Low Libido: విమాన ప్రయాణానికి, లైంగిక సమస్యలకు లింకేమిటీ? ఈ షాకింగ్ న్యూస్ విన్నారా!
విమాన ప్రయాణానికి, లైంగిక కోరికలకు లింక్ ఉందట. అదేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. దీనిపై న్యూయార్క్ డాక్టర్స్ ఏం చెప్పారో చూడండి.
సమ్మర్ హాలీడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? విమానాల్లో తీరికలేకుండా విహరిస్తున్నారా? అయితే, మీరు పరిశోధకులు చెప్పిన ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవల్సిందే.
విమానంలో ప్రయాణమంటే ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా తెల్లవారుజామున విమానమంటే.. చాలామంది నిద్రపోరు కూడా. ఊరు ముందే ఉరుకులు పరుగులు పెడుతూ విమానాశ్రయానికి చేరుకుంటారు. సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో నిలుచుని.. క్లియరెన్స్ లభించేవరకు మనసు ప్రశాంతంగా ఉండదు. విమానం ఎక్కిన తర్వాత ‘హమ్మయ్యా, మిస్ కాకుండా బాగానే ఎక్కేశాం’ అని సంతోషిస్తారు. అంతా ఒకే, కానీ.. మీరు ఏదో ఒక కారణంతో విమానాల్లో ఎక్కువగా తిరుగుతున్నారా? అది కూడా మార్నింగ్ వేళల్లో?
యూకే వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. హలీడే మేకర్స్ తీరికలేకుండా విమానాల్లో తిరుగుతూనే ఉంటారు. అది వారి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దానివల్ల వారిలో లైంగిక కోరికలు చచ్చిపోతాయి. మితిమీరిన విమాన ప్రయాణం ఆందోళన, క్లాస్ట్రోఫోబియాను పెంచుతుంది. విమాన ప్రయాణం.. మూడ్‌ను మార్చేస్తుంది. తన పార్టనర్‌తో లైంగికంగా కలవాలనే వాంఛను తగ్గిస్తుంది.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు చెందిన డాక్టర్ కమైట్ దీని గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘విమాన ప్రయాణాలు ఒకరకమైన ఆందోళనకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఎదురుచూస్తున్న విమానం మీరు రాకముందే వెళ్లిపోతే.. ఆ ఆందోళన మనసులో ఉండిపోతుంది. అది సెక్స్ డ్రైవ్‌ను తగ్గిస్తుంది. మెదడులో పెరిగే నోర్‌పైన్‌ఫ్రైన్, ఎపినెఫ్రైన్ హార్మోన్లు టెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తాయి. అది వెంటనే కామ వాంఛ, లైంగిక పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.
ఇలాంటి పరిస్థితి రాకూడదంటే.. పర్యటనకు ముందుగానే సిద్ధంగా ఉండాలని కమైట్ తెలిపారు. ఫ్లైట్ ఎక్కడానికి ముందు నరాలను ప్రశాంతంగా ఉంచాలన్నారు. విమాన ప్రయాణాల వల్ల కలిగే ఒత్తిడి తగ్గడానికి, లైంగిక వాంఛ తగ్గడానికి పూర్తి నిద్ర, ధ్యానం సహకరిస్తాయన్నారు. ధ్యానం.. హార్మోన్ల పెరుగుదలకు దారితీసే జన్యువులను ఆపివేస్తుంది. ఫలితంగా టెస్టోస్టెరాన్ స్థిరంగా ఉంటుందని కమైట్ తెలిపారు. కాబట్టి, మీరు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటే.. మీ లైంగిక జీవితం గురించి వర్రీ కావద్దు. డాక్టర్స్ సూచించినట్లు ధాన్యం, తగిన నిద్రతో పరిష్కారం పొందవచ్చు. అలాగే, జీవితంలో సెక్స్‌ను కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే, ఆరోగ్యాన్ని పెంచేది, మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేసి రిలాక్స్ ఉంచేది సెక్స్ మాత్రమే.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు
గమనిక: పై వివరాలను కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఈ సూచనలు చికిత్సకు గానీ, వైద్యుల సూచనలకు గానీ ప్రత్యామ్నాయం కాదు. వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ కథనాల్లోని అంశాలను ఈ సమాచారంలో యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.