Mental Illness: ఈ మానసిక రోగాల గురించి ఇంతకుముందు మీరు విని ఉండరు, ఇవి చాలా అరుదైనవి
మానసిక రోగాల్లో చిత్ర విచిత్రమైనవి కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ఇవిగో.
Mental Illness: శారీరక ఆరోగ్య సమస్యలతో పోలిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు చాలా వింతగా ఉంటాయి. వీటిని కనిపెట్టడం చాలా కష్టం. అలాగే చికిత్స కూడా దీర్ఘకాలంగా సాగుతుంది. అందుకే మానసిక ఆరోగ్య సమస్యలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల మానసిక వ్యాధులు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన మనో రోగాల్లో కొన్ని ఇక్కడ ఇచ్చాము. చాలామందికి స్కిజోఫ్రెనియా, బై పోలార్ డిజార్డర్ వంటి వాటి గురించే తెలుసు. వాటికి మించిన కొన్ని విచిత్ర మానసిక రోగాలు ఇదిగో.
ఫ్రెగోలి సిండ్రోమ్
ఫ్రెగోలి సిండ్రోమ్ అంటే ఒకే వ్యక్తిలో వేర్వేరు వ్యక్తులు ఉన్నట్టు భావించడం. ఈ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు తరచుగా మారువేషంలో ఉన్నట్టు నటిస్తారు. ఇది సాధారణంగా బై పోలార్ డిజార్డర్. స్కీజోఫ్రెనియా, అబ్సెసివ్ కంపల్సవ్ డిసార్డర్ వంటి ఇతర మానసిక రుగ్మతల వల్ల కలుగుతుంది. మెదడుకు గాయం తగిలినప్పుడు వాడే మందులు, పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో వాడే ఔషధాలను దీనికి సూచిస్తారు.
కోటార్డ్ సిండ్రోమ్
కోటార్డ్ సిండ్రోమ్... దీన్నే "వాకింగ్ కార్ప్స్ సిండ్రోమ్" అని కూడా పిలుస్తారు. అలాగే మరికొందరు తమలోని శరీర భాగాలు మిస్ అయ్యాయని ఫీల్ అవుతారు. ఈ సిండ్రోమ్‌కు 19వ శతాబ్దపు ఫ్రెంచ్ న్యూరాలజిస్టు జూల్స్ కొటార్ట్ పేరు పెట్టారు. అతనే ఈ మానసిక రోగం గురించి వివరించాడు. స్కిజోఫెర్నియా, డిప్రెషన్ మరియు బైపోలార్ డిజార్డర్ ఈ సిండ్రోమ్‌కు ప్రమాద కారకాలు. యాంటి డిప్రెసెంట్స్, మూడ్ స్టెబిలైజర్లు, ఎలక్ట్రోకాన్క్లూజివ్ థెరపీలతో దీనికి చికిత్సను అందిస్తారు.
ఏలియన్ హ్యాండ్ సిండ్రోమ్
వింతైన నాడీ సంబంధిత వ్యాధుల్లో ఇది ఒకటి. ఈ వ్యాధిగల వ్యక్తులు తమ చేతులు ఆధీనంలో ఉన్నట్టు ప్రవర్తించరు. చేతులు తమకు చెందనట్లు భావిస్తారు. చేతులకు, తమకు ఎలాంటి సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం, మెదడులో కణితులు ఏర్పడడం, మూర్ఛ రావడం వంటి వాటి వల్ల ఈ రోగం వచ్చే అవకాశం ఉంది.
ఎక్బోమ్ సిండ్రోమ్
ఇది ఈ సిండ్రోమ్ ఉన్న వారిలో విచిత్రమైన స్పర్శలు కలుగుతాయి. తమ శరీరంలో ఏవో పరాన జీవులు చర్మం కింద తిరుగుతున్నట్టు వారు భావిస్తారు. 1930లో ఈ సిండ్రోమ్ గురించి స్వీడిష్ న్యూరాలజిస్టు కార్ల్ ఎక్బోమ్ వివరించారు. అందుకే అతని పేరుని ఈ రోగానికి పెట్టారు. ఇది పారానోయిడ్ పర్సనాలిటీ డిజార్డర్, పారానోయిడ్ స్కిజోఫ్రెనియా, న్యూరోసిస్ వంటి అనేక పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. కొంతమందిలో హఠాత్తుగా మద్యపానాన్ని మానేయడం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. కొకైన్ తీసుకోవడం వల్ల, బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల, మెదడులో థాలమస్ అని పిలిచే భాగానికి గాయాలు తగలడం వల్ల కూడా ఇది వస్తుంది.
ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ సిండ్రోమ్
అలిక్ ఇన్ వండర్ల్యాండ్ సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. దాని పేరు మీద ఒక రోగం కూడా ఉందని ఎవరికీ తెలిసి ఉండదు. దీనిని టాడ్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులకు తమ చుట్టూ ఉన్న వస్తువులు తమ కన్నా పెద్దవిగా కనిపిస్తాయి, లేదా అతి చిన్నవిగా కనిపిస్తాయి. ఈ అనుభవాలు మతి స్థిమితాన్ని తప్పిస్తాయి.
Also read: స్క్రీన్ టైమ్ పెరిగితే హార్మోన్ల అసమతుల్యత వచ్చే అవకాశం, జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.