Diabetes: డయాబెటిస్ ఉంటే ఈ పండ్లు అధికంగా తినకూడదు
డయాబెటిస్ బారిన పడిన వారు కొన్ని రకాల పండ్లను తక్కువగా తినాలి.
ఆరోగ్యకరమైన ఆహారాల్లో మొదటి స్థానంలో ఉండేవి పండ్లే. ఎవరైనా పండ్లను తింటే శక్తితో పాటూ పోషకాలు అందుతాయి. కానీ డయాబెటిక్ రోగులు మాత్రం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల పండ్లను తక్కువగా తినాలి. పండ్లు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. కానీ కొన్ని రకాల పండ్ల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులు మితంగా తీసుకోవాల్సిన లేదా పూర్తిగా మానేయాల్సిన పండ్లు ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ చెబుతున్న ప్రకారం డయాబెటిక్ పేషెంట్‌లు బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా రోజూ పండ్లను తినాలని సూచిస్తున్నారు. అయితే కింద చెప్పిన పండ్లను మాత్రం తక్కువగా తినాలి. పండ్లు, కూరగాయలు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి లోపాలు రాకుండా పండ్లు నిరోధిస్తాయి. కొన్ని పండ్లలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడానికి, డయాబెటిక్ రోగులు తినే పండ్లను తెలివిగా ఎంచుకోవాలి.
పుచ్చకాయ
ఈ జ్యుసి పండు వేసవి కాలంలో ప్రజలకు ఎంతో ఇష్టమైనది. కానీ పుచ్చకాయలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు చాలా పరిమిత పరిమాణంలో పుచ్చకాయ తినాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి పుచ్చకాయను తక్కువ GI (గ్లైసెమిక్ ఇండెక్స్) ఆహార పదార్థాలతో కలిపి తినాలి.
అరటిపండ్లు
అరటి పండ్లలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. బాదం, పిస్తా, వాల్‌నట్ వంటి గింజలతో పాటు అరటిపండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావం ఉంటుంది. టైప్ 2 మధుమేహం ఉన్నవారు అరటిపండును పెరుగులో కలుపుకోవచ్చు. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. ఎక్కువ కాలం పాటూ పొట్ట నిండిన భావనను అందిస్తుంది.
మామిడ పండు
పండ్లలో రారాజు మామిడి. దాని రుచి ఎంతో మందికి ఇష్టం. కానీ డయాబెటిక్ పేషెంట్లు మాత్రం మామిడి తినే ముందు ఆలోచించుకోవాలి. రోజుకు రెండు మూడు ముక్కల కన్నా ఎక్కువగా తినకూడదు. దీనిలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెరగడానికి కారణమవుతాయి.
పైనాపిల్
పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీన్ని అధికంగా తినకూడదు. లేదా కొవ్వు, ప్రొటీన్లు అధికంగా ఇతర ఆహారాలతో కలిపి వాటిని తినాలి. పైనాపిల్ రెండు మూడు ముక్కల కన్నా ఎక్కువ తినకూడదు.
లిచీ
వేసవిలో అత్యంత ఇష్టమైన పండ్లలో లిచీ కూడా ఒకటి. ఈ జ్యుసీ పండులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది. మధుమేహం ఉన్న వారు లిచీని చాలా తక్కువగా తినాలి.
Also read: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.