Ex GirlFriends group: మాజీ ప్రియురాళ్ల నెంబర్లతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన ఘనుడు, ఆ గ్రూప్ పేరేంటంటే...
వీడు మామూలోడు కాదు... ఏకంగా మాజీ ప్రియురాళ్లతో ఒక వాట్సాప్ గ్రూప్‌నే క్రియేట్ చేశాడు.
ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాళ్లందరితో ఒకేసారి చాట్ చేయాలనుకున్నాడు, వారందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. అందుకోసం ఓ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేశాడు. ఆ వాట్సాప్ గ్రూప్‌కు ‘మెర్రీ ఎక్స్-మస్’అని పేరు పెట్టాడు. వాళ్లంతా అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కావడంతోనే అలా పెట్టాడు. గ్రూప్ క్రియేట్ చేసిన వెంటనే షాకైన అతని మాజీ ప్రియురాళ్లు ఏం చాట్ చేశారో వాటిని బయటపెట్టాడు. అతని పేరు టామ్. ఉండేది బ్రిటన్లో.
ఎంతమందంటే...?
టామ్ ఇప్పటివరకు నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడి, కొన్ని నెలలకే బ్రేకప్ చెప్పాడు. ఈసారి క్రిస్మస్ కు మాత్రం అతను ఒంటరిగా ఉన్నాడు. మరోసారి ప్రేమలో పడలేదు. తన మాజీ ప్రియురాళ్లందరితో ఒకేసారి మాట్లాడాలనిపించింది టామ్‌కి. వెంటనే ‘మెర్రీ ఎక్స్ మస్’ పేరుతో గ్రూప్ క్రియేట్ చేశాడు. గెమ్మా, లిసా, బెల్లా, స్టెఫానీ... ఈ నలుగురు అతని మాజీ ప్రియురాళ్లు. వారి నెంబర్లను యాడ్ చేశాడు. తానే మొదటి మెసేజ్ పెట్టాడు.‘మెర్రీ కిస్మస్ గర్ల్స్... నేను ఈ క్రిస్మస్‌కి ఒంటరిగా ఉన్నాను. మీరు నాతో కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారని ఆశిస్తున్నాను. మిమ్మల్ని నేను చాలా మిస్ అయ్యాను’ అని మెసేజ్ పెట్టాడు. దానికి మొదటి ప్రియురాలు గెమ్మా స్పందించి ‘టామ్... నువ్వు బాగా తాగినట్టున్నావ్’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.
లిసా అనే మాజీ ప్రియురాలు మాత్రం వెంటనే గ్రూపులోంచి లెఫ్ట్ అయింది. ఇక బెల్లా మాత్రం చాలా సీరియస్ అయింది. ‘నాతో ప్రేమలో ఉన్నప్పుడే నువ్వు మరో అమ్మాయితో గడిపావు’ అని మెసేజ్ పెట్టింది. దానికి స్టెఫానీ అనే మరో మాజీ ప్రేమికురాలు ‘నాకు నీతో బ్రేకప్ అయిందని చెప్పాడు’ అని రిప్లయ్ ఇచ్చింది. బెల్లా, స్టెఫానీ కాసేపు వాదించుకున్నాక గ్రూపులోంచి వెళ్లిపోయారు. ఇక మిగిలింది గెమ్మా, టామ్ మాత్రమే. వీరు హైస్కూల్ చదివే సమయంలో ప్రేమలో పడ్డారు. గ్రూపులో వీరిద్దరే చాటింగ్ చేసుకోవడం కొనసాగించారు. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందేమో.
Also read: రెడ్ వైన్ తాగితే బరువు నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా తగ్గాల్సిందే, మధుమేహులకు మరీ మంచిది
Also read: ముద్దు ప్రేమనే కాదు... అందాన్నీ పెంచుతుంది, ఇంకెందుకాలస్యం కానీయండి
Also Read: నీతా అంబానీ చేతిలో నీళ్ల బాటిల్... ఆ నీళ్ల బాటిల్ ఖరీదుతో హైదరాబాదులో ఫ్లాట్ కొనేయచ్చు
Also Read: క్రూరమైన కిల్లర్... కార్డియాక్ అరెస్టు, వచ్చే ముందు ఈ లక్షణాలు కనిపించొచ్చు, జాగ్రత్త పడండి
Also Read: ఛీ... అద్దెకున్నవాళ్లు ఇలా కూడా చేస్తారా? పాపం ఆ ఓనర్