అన్వేషించండి

Diet Pills: బరువు తగ్గేందుకు డైట్ పిల్స్ ఉపయోగిస్తున్నారా? వాటితో ఎంతో హాని

బరువు తగ్గేందుకు కొంతమంది డైట్ పిల్స్‌‌ను ఉపయోగిస్తారు.

బరువు తగ్గించే సప్లిమెంట్స్ గా ‘డైట్ పిల్స్’ వాడుకలో ఉన్నాయి. ఇవి అధిక బరువును త్వరగా తగ్గిస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి డైట్ మాత్రలు వాడడం వల్ల అవి బరువును తగ్గించడం మాట పక్కన ఉంచితే, శరీరానికి చేసే హాని ఎంతో ఉంది. ఈ డైటరీ సప్లిమెంట్స్ హృదయానాళ వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. ఈ డైట్ పిల్స్‌లో కెఫిన్ , ఎఫెడ్రిన్ లేదా సినెఫ్రిన్  వంటివి ఉంటాయి. ఇవి రక్తపోటు, హృదయస్పందన రేటును పెంచే ఉత్ప్రేరకాలు.ఇవి గుండెపై పని భారాన్ని పెంచుతాయి. ఒత్తిడికి గురిచేస్తాయి. దీనివల్ల గుండె దడ,  అరిథ్మియా, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం ఉంది.

డైట్ మాత్రలు శరీరం చేసే సహజ జీవక్రియలకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి జీవక్రియను పెంచుతాయని, ఆకలిని తగ్గిస్తాయని అంటారు. కానీ ఆ ప్రభావాలను ఏ అధ్యయనం కూడా నిర్ధారించడం లేదు. కొన్ని డైట్ మాత్రలు హార్మోన్ల సమతుల్యతను కూడా దెబ్బతీస్తాయి. దీనివల్ల మహిళల్లో రుతుక్రమం సమయానికి రాదు. సంతానోత్పత్తి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. కాబట్టి బరువు తగ్గేందుకు డైట్స్ పిల్స్ వాడడం చాలా ప్రమాదకరం అని తెలుసుకోండి.

డైట్ పిల్స్ వాడడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని సప్లిమెంట్లలో  గ్రీన్ టీ సారం, గార్సినియ కంబోజియా ఉంటుంది. ఇవి అధిక మోతాదులో శరీరంలో చేరితే హేపటోటాక్సిక్‌గా మారవచ్చు. దీనివల్ల పచ్చకామెర్లు, పొత్తి కడుపు నొప్పి, కాలేయ వైఫల్యం వంటి తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ డైట్ మాత్రలు మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ డైట్ మాత్రలు వాడడం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి వంటివి వచ్చే అవకాశం ఉంది.  ఇలాంటి బరువు తగ్గించే సప్లిమెంట్లను వాడే ముందు వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది. వైద్యుల సూచన మేరకే వీటిని వాడాలి.

నిజానికి బరువు తగ్గేందుకు ఇలాంటి డైట్ సప్లిమెంట్లను వాడే బదులు సహజంగా బరువు తగ్గడం ఎంతో ఆరోగ్యం. సమతుల ఆహారం తీసుకుంటూ, వ్యాయామం స్థిరంగా చేస్తూ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువ. 

Also read: వానాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఆయుర్వేదం చెబుతున్న ఈ రసాన్ని వండుకోండి

Also read: గేమింగ్ డిజార్డర్ ఉందా? అయితే జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది జాగ్రత్త

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Skin Whitening Cream: రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
రాత్రికి రాత్రే చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో ప్రమాదం! ఆందోళన కలిగిస్తున్న పాదరసం, సీసం వాడకం!
Roof Leakage Signs:రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
రూఫ్‌ లీక్ అవ్వడానికి ముందు మీ ఇంట్లో కనిపించే మార్పులు ఇవే! నష్టం జరగక ముందే జాగ్రత్తపడండి!
Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget