What Is The Best Place To Travel In Summer: ఎండల నుంచి ఉపశమనం ఉత్సాహాన్నిచ్చే టూరిస్ట్ స్పాట్స్ ఇవే
What Are The Best Holiday Destination In Summer: ఈ వేసవికి చల్లచల్లగా ఎంజాయ్ చేసి రావటానికి టాప్ 3 టూరింగ్ స్పాట్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ ని బట్టి ట్రావెల్ చేయటానికి ఇలా ఫాలో అయిపోండి.
![What Is The Best Place To Travel In Summer: ఎండల నుంచి ఉపశమనం ఉత్సాహాన్నిచ్చే టూరిస్ట్ స్పాట్స్ ఇవే Top 3 summer touring spots These are the tourist spots that give relief from summer What Is The Best Place To Travel In Summer: ఎండల నుంచి ఉపశమనం ఉత్సాహాన్నిచ్చే టూరిస్ట్ స్పాట్స్ ఇవే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/efc56cced15e4c7c83c5806da151fd811711442464530955_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Best Places To Visit In Summer In India With Family: ఎండలు అప్పుడే భగ్గుమంటున్నాయి. ఈ వేసవికి చల్లచల్లగా ఎంజాయ్ చేసి రావటానికి టాప్ 3 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ ని బట్టి ట్రావెల్ చేయటానికి ఇలా ఫాలో అయిపోండి. ఇది మీకు మెమరబుల్ సమ్మర్ ట్రిప్ అవుతుంది.
నంది హిల్స్
బెంగుళూరులో లేదా చుట్టుపక్కల ప్రాంతల వారికి ఈ ప్లేస్ బాగా సూట్ అవుతుంది. సొలో గా ట్రావెల్ చేయాలనుకునే వారికి కూడా అనువైన ప్రదేశం. బెంగుళూరు వారు వీకెండ్స్ తరచుగా వెళ్లి ఎంజాయ్ చేసె టాప్ టూరిస్ట్ స్పాట్ ఇది. రెఫ్రెషింగ్ గా ఎటైనా వెళ్లాలనుకునే వారు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. మీరు నంది హిల్స్ కి వెళ్లినపుడు చేయటానికి ఉత్తేజకరమైన పనులు ఆ చుట్టుపక్కన బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ సుందరమైన హిల్ స్టేషన్ సహజ పరిసరాల మధ్య పారాగ్లైడింగ్, సైక్లింగ్ చేయటం ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
నంది హిల్స్ కు రూట్:
నంది హిల్స్ చిక్కబల్లాపూర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్లో ఇక్కడికి చేరుకోవచ్చు. బెంగుళూరుకు విమానం, టాక్సీ లేదా బస్సులో ప్రయాణించి ఈ ప్రదేశానికి వెళ్లడం కూడా ఒక ఎంపిక. ఇవేవి అనుకూలంగా అనిపించకపోతే టాక్సీని అద్దెకు తీసుకోండి లేదా మీరే డ్రైవ్ చేయండి. రోడ్డు మార్గంలో కూడా నంది హిల్స్ కు వెళ్లొచ్చు.
నంది హిల్స్ లో ఏమేం చేయొచ్చు?
1.పారాగ్లైడింగ్
2. టిప్పు డ్రాప్-ఆఫ్ సందర్శన
3. ఫారెస్ట్ లో సైక్లింగ్ లేదా బైకింగ్
నంది హిల్స్‌లో తిరగటానికి రెండు రోజులు సరిపోతుంది.
డల్హౌసీ
డల్హౌసీ.. ఒక చిన్న ఐరోపా పల్లె ప్రాంతాన్ని చూసినట్టుగా ఉంటుంది. అటువంటి ప్రదేశం ఇండియాలో ఉందని చెప్తే మీరు నమ్మలేరు. ఉత్తరాఖండ్ దిగువ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం ఈ సమ్మర్ లో చూడటానికి బెస్ట్ స్పాట్. ఇండియాలోనే అయినా ఈ హిల్ స్టేషన్ గురించి ఎక్కువ మందికి తెలియదు. చూసొచ్చినవారు దీన్ని స్వర్గంగా వర్ణిస్తారు. ఒక్కసారి వెళ్తే అక్కడే నివాసం ఏర్పరుచుకోవాలంపించే అందమైన ప్రాంతం ఇది.
డల్హౌసీ కి ఎలా వెళ్లాలి?
డల్హౌసీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగ్గల్ విమానాశ్రయం నుంచి విమానంలో చేరుకోవచ్చు. డల్హౌసీకి సమీపంలోని పఠాన్‌కోట్ రైల్వేస్టేషన్ నుంచి టైన్ ద్వారా, బస్సు ద్వారా రోడ్ మార్గంలో కూడా చేరుకోవచ్చు. ఇది సమీప నగరమైన ఢిల్లీ నుంచి సుదీర్ఘమైన డ్రైవ్ అయినప్పటికీ లాంగ్ డ్రైవ్ ఇష్టపడేవారు సొంత వెహికిల్ లో కూడా వెళ్లొచ్చు.
డల్హౌసీ లో ఏమేం చేయొచ్చు?
సుందరమైన అటవీ ప్రాంతం ఫారెస్ట్ క్యాంపింగ్ కి, హైకింగ్ కి చాలా అనువుగా ఉంటుంది. రెండు, మూడు రోజులు ఇక్కడ రిఫ్రెషింగ్ గా తిరగాలనుకున్నా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిటీ నుంచి దూరంగా నేచర్ లో స్పెండ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ స్పాట్.
ముస్సోరి
ముస్సోరి చాలామందికి తెలిసిన ప్రాంతమే. ఒక్క వేసవికే కాదు. ప్రతీ వేసవికి చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, విస్మయపరిచే మేఘాలను దగ్గర్నుంచి చూడటానికి రెండు కళ్లు చాలవు.
ముస్సోరీకి కి ఎలా వెళ్లాలి?
ముస్సోరికి అతి దగ్గరగా ఉన్న సిటీ డెహ్రాడూన్. ఇక్కడి నుంచి ముస్సోరి కేవలం 34 కిలోమీటర్లు మాత్రమే. కాబట్టి విమానంలో, ట్రైన్ లో, బస్సులో వీలును బట్టి మీ ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు.
ముస్సోరీలో ఏమేం చేయొచ్చు?
1.కెంప్టీ వాటర్ ఫాల్స్
2.హైకింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)