![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ?
International Women’s Day 2024: ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజునే ఎందుకు నిర్వహిస్తారు. చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
![International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ? Why Women's Day is celebrated on 8th March International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/02/ffa3bdc28d573587a9b4fcd52f51db6c1709319006421880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
International Women’s Day 2024: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. మహిళల, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించేందుకు దీనిని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, విజయాలను గౌరవించడంతోపాటు మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై వాదించాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. సమాజాన్ని, దేశాన్ని ప్రగతి దిశగా తీసుకెళ్లడంలో పురుషులకు ఎంతగానో తోడ్పడింది మహిళలు.
భారతదేశం పురుషాధిక్య దేశమని మనందరికీ తెలుసు. కాబట్టి నేటికీ పురుషుల కంటే మహిళలకు తక్కువ అవకాశాలు, గౌరవం లభిస్తున్నాయి. కానీ కాలక్రమేణా, మహిళలు ప్రతి రంగంలో తమను తాము సమర్థులుగా మార్చుకుంటున్నారు. మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మార్చి 8నే ఎందుకు జరుపుకుంటారు?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉత్తర అమెరికా, ఐరోపా అంతటా కార్మిక ఉద్యమాల నుంచి ఉద్భవించింది. మహిళల సమానత్వం కోసం అవగాహన కల్పించడం, మహిళల అభివృద్ధికి సానుకూల మార్పు కోసం, వేగవంతమైన లింగ సమానత్వం కోసం, మహిళా-కేంద్రీకృత స్వచ్ఛంద సంస్థల కోసం నిధులను సేకరించడం వంటి లక్ష్యంతో ఏటా అనేక కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు.
ఇలా మొదలైంది..
1908లో అమెరికా వీధుల్లో కార్మికుల నిరసన జరిగింది. న్యూయార్క్ వీధుల్లో తమ హక్కులను డిమాండ్ చేస్తూ సుమారు 15 వేల మంది మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్‌ను కూడా ఇందులో చేర్చారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియడంతో ఏడాది తర్వాత 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
ఈ రోజును జరుపుకోవడానికి మార్చి 8ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అయితే మార్చి 8 న, అమెరికాలోని శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం తమ గొంతును పెంచారు. అందుకు గుర్తుగా సోషలిస్టు పార్టీ ఆ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. 1917లో, మొదటి ప్రపంచ యుద్ధంలో, రష్యా మహిళలు శాంతి కోసం నిరసన తెలిపారు. ఈ ఉద్యమం తరువాత, రష్యాకు చెందిన 'చక్రవర్తి నికోలస్' తన పదవికి రాజీనామా చేశాడు. మహిళలు ఓటు వేయడానికి అంగీకరించాడు. ఈ పరిస్థితులన్నింటినీ చూసిన యూరోప్ మహిళలు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ కారణాల వల్ల 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'గా గుర్తించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్ 'Invest in Women: Accelerate Progress'. మహిళాభ్యదయానికి పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పురోభివృద్ధికి సహకరించాలనేది ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.
Also Read : స్లీప్ ఆప్నియాపై కొత్త అధ్యయనం.. శ్వాసకు బ్రేక్.. ప్రాణం పోయిన ఆశ్చర్యపోనవసరం లేదట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)