International Women's Day: మహిళా దినోత్సవంలో అధికారిక రంగుగా ‘పర్పుల్’ను ఎందుకు ఉపయోగిస్తారు?
మహిళా దినోత్సవం కోసం తయారు చేసే కార్డులు కూడా ఊదా రంగులో కనపడుతాయి. మహిళలకు, ఊదారంగుకు సంబంధమేమిటో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
International Women's Day: ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలు చోట్ల మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. మార్చి 8న దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా హక్కుల కార్యకర్త క్లారా జెట్కిన్ ప్రారంభించారు.
ఈ రోజు జరుపుకుంటున్న ఈ వేడుక ఎంతో మంది మహిళల పోరాటాల, త్యాగాల ఫలితం. మహిళలకు ఓటు హక్కు ఎందుకూ అనే స్థాయి నుంచి మహిళలు దేశాన్నేలే చరిత్రను సృష్టించారు. వారి కృషికి గుర్తించి ఈ రోజున గౌరవించుకోవటం మన కర్తవ్యం.
అసలు మహిళా దినోత్సవం జరుపుకోవటం ఎలా ప్రారంభమయిందంటే... 8 మార్చ్ 1908న, న్యూయార్క్ నగరంలో సూదుల ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మిక, బాలకార్మిక వ్యవస్థను, పని చేసే చోట ప్రమాదకర పరిస్థితులను వ్యతిరేకిస్తూ, అలాగే మహిళలకు ప్రాథమిక హక్కులు కావాలని వీధుల్లోకి వచ్చి నినదించారు. ఆ తరువాత 1910 నుండి, మార్చ్ 8 వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించారు. అదే సంవత్సరం ఆగస్టు 26వ తేదీన క్లారా జెట్కిన్(1857-1933) ఆ వార్షిక మహిళా దినోత్సవ సందర్బంగా మహిళల ప్రాథమిక హక్కులను మొట్టమొదటి డిమాండ్ గాకోపెన్ హాగెన్ లో జరిగిన సోషలిస్ట్ మహిళల రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ముందు ఉంచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను వేడుక చేసుకొనేందుకు ఏర్పడింది. అప్పటి నుంచి ప్రపంచమంతటా ఈ రోజున ప్రతీ సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటోంది.
లింగ అసమానతల మీద, పితృస్వామ్య సమాజం మీద, మహిళలకు ఉద్యోగ అవకాశాల మీద, మరెన్నో సమస్యల మీద పోరాడి సాధించిన విజయాలకు ఈ రోజు వేడుక చేసుకోవటానికి ప్రత్యేక దినంగా ఈ రోజును ఏర్పరచటం జరిగింది. అప్పటికీ, ఇప్పటికీ అన్ని రంగాల్లో మహిళలు సాధిస్తున్న ఉన్నతిని, వికాసాన్ని గుర్తించి ఈ రోజు అన్ని చోట్లా వేడుకలు జరుగుతాయి.
ఈ రోజు ఎక్కువగా మహిళలు ఊదా రంగు దుస్తుల్లో కనపడుతారు. మహిళా దినోత్సవం కోసం తయారు చేసే కార్డులు కూడా ఊదా రంగులో కనపడుతాయి. మహిళలకు, ఊదారంగుకు సంబంధమేమిటో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
పర్పుల్ రంగు న్యాయానికి, గౌరవానికి చిహ్నం. ఇది స్త్రీల గౌరవంతో ముడిపడి ఉంది. అందుకే ఊదా రంగు మహిళా దినోత్సవానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక రోజున ఊదా రంగు దుస్తులు ధరించడం మహిళల ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. అలాగే, ప్రపంచంలో శాంతిని నెలకొల్పడంలో మహిళల పాత్ర ముఖ్యమైనది. కాబట్టి ఊదారంగును ఈ వేడుకలో భాగం చేశారు.
ప్రతీ సంవత్సరం గూగుల్ డూడుల్ కూడా ఊదా రంగుల యానిమేషన్ బొమ్మలుగా మారుస్తుంటుంది. అంతర్జాతీయంగా మహిళల పోరాటానికి, లింగ అసమానతలకు, సోషల్, పొలిటికల్ గా సమస్యల మీద పోరాటాలకు దక్కిన విజయానికి చిహ్నంగా పర్పుల్ రంగును మహిళా దినోత్సవానికి గుర్తుగా వాడుతారు. దానికి తోడు, పర్పుల్ కలర్ ఇష్టంలేని మహిళలు చాలా అరుదు కదూ!
Also Read : నీతా అంబానీ ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. రోజూ ఉదయాన్నే అది కచ్చితంగా తాగుతారట