Face Wash: సబ్బుతో ఫేస్ వాష్ చేసుకోవడం మంచిదేనా? చర్మ నిపుణులు ఏం సూచిస్తున్నారు?
సబ్బుతో తరచూ మొహాన్ని కడుక్కోవడం చర్మానికి మంచిది కాదని నిపుణులు భావిస్తున్నారు. అది ఎందుకో తెలుసా?
ముఖం జిడ్డుగా అనిపిస్తే సబ్బుతో వాష్ చేసుకుంటారు. లేదంటే బయటికి వెళ్లొచ్చిన తర్వాత చాలా మంది తమ ముఖాన్ని సబ్బుతో వాష్ చేసుకుంటారు. మరి కొంతమంది ఫేస్ వాష్ క్రీములు వాడతారు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పరిమళాల సబ్బులు అందుబాటులో ఉంటున్నాయి. వాటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది కాదని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.
సబ్బుతో ముఖం కడగటం వల్ల నష్టాలు
⦿ సబ్బులు చర్మ కణాల నుంచి ఉపయోగకరమైన లిక్విడ్లను సంగ్రహిస్తాయి. వాటిని కోల్పోవడం వల్ల చర్మం దెబ్బతింటుంది.
⦿ సబ్బులు చర్మం pH స్థాయిని మారుస్తాయి. చర్మం pH 5.5. సొప్స్ ఆల్కలీన్ pH ని కలిగి ఉంటాయి. ఇది 9 వరకు ఉంటుంది. ఈ అధిక pH విలువలు చర్మం పైపొరలో ఉండే ఎంజైమ్ చర్యని అడ్డుకుని పొడిగా మారుస్తుంది. దీని వల్ల స్కిన్ మృదువుగా కాకుండా గరుకుగా మారుతుంది.
⦿ సబ్బులు చర్మం పైపొరను హైపర్ హైడ్రేట్ చేస్తాయి. ఇది చర్మం కేరటినోసైట్ లని దెబ్బతీస్తుంది. కణాలు, కొల్లాజెన్ ఫైబర్స్ వాపు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
⦿ కేరాటిన్ ప్రోటీన్ చర్మం మీద మార్పులు తీసుకొస్తుంది.
⦿ ఈ ప్రభావాలన్నీ చర్మం పనితీరుకి అడ్డంకులుగా మారతాయి. దీని వల్ల చర్మం చికాకు పెడుతుంది. అందుకే సబ్బుకు బదులుగా చర్మం pH కాపాడే ఫేస్ వాష్ ఉపయోగించడం మంచిది. ఇది చర్మం మీద మురికిని తొలగిస్తుంది. చర్మంలోని ఆరోగ్యకరమైన నూనెలు, చర్మం pH స్థాయికి ఆటంకం కలగకుండా చేస్తుంది. సబ్బులు చేసే విధంగా ఇవి చర్మానికి హాని కలిగించవు. అందుకే వాటికి బదులుగా ఫేస్ వాష్ ని ఉపయోగించుకోవడం మంచిది.
⦿ ప్రతి రోజు రెండు సార్లు ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోతుంది. చర్మంపై ఏర్పడే కాలుష్య కారకాలు, నూనె, ధూళిని తొలగిస్తుంది. సబ్బు బయట పెట్టడం వల్ల అవి ఎండి పోతాయి. వాటితో చర్మం శుభ్రం చేసుకోవడం వల్ల చికాకుగా అనిపిస్తుంది.
⦿ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్ కలిగిన పదార్థాలు ఉన్న క్రీములు ఉపయోగించుకోవాలి.
⦿ చాలా సబ్బులు చర్మానికి మేలు చేసే పదార్థాలని కలిగి ఉండవు. దాని వల్ల చర్మం తేమ తొలగిస్తుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం ఏవైనా కొనుగోలు చేసే ముందు వాటికి ఉపయోగించిన పదార్థాలు చూసుకోవడం కూడా ముఖ్యం. ముఖం కడుక్కోవడానికి సబ్బుకు బదులు ఫేస్ వాష్ ఉపయోగించండి. స్నానం చేసేప్పుడు కూడా సబ్బును ముఖానికి పెట్టకుండా.. ప్రత్యేకంగా ఫేస్‌వాష్‌ను వాడండి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: రొమ్ము క్యాన్సర్ మళ్ళీ తిరగబెడుతుందా? దాని లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?