అన్వేషించండి

Ultra-Processed Foods : అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్​పై నిపుణుల హెచ్చరిక.. సిగరెట్లకు ఏమాత్రం తీసిపోవంటోన్న తాజా అధ్యయనం

Unhealthy Foods : అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఆహారంలా కాదు.. సిగరెట్లలా చూడాలని తాజా అధ్యయనం చెప్తుంది. అవి ఆరోగ్యాన్ని ఎలా డ్యామేజ్ చేస్తాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటున్నారు నిపుణలు.

Harmful Ultra-Processed Foods : అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF)ను సాధారణమైన ఫుడ్​గా కాకుండా సిగరెట్ల మాదిరిగానే చూడాల్సిన అవసరం ఉందని తాజా అధ్యయనం చెప్తోంది. హార్వర్డ్, మిచిగాన్, డ్యూక్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు చేసిన చేసిన అంతర్జాతీయ అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకి వచ్చాయి. దానికి సంబంధించిన నివేదికను మిల్‌బ్యాంక్ క్వార్టర్లీ జర్నల్‌లో ప్రచురించారు. 

పరిశోధనల ప్రకారం.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి సిగరెట్లు కాలిస్తే ఆరోగ్యానికి ఎలాంటి డ్యామేజ్ కలుగుతుందో.. అలాంటి సైడ్​ఎఫెక్ట్స్ ఇస్తాయని కనుగొన్నారు. వాటి రుచి అడిక్ట్​ అయ్యేలా చేసి.. వ్యసనంగా మారేలా తయారు చేస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. చక్కెర, ఉప్పు, కొవ్వు క్రేవింగ్స్ పెరిగేలా.. మెదడులోని రివార్డ్ సిస్టమ్‌ను ఉత్తేజపరిచేలా వీటిని తయారు చేస్తున్నారని పేర్కొంది.

మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ ఆష్లే గేర్‌హార్డ్ట్ మాట్లాడుతూ.. చాలా మంది సోడా, చక్కెరతో చేసిన స్నాక్స్ క్రేవింగ్స్ ఎక్కువగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అవి ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా మానలేకపోతున్నారని ఇది చాలా ప్రమాదమని చెప్తున్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే..

సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, బిస్కెట్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన మాంసాహారం వంటి వాటిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఇవి ఎక్కువకాలం నిల్వ ఉండేలా తయారు చేస్తారు. పైగా వీటి రుచి మిమ్మల్ని మళ్లీ మళ్లీ తినేలనే కోరికను పెంచుతుంది.

మార్కెటింగ్ స్ట్రాటజీల్లో కూడా మోసమే..

లో ఫ్యాట్, నో షుగర్ అంటూ లేబుల్స్ వేసి.. హెల్తీ ఫుడ్​ లాగా ప్రమోట్ చేస్తున్నారని.. కానీ వాటిలో కూడా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నారని పరిశోధకులు విమర్శించారు. 1950లలో సిగరెట్లను సేఫ్​ అని ఎలా ప్రచారం చేశారో.. అలాగే వీటిని ప్రమోట్ చేస్తున్నరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి జిమ్మిక్కుల వలలో పడవద్దని సూచిస్తున్నారు. 

కంట్రోల్ చేసుకోకపోతే ప్రమాదమే.. 

కడుపు నిండా తినడం అవసరమే. ఆరోగ్యానికి కూడా అదే ముఖ్యమైనది. అయినప్పటికీ.. అన్నీ ఫుడ్స్ ఒకేలా చూడకూడదు. మద్యం, పొగాకు ఎలాంటి నిబంధనలు ఉంటాయో.. అలాంటి నిబంధనలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్​కు ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తుంది. ఎందుకంటే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే మీకు నిజంగా క్రేవింగ్స్ ఉన్నా వాటిని తక్కువ మోతాదులో లేదా ఏదైనా గోల్ సాధించినప్పుడు సెలబ్రేషన్​లో భాగంగా కేలరీ పోర్షన్​లో తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Munagaku Roti Pachadi : నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
నోరూరించే మునగాకు రోటి పచ్చడి.. పల్లీలు వేసి చేస్తే రుచి అదిరిపోతుంది, రెసిపీ ఇదే ఆంధ్రా స్టైల్ రెసిపీ
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Morning Skincare Routine : గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి
గ్లోయింగ్ స్కిన్ కోసం ఉదయాన్నే ఏం చేయాలి? ఈ 6 స్కిన్ కేర్ స్టెప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో మరో 36 ప్రాజెక్టులు.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీలో సీఎం చంద్రబాబు
Union Cabinet Decisions: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. కనీస మద్దతు ధర పెంపు, ఏ పంటకు ఎంత పూర్తి వివరాలు
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
ఇస్లాంలో మతం మార్చడానికి కల్మాను ఉపయోగిస్తారు, మరి హిందూమతం సంగతేంటి?
Vijayasai Reddy: ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
ఏపీని కమ్మ, క్రిస్టియన్లు పాలిస్తున్నారు.. మేం గెలిస్తే ఆ కులాలకే సీఎం పదవి: విజయసాయిరెడ్ది
Boyapati Srinu: బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
బోయపాటి శ్రీను పెద్దబ్బాయ్, అమ్మాయి బర్త్ డే... ఫ్యామిలీ ఫోటోలు చూశారా?
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Embed widget