Healthy Lips: మీ పెదవులు పేలవంగా కనిపిస్తున్నాయా? ఇదిగో పరిష్కారం
అందమైన పెదవులు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి.
అందమైన పెదవులు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. వాటికి మరింత అందం తెచ్చేందుకు మార్కెట్లో ఇప్పుడు అనేక రకాల కంపెనీల లిప్ స్టిక్ ఉత్పత్తులు విరివిగా దొరుకుతున్నాయి. కానీ కొంతమంది పెదవులు మాత్రం మచ్చలుగా ఉండటం, పొరలు పొరలుగా తోలు లేచిపోవడం చూస్తూ ఉంటారు. అటువంటి సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు నలుగురిలో తిరిగేందుకు కూడా ఇబ్బంది పడతారు. డబ్బు ఉన్న వాళ్ళు అయితే సర్జరీలు చేయించుకుని తమకి నచ్చిన విధంగా పెదవులను మార్చుకుంటారు. మన చర్మం మీద అనేక పొరలు ఉన్నప్పటికీ పెదవులు మాత్రం కేవలం మూడు పొరలు మాత్రమే ఉంటాయి. అవి కూడా సన్నగా సున్నితంగా ఉంటాయి. మన చర్మం రంగు పెదవుల మీద కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొందరు ఎప్పుడు పెదాలను పళ్ళతో కోరుకుతూనే ఉంటారు. దాని వల్ల వాటి అందం కోల్పోయి మచ్చలు పడి అందవిహీనంగా మారతాయి. అసలు పెదాలు ఎందుకు పగులుతాయి, అవి ఎందుకు నిర్జీవంగా ఉంటాయో మీకు తెలుసా. అది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే
ఆక్సిజన్ అందకపోవడం
పెదవులకు ఆక్సిజన్ ప్రసరణ సక్రమంగా లేకపోతే వాటి రంగు మారుతుంది. ఈ పరిస్థితిని సైనోసిస్ అంటారు. ఆక్సిజన్ సంతృప్త స్థాయిలు 85 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా మీకు తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు ఉంటే ఇది సంభవిస్తుంది.
రక్తహీనత
మీరు రక్తహీనతతో బాధపడుతుంటే పెదవులు తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తాయి. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం, విటమిన్ B-12 లోపం,పేగుల్లో రక్తస్రావం కారణంగా జరుగుతుంది.
ధూమపానం
ధూమపానం వల్ల కూడా పెదాలు రంగు మారతాయి. సిగరెట్ బూడిద పేదల మీద పడటం వల్ల అవి నల్లగా కనిపిస్తాయి. ఇదే కాకుండా అడ్రినల్ గ్రంథి తగినంత కార్టిసాల్‌ను ఉత్పత్తి చేయనప్పుడు జరిగే అడిసన్స్ వ్యాధి పెదాల రంగు మారడానికి మరొక కారణం.
సూర్యరశ్మి
పెదవులు రంగు మారడానికి మరో కారణం ఎక్కువగా సూర్యరశ్మి తగలడం. దీని వల్ల ఒక్కోసారి పెదవుల మీద మచ్చలు కూడా ఏర్పడతాయి. ఎండ వేడి వల్ల పెదాలు లేత గోధుమ రంగులోకి మారతాయి. ఒక్కోసారి పెదవిల మీద వచ్చిన మచ్చలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఏదైనా అనుమానం కలిగేలా ఉంటే చర్మ సంబంధ నిపుణులని సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కోసారి పెదాల మీద మచ్చలు స్కిన్ క్యాన్సర్ కారకాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది.
మంచి రంగుతో అందమైన లిప్స్ మీ సొంతం కావాలంటే ఇలా చేయాల్సిందే
* లేజర్ థెరపీ చేయించుకోవడం
* వైద్యుని సూచన మేరకు మందులు వాడుకోవడం
* క్రయోథెరపీ
* సర్జరీ చేయించుకోవడం
* ధూమపానానికి దూరంగా ఉండాలి
* బయటకి వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా క్యాప్ లేదా ముఖాన్ని కప్పి ఉంచేలా ముసుగు ధరించాలి. పెదాలు పొడి బారకుండా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
* పెదాల మీద ఉండే మృత కణాలు పోయే విధంగా రోజ్ వాటర్ వంటి వాటితో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
* బీట్ రూట్ రసాన్ని పెదాలకి తరచూ రాసుకుని మర్దన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం దక్కుతుంది.
* పెదాల మీద నల్ల మచ్చలు పోవాలంటే పళ్ళు రుద్దుకునే పేస్ట్ తో అప్లై చేసుకుని రుద్దుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కాచిన నీరు మంచిదా? ఫిల్టర్ నీరు మంచిదా? మీరు ఏది తాగుతున్నారు
Also Read: నేరేడు పండ్లు షుగర్ పేషెంట్స్ తినొచ్చా? నిపుణులు ఏం చెప్తున్నారంటే