Godse Movie Review - 'గాడ్సే' రివ్యూ: సత్యదేవ్ డైలాగులు సూపర్! మరి, సినిమా ఎలా ఉంది?

Godse Telugu Movie Review: రాజకీయ అవినీతిని ప్రశ్నిస్తూ రూపొందిన సినిమా 'గాడ్సే'. సత్యదేవ్ హీరోగా నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 

సినిమా రివ్యూ: గాడ్సే
రేటింగ్: 2/5
నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, జియా ఖాన్, పృథ్వీ, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, నోయెల్ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో నాగబాబు, ప్రియదర్శి
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్
సంగీతం: శాండీ అద్దంకి
నిర్మాత: సి. కళ్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
విడుదల తేదీ: జూన్ 17, 2022

నటుడిగా చిన్న చిన్న పాత్రలతో సత్యదేవ్ ప్రయాణం మొదలైంది. ఈ రోజు ఒక ప్రామిసింగ్ హీరోగా ఎదిగారంటే... ఆయన ప్రతిభ కారణం. నటనలో, వాచకంలో సత్యదేవ్ ఎప్పుడో నిరూపించుకున్నారు. ఆయన సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళను, సగటు సినిమా అభిమానులను 'గాడ్సే' (Godse Telugu Movie) ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. మరి, సినిమా ఎలా ఉంది? గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' తీసిన దర్శకుడు గోపీగణేష్ పట్టాభి ఈ సినిమాను ఎలా తీశారు?

కథ (Godse Movie Story): ఫైనాన్స్ మినిస్టర్, పోలీస్ ఆఫీసర్లు, బినామీలు - సిటీలో రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఒక్కొక్కరు వరుసగా కిడ్నాప్ అవుతారు. ఈ సంగతి బయటకు తెలిస్తే ప్రజలు ఆందోళనకు గురవుతారని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది. కేసును వీలైనంత త్వరగా పరిష్కరించమని ఆదేశిస్తుంది. ఒక బృందం ఏర్పాటు చేస్తుంది. అందులో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది.  అర్హులైన వేల మంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు కల్పించాలని లండన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే వ్యాపారవేత్త, 'గాడ్సే' పేరుతో కిడ్నాప్స్ చేశాడని ఆమె తెలుసుకుంటుంది. బిజినెస్‌మేన్ కిడ్నాప‌ర్‌గా ఎందుకు మారాడు? 'గాడ్సే'ను చూసి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకూ ఎందుకు ఉలిక్కిపడ్డారు? అతడిని చంపాలని ఎందుకు అనుకున్నారు? అతడి దగ్గర ఎవరెవరి రహస్యాలు ఉన్నాయి? వాటితో ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

విశ్లేషణ: వినోదంతో పాటు సమాజాన్ని మేలుకొలిపే చిత్రాలు వస్తుంటాయి. తమిళ దర్శకుడు శంకర్ అటువంటి సినిమాలు తీశారు. ఆ కోవలోకి తీసిన చిత్రమే 'గాడ్సే'. డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, రాజకీయ నాయకులు చేసే అవినీతిని చిత్రంలో ప్రశ్నించారు. 

సినిమా ఎలా ఉంది? (Godse Review): 'గాడ్సే' ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే... సినిమాలో కొన్ని సంభాషణలు వింటున్నప్పుడు నిజమనే ఆలోచన కలుగుతుంది. మీడియా సంస్థలో ముఖ్యమంత్రికి వాటా ఉండటంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఒక సన్నివేశంలో హీరో చెబుతాడు. మరో సన్నివేశంలో షెల్ కంపెనీల ముఖ్యమంత్రి 72 వేల కోట్ల రూపాయలు వెనకేశారనేది మరో డైలాగ్. ఇవి కొంత మందికి సూటిగా తగలొచ్చు. నొప్పిని కలిగించవచ్చు. అలాగే, అఫిడవిట్స్‌లో చెప్పే ఆస్తుల వివరాలు కరెక్ట్ కాదని చెప్పే సీన్ రాజకీయ నాయకులు అందరికీ తాకుతుంది. 

ఐడియాగా 'గాడ్సే' బావుంది. ఆ కథను తెరపైకి ఆసక్తికరంగా తీసుకురావడంలో దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కథను ఆసక్తకరంగా ప్రారంభించారు. ఆ ఆసక్తిని ముందుకు తీసుకు వెళ్లలేకపోయారు. విశ్రాంతి వరకూ కథ ముందుకు వెళ్ళదు. కిడ్నాప్స్ ఎందుకు చేశాడనేది ఒక్కొక్కటిగా రివీల్ చేయడం సాగదీతగా ఉంది. విశ్రాంతి తర్వాత సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లడం, అందులో మరో ఫ్లాష్‌బ్యాక్‌... అంతా గందగోళంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం తెరపై వచ్చే సన్నివేశాలతో ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడమే. సత్యదేవ్ తన భుజాలపై సినిమాను మోయడానికి ప్రయత్నించారు. అయినా... స్క్రీన్ ప్లేలో వేగం లోపించడం, వార్తల్లో అంశాలను తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలగడం వల్ల సినిమా ఆకట్టుకోలేదు. సాంకేతిక అంశాల్లోనూ పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలు లేవు.

క్లైమాక్స్ చూస్తే పోలీసుల కళ్ళుగప్పి ముఖ్యమంత్రి దగ్గరకు ఒకరు వెళ్లడం అంత సులభమా? అనే సందేహం కలుగుతుంది. అంత సిల్లీగా తీశారు. సినిమా చూస్తున్నప్పుడు శంకర్ తీసిన ఒక సూపర్ హిట్ సినిమా లైన్స్‌లో ఉందని, నారా రోహిత్ 'ప్రతినిధి' ఛాయలు ఉన్నాయని అనిపిస్తుంది. 

నటీనటులు ఎలా చేశారు?: సత్యదేవ్ నటనలో ఇంటెన్స్ ఉంది. ఒక్కో డైలాగ్ ఫీలై చెప్పినట్టు అనిపిస్తుంది. పాత్రకు ఆయన రెండొందల శాతం న్యాయం చేశారు. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కు భిన్నమైన రోల్‌లో ఐశ్వర్య లక్ష్మి కనిపించారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది. ఇంట్రడక్షన్ సీన్స్‌లో బాగా చేశారు. పోలీస్ రోల్‌కు తగ్గట్టు డ్రస్సింగ్ స్టైల్, యాక్టింగ్ డీసెంట్‌గా ఉన్నాయి. బ్రహ్మాజీకి సరైన పాత్ర పడలేదు. ఏదో కనిపించారంతే! ప్రియదర్శి, జియా ఖాన్, తనికెళ్ళ భరణి, నాగబాబు తదితరుల పాత్రల పరిస్థితి కూడా అంతే! పాత్రల పరిధి మేరకు తమ వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. నోయెల్, చైతన్య కృష్ణకు ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. వాళ్ళిద్దరూ రెండు మూడు సన్నివేశాల్లో కంటతడి పెట్టించారు.

Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే?: ఎప్పటిలా సత్యదేవ్ మరోసారి అద్భుతంగా నటించారు. ప్రేక్షకులకు అది తెలుస్తుంది. అయితే... ఆయన అభినయం మరోసారి వృథా అయ్యింది. సినిమాలో కొన్ని డైలాగ్స్ బావున్నాయి. మాటలతో పాటు మంచి కథ మిస్ అయ్యింది. అందువల్ల, సినిమా ఆకట్టుకోవడం కష్టం. క్లైమాక్స్‌లో సత్యదేవ్ స్పీచ్ మాత్రం హైలైట్. 

Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?

Published at : 17 Jun 2022 01:12 PM (IST) Tags: ABPDesamReview Godse Review In Telugu  Godse Telugu Review Satya Dev's Godse Review Telugu Movie Godse Review  Aishwarya Lekshmi's Godse Review

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?