అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

No Time To Die Review: ‘నో టైం టు డై’ సమీక్ష: ఈసారి కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. అంతకు మించి!

డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్రలో నటించిన చివరి సినిమా నో టైం టు డై నేడు విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ చిత్రాల అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్న జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైం టు డై’ నేడు విడుదల అయింది. జేమ్స్ బాండ్ చిత్రాల్లో ఇది ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా కావడంతో దీనిపై నిర్మాణ సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. డేనియెల్ క్రెయిగ్ బాండ్‌గా నటిస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

కథ: బాండ్ గత చిత్రం స్పెక్టర్ చివరిలో జేమ్స్ బాండ్(డేనియల్ క్రెయిగ్), తను ప్రేమించిన అమ్మాయి మెడిలిన్ స్వాన్(లియా సెడూ)తో కలిసి అందరికీ దూరంగా వెళ్లిపోతాడు. సరిగ్గా అక్కడే నో టైం టు డై మొదలవుతుంది. వీరిద్దరూ కలిసి ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంటారు. ఇటలీలో జేమ్స్ బాండ్ బయటకు వెళ్లినప్పుడు తన మీద అటాక్ జరుగుతుంది. ఈ దాడి వెనక ఉన్నది మెడిలిన్ అనే అనుమానంతో బాండ్ తనను దూరంగా పంపించేస్తాడు. తను కూడా పూర్తిగా రిటైరయిపోయి ప్రశాంతంగా బతుకుతూ ఉంటాడు. ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది లండన్‌లోని ఎంఐ 6 ఆఫీస్ నుంచి ఒక బయో వెపన్‌ను దొంగిలించి, అదే ఆఫీస్‌లో పనిచేసే రష్యన్ సైంటిస్టును కిడ్నాప్ చేస్తారు. ఆ బయో వెపన్ సామర్థ్యం ఏంటి? బాండ్ తిరిగి వస్తాడా? మెడిలిన్‌ను కలుస్తాడా? దీని వెనక ఉంది ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందంటే?

ఈ సినిమా గురించి ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు జేమ్స్ బాండ్ సినిమాలు అంటే అమ్మాయిల వెనక తిరగడం, ఆకతాయిల ఆట కట్టించడం వంటివి మాత్రమే చూశాం. జేమ్స్ బాండ్‌లోని ఎమోషనల్ యాంగిల్‌ను మనం ఈ సినిమాలో చూడవచ్చు. నచ్చిన అమ్మాయిని చిటికెలో పడేసే జేమ్స్ బాండ్.. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడని ఊహించగలమా? కానీ ఈ సినిమాలో సిద్ధపడతాడు. జేమ్స్ బాండ్ క్యారెక్టర్‌లోని డెప్త్‌ని మనం ఈ సినిమాలో చూడవచ్చు. అదే ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్, మైనస్ కూడా. ఎందుకంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసే సమయంలో డ్రామాను విపరీతంగా పండించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించినా సినిమా నిడివి మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. 

జేమ్స్ బాండ్‌ను విపరీతంగా అభిమానించే వారికి ఈ సినిమా నచ్చవచ్చేమో కానీ.. యాక్షన్ చిత్రాల అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఇలాంటి యాక్షన్ సినిమాలు, ప్రధానంగా జేమ్స్ బాండ్ సినిమాలు రేసీ స్క్రీన్‌ప్లేతో నడవాలని కోరుకుంటారు. సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు కావడం, ఎమోషనల్ యాంగిల్‌పై దృష్టి పెట్టడం కాస్త మైనస్. అయితే జేమ్స్ బాండ్ యాక్షన్‌లోకి దిగిన ప్రతిసారీ.. విజిల్స్ వేసే తరహాలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. గత జేమ్స్ బాండ్ సినిమాలు మించే రేంజ్‌లో ఇందులో యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేశారు. స్క్రీన్‌పై బాండ్ యాక్షన్‌లోకి దిగిన ప్రతిసారీ ప్రేక్షకుడు సీట్ ఎడ్జ్‌కి వచ్చేస్తాడు. ఆ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేశారు. హాన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామా సన్నివేశాల్లో ప్రేక్షకులు లీనమయ్యేగా చేయగా.. యాక్షన్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లింది.

దర్శకుడు కేరీ జోజి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్రిస్టోఫర్ నోలన్, డానీ బోయల్ వంటి లెజెండరీ డైరెక్టర్ల పేర్లు ఈ సినిమా విషయంలో వినిపించినప్పటికీ.. చివరికి కేరీకి ఈ అవకాశం లభించింది. గత జేమ్స్ బాండ్ చిత్రాల ప్రభావం లేకుండా.. అందులో కథను మాత్రమే కొనసాగిస్తూ.. బాండ్ పాత్రను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించాడు. సినిమా ముగింపు విషయంలో గతంలోని బాండ్ సినిమాల దర్శకులు ఎప్పుడూ తీసుకోలేనంత రిస్క్ తీసుకున్నాడు. అదేంటో స్క్రీన్ మీద చూస్తేనే అర్థం అవుతుంది. ఈ స్థాయి ఎమోషనల్‌గా సాగిన జేమ్స్ బాండ్ సినిమా ఇంతవరకు రాలేదు. ఇకపై వస్తుందో, రాదో కూడా చెప్పలేం. 25వ జేమ్స్ బాండ్ సినిమాను మర్చిపోలేని విధంగా తెరకెక్కించాడు.

ఇక డేనియల్ క్రెయిగ్ విషయానికి వస్తే.. దీని ముందు సినిమా స్పెక్టర్ విడుదల అయిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చినా.. తిరిగి జేమ్స్ బాండ్ పాత్ర చేసేదే లేదన్నాడు. కానీ నిర్మాణ సంస్థ భారీ పారితోషికం ఇచ్చి మరీ డేనియల్ క్రెయిగ్‌ను ఒప్పించిందని వార్తలు వచ్చాయి. ఇది నిజమే అయినా.. క్రెయిగ్ మళ్లీ 007గా చేయడానికి పారితోషికం మాత్రమే కారణం కాదని సినిమా చూస్తే అర్థం అవుతుంది. గతంలో ఏ బాండ్ పాత్రధారికీ లభించని, సెండ్ ఆఫ్, ట్రిబ్యూట్.. డేనియల్ క్రెయిగ్ చేసిన బాండ్ పాత్రకు లభించాయి. ఎమోషన్, యాక్షన్.. సీన్ ఏదైనా క్రెయిగ్ అందులో జీవించాడు. క్లైమ్యాక్స్‌లో అయితే యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా అదే స్థాయిలో పండించాడు. హీరోయిన్‌గా నటించిన లియాకు యాక్షన్ సన్నివేశాల్లో పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించింది.

2015లో రిలీజైన స్పెక్టర్ తర్వాత వచ్చిన బాండ్ సినిమా ఇదే. ఒకే హీరో నటించిన రెండు బాండ్ సినిమాల మధ్య ఇంత గ్యాప్ రావడం ఇదే ఫస్ట్ టైం. గతంలో లైసెన్స్ టు కిల్(1989), గోల్డెన్ ఐ(1995) సినిమాల మధ్య ఆరు సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ ఆ రెండిట్లో వేర్వేరు హీరోలు బాండ్ పాత్ర పోషించారు. జేమ్స్‌బాండ్‌గా క్రెయిగ్‌కు ఇదే ఆఖరి సినిమా. 2022లో కొత్త బాండ్ పాత్రధారి కోసం వేట మొదలుపెడతామని నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంటే 2024 లేదా 2025 నాటికి కానీ మరో బాండ్ సినిమాను మనం చూసే అవకాశం లేదు.

నిజానికి నో టైం టు డై 2019 నవంబర్‌లో విడుదల కావాల్సింది. అయితే అక్కడ నుంచి 2020 ఏప్రిల్‌కు వాయిదా పడింది. అయితే కరోనా వైరస్ కారణంగా తర్వాత 2020 నవంబర్‌కు, ఆ తర్వాత 2021 ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో మళ్లీ 2021 సెప్టెంబర్ 30కు వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తూ ఉండటం.. వాయిదా వేసిన ప్రతిసారీ నిర్మాణ సంస్థకు ప్రమోషన్ల ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండటంతో ఎట్టకేలకు విడుదల చేశారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget