అన్వేషించండి

Varicose Veins : కాళ్లల్లో నరాలు ఉబ్బడానికి కారణాలు ఇవే..  ఈ వెరికోస్ వెయిన్స్​కి చికిత్స ఉందా?

Varicose Veins Causes : వెరికోస్ వెయిన్స్ అంటే అందరికీ తెలియక పోవచ్చు కానీ.. కాళ్లల్లో నరాలు ఉబ్బడం చాలామందిలో చూసే ఉంటారు. మరి దానికి కారణాలు ఏంటి? చికిత్సలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారు?

Varicose Veins Risks and Treatment : కాళ్లల్లో నరాలు ఉబ్బిపోయి.. మెలికలు తిరిగి.. నీలం లేదా ఊదా రంగులో కనిపించే సమస్యను వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) అంటారు. చాలా మంది దీనిని కేవలం సాధరణమైన, సౌందర్య సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కేవలం అందానికి సంబంధించిన సమస్య కాదని చెప్తున్నారు నిపుణులు. సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. 

అసలు వెరికోస్ వెయిన్స్ సమస్య రావడానికి కారణాలు ఏంటనే దానిపై అవిస్ హాస్పిటల్స్ ఎం.డి (Avis Hospitals) ఇంటర్వెన్షనల్ రేడియోలోజిస్ట్ రాజా వి కొప్పాల (Doctor Rajah V Koppala) కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఇండియాలోనే బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు తీసుకున్న రాజా వెరికోస్ వెయిన్స్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పద్ధతుల ఏమంటున్నారంటే.. 

వెరికోస్ వెయిన్స్ 

కాళ్లలోని సిరల్లో రక్తాన్ని గుండె వైపు పంపే చిన్న కవాటాలు (Valves) బలహీనపడటం లేదా దెబ్బతినడం వలన ఈ సమస్య వస్తుందని రాజా వి కొప్పాల తెలిపారు. రక్తం వెనక్కి ప్రవహించి.. సిరల్లో నిలిచిపోవడం వల్ల అవి ఉబ్బుతాయని వీటినే వెరికోస్ వెయిన్స్ అంటామన్నారు.  

ప్రధాన కారణాలు

ఈ సమస్య కొందరిలో వంశపారంపర్యం(Genetics)గా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే మిగిలినవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయస్సు(Age) పెరిగే కొద్దీ కవాటాలు బలహీనపడతాయి. ఎక్కువసేపు నిలబడి పనిచేయడం(Prolonged Standing) వల్ల కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. గర్భధారణ సమయంలో రక్త పరిమాణం పెరిగి.. హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఇది రావచ్చు. ఊబకాయం(Obesity)తో ఇబ్బంది పడేవారిలో కూడా నరాలపై ఒత్తిడి పెరిగి వెరికోస్ వెయిన్స్ రావచ్చు. 

నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందులివే

వెరికోస్ వెయిన్స్​కు చికిత్స తీసుకోకుండా వదిలేస్తే.. కాళ్లలో తరచుగా నొప్పి రావడం, అసౌకర్యంగా ఉండొచ్చు.  చర్మంపై నయం కాని పుండ్లు ఏర్పడతాయి. ఉబ్బిన నరాల నుంచి రక్తస్రావం అవుతుంది. సిరల్లో రక్తం గడ్డ కట్టే ప్రమాదం (Thrombophlebitis) ఉంది. దీనిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అంటారు. ఇది ప్రమాదకరమైన స్థాయిగా చెప్తారు. 


Varicose Veins : కాళ్లల్లో నరాలు ఉబ్బడానికి కారణాలు ఇవే..  ఈ వెరికోస్ వెయిన్స్​కి చికిత్స ఉందా?

నివారణలు ఇవే

ఈ సమస్య రాకుండా ఉండాలంటే బరువు అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువ సేపు నిలబడకుండా మధ్యలో నడుస్తూ ఉండాలి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్లు పైకెత్తి ఉంచడం (Elevation) వల్ల కొంత ఉపశమనం ఉంటుంది.

చికిత్స విధానాలు 

వెరికోస్ వెయిన్స్​కి చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే కంప్రెషన్ సాక్స్ (Compression Socks) ధరించడం ద్వారా నరాలపై ఒత్తిడి తగ్గి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో సిరలను మూసివేయడానికి లేదా తొలగించడానికి లేజర్ చికిత్స (Laser Ablation), స్క్లెరోథెరపీ (Sclerotherapy) లేదా సర్జరీలను ఆధునిక పద్ధతుల ద్వారా అవిస్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తామని తెలిపారు డాక్టర్ రాజా. కాబట్టి వెరికోస్ వెయిన్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. ఈ సమస్య గురించి మరింత ఇన్​ఫర్మేషన్, చికిత్సలు గురించి తెలుసుకోవాలంటే.. 81210 24118 నెంబర్​కి కాల్ చేసి.. డిటైల్స్ తెలుసుకోవచ్చని చెప్తున్నారు అవిస్ ఆస్పత్రి సిబ్బంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget