Sabbath Day: పూర్వీకులకూ రిలాక్స్ అయ్యేందుకు వీకెండ్ ఉండేదట, ఆ కాన్సెప్ట్ కథేంటో తెలుసుకోండి!
Sabbath: ఇప్పుడు మనం వీకెండ్ అని మాట్లాడుకుంటున్నాం కానీ మన పూర్వీకులు అప్పట్లోనే ఆరు రోజుల పాటు పని చేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకునే వాళ్లట. దీన్నే సబ్బాత్‌గా పిలిచే వాళ్లు.
History of Sabbath: వీకెండ్ వస్తే చాలు "కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు" అని ఎగిరి గంతులేస్తాం. అన్ని రోజులు పడ్డ కష్టమంతా మర్చిపోతాం. హాయిగా ఫ్రెండ్స్‌తో గడపడమో, సినిమాలకు, షికార్లకు వెళ్లడమో చేస్తాం. ఆ తరవాత మళ్లీ రొటీన్. ఎప్పుడూ ఉండే టెన్షన్‌లే. ఐదు రోజుల టెన్షన్‌ని తగ్గించే మెడిసినే ఈ వీకెండ్. అయితే...ఇదంతా కార్పొరేట్ కల్చర్ వచ్చిన తరవాతే అలవాటైంది. వీకెండ్ అనే పదమే అప్పుడు పుట్టింది. ఇదీ మన ఒపీనియన్. కానీ...ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. ఎగ్జాగ్ట్‌గా ఎప్పుడు మొదలైందన్న వివరాలు లేకపోయినా ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం 600 BC నుంచే ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అయితే...ఇది పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడుకున్న సెలవు. జూదులు, క్రైస్తవులు ఈ సెలవుని కచ్చితంగా పాటించే వాళ్లు. దీని పేరు Sabbath.
ఆరు రోజుల పాటు దేవుడు ఈ లోకాన్ని సృష్టించి అలిసిపోయి ఏడో రోజు విశ్రాంతి తీసుకున్నాడని వాళ్లు నమ్ముతారు. అందుకే ఆ రోజు అందరూ సెలవు తీసుకుని దేవుడిని ప్రార్థించాలన్న నియమం పెట్టుకున్నారు. అదే సబ్బాత్. స్పిరిచ్యువల్‌గా అనిపించినా...చాలా మంది దాదాపు 24 గంటలకు పైగా విశ్రాంతి తీసుకుంటారు. అప్పటి వరకూ చేసే పనులకు బ్రేక్ ఇస్తారు. పూర్తిగా వాళ్ల కోసమే సమయం కేటాయిస్తారు. చాలా వరకూ దేవుడిని ప్రార్థిస్తూ గడుపుతారు. ఇప్పటికీ ఇజ్రాయేల్‌లో ఈ Sabbath Day ని కొందరు జరుపుకుంటారు. కానీ క్రమంగా కాలంతో పాటు ఇది కనుమరుగు అవుతూ వస్తోంది.
టైమ్ ఇచ్చి పుచ్చుకుంటారు..
అయితే..అంతకు ముందు శుక్రవారం సూర్యాస్తమయం అయిన తరవాత మొదలై శనివారం సూర్యాస్తమయం అయ్యేంత వరకూ సబ్బాత్ జరుపుకునే వాళ్లు. ఆ తరవాత ఇది ఆదివారానికి మారింది. పేరుకి ఇది స్పిరిచ్యుయల్‌గానే అనిపించినా, ఇది ఓ మతానికో, వర్గానికో పరిమితమైన కాన్సెప్ట్ అయితే కాదు. ఓవరాల్‌గా చూస్తే మనకి మనం సమయం కేటాయించుకోవాలని, ఫ్లోలో పడి కొట్టుకుపోకుండా కాస్తంత బ్రేక్ తీసుకోవాలని చెబుతోంది సబ్బాత్. ఈ రోజున చాలా మంది క్యాండిల్స్ వెలిగించి హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆ క్యాండిల్స్ లాగే తమ జీవితాలు కూడా వెలిగిపోవాలని కోరుకుంటారు. తమకు ఉన్నంతలో దానాలు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తారు. గంటల కొద్దీ మాట్లాడుకుంటారు.
కమ్యూనికేషన్ బ్యారియెర్‌లను బద్దలు కొట్టేసి ప్రశాంతంగా గడుపుతారు. భోజనం కూడా సాదాసీదాగా కాదు. నచ్చినవన్నీ వండుకుంటారు. వంటకు అంతా సాయం చేసుకుంటారు. రకరకాల ఆటలు ఆడతారు. పాటలు పాడతారు. ఒక్కటేమిటి. మనసుకు నచ్చిందల్లా చేసేస్తారు. అప్పటి వరకూ ఉన్న ఒత్తిడినంతా మరిచిపోయి లైఫ్‌ని రీస్టార్ట్ చేస్తారు. సబ్బాత్ అంటేనే విశ్రాంతి అని అర్థం. నిర్విరామంగా పని చేయకుండా కాస్తంత విశ్రాంతి తీసుకుంటే అటు శారీరక ఆరోగ్యానికి, ఇటు మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే...వీకెండ్ వస్తే ఫుల్‌గా సద్వినియోగం చేసుకోండి. నచ్చిన చోటుకి వెళ్లండి, నచ్చిన పనులు చేయండి. లైఫ్ బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని ఉత్సాహంతో వీక్‌ని స్టార్ట్ చేయండి.
Also Read: ఖాళీ కడుపుతో తీసుకునే ఈ డీటాక్స్ డ్రింక్ గురించి మీకు తెలుసా?