలాంటి మాటలు... బోరున ఏడుస్తూ వీడియో పోస్ట్ చేసిన మాధవీలత
Investment Tips 2025: కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్‌ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు
కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయంతో మీ రిటైర్మెంట్‌ నాటికి రూ.కోట్ల కొద్దీ డబ్బు
UPI Circle Benefits: బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డ్‌ లేకపోయినా పేమెంట్స్‌ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు
బ్యాంక్‌ ఖాతా, క్రెడిట్‌ కార్డ్‌ లేకపోయినా పేమెంట్స్‌ - యూపీఐ సర్కిల్‌తో చాలా లాభాలు
YSRCP vs Nara Lokesh: వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఏం పీకిందని నారా లోకేష్ సూటిప్రశ్న! దీటుగా బదులిస్తూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్
CM Revanth Reddy: తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం విజన్‌ 2050 ప్రణాళిక అమలు చేస్తాం: రేవంత్ రెడ్డి
Embed widget