Sustainable Diwali 2023 : మీరు ప్రకృతి ప్రేమికులా? అయితే దీపావళి ఇలా చేసుకోండి
Sustainable Diwali 2023 Tips : మీరు ఈ సంవత్సరం పర్యావరణహిత దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే.. ఇక్కడ మీకు ఉపయోగపడే టిప్స్ ఉన్నాయి.
Diwali 2023 : దీపావళి సమయంలో సమయంలో పర్యావరణానికి జరిగే నష్టం మనకి తెలియనిది కాదు. దీపాల పండక్కి టపాసుల మోత దద్దరిల్లిపోతుంది. నువ్వా నేనా అనే రేంజ్లో చాలామంది క్రాకర్స్ కాలుస్తారు. శబ్ధ కాలుష్యంతో మూగజీవులు, వాయుకాలుష్యంతో మనుషులు పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. పటాకులు కాల్చడం తప్పేమి కాదు కానీ.. అధికమోతాదులో పండుగ పేరు చెప్పి పర్యావరణానికి భంగం కలిగించేవారు చాలా మందే ఉన్నారు. అలాగే పర్యావరణానికి నష్టం వాటిళ్లకుండా ఫెస్టివల్ చేసుకునేవారు కూడా ఉన్నారు.
ఇప్పటికే పర్యావరణ చాలా దెబ్బతింటోంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు మన కళ్లముందు జరుగుతున్నాయి. అన్ని మేము కాల్చే టపాసుల వల్లే జరుగుతున్నాయంటారా అంటే కాదు. కానీ మనవంతు ప్రయత్నంగా పర్యావరణహిత దీపావళిని జరుపుకుంటే.. మనమే కాదు.. మన భవిష్యత్తు తరాలు ప్రకృతి ఒడిలో హాయిగా ఉంటాయి. అందుకే కోర్టులు కూడా దీపావళి పటాసులపై కొన్ని ఆంక్షలు పెట్టింది. అయితే మీరు కూడా పర్యవరణహిత దివాళి (Sustainble Diwali) సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
ఇంటి అలంకరణ
దీపావళి (Diwali 2023) అంటేనే దీపాల పండుగ. ఆ సమయంలో దీపాలు పెట్టకపోతే ఎలా? దీనికోసం ప్లాస్టిక్, కొవ్వొత్తుల జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. ఇంటి అలంకరణ కోసం మట్టి దీపాలు వెలిగించండి. ఇవి మీకు పండుగ వాతావరణం తీసుకురావడంతో పాటు.. పర్యావరణానికి ఎలాంటి హాని చేయవు.
అలాగే పండుగ సమయంలో వేసే రంగోళీల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కెమికల్స్‌తో కూడిన రంగులు కాకుండా బయోడిగ్రేడబుల్ రంగులు ఉపయోగించవచ్చు. రంపపు పొట్టు, బియ్యం పిండి, పువ్వులు లేదంటే ఆర్గానిక్ రంగులైన పసుపు వంటి వాటితో ముగ్గులు వేయొచ్చు. వాటిని దీపాలతో అలంకరిస్తే మరింత లుక్ వస్తుంది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులకు బదులు.. మట్టివి లేదా చెక్కతో కూడిన ఐటమ్స్, పేపర్ డిజైన్లతో అలంకరించవచ్చు.
బహుమతుల ఎంపిక
దీపావళి సమయంలో గిఫ్ట్స్ (Diwali Gifts) ఇచ్చి పుచ్చుకుంటారు. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఏమైనా బహుమతి ఇవ్వాలనుకుంటే మీరు హ్యాండ్ మేడెడ్ క్రాఫ్ట్స్ గిఫ్ట్ చేయవచ్చు. నట్స్, మొక్కలు, పువ్వులు, పర్యావరణ అనుకూలమైన గిఫ్ట్స్ ఇవ్వొచ్చు. అలాగే గిఫ్ట్ పేపర్లకు బదులుగా మీరే అందంగా చిన్న గ్రీటింగ్‌కార్డు తయారు చేసి గిఫ్ట్ చేయొచ్చు.
గ్రీన్ క్రాకర్స్
పర్యావరణాన్ని డిస్టర్బ్ చేసే క్రాకర్స్‌కి బదులుగా మీరు గ్రీన్ క్రాకర్స్ (Green Crackers) ఎంచుకోవచ్చు. ఇవి వాయు, శబ్ధ కాలుష్యం చేయవు. పైగా మీకు కూడా టపాసులు కాల్చిన ఫీలింగ్ ఇస్తాయి. ఈ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోవచ్చు. గ్రీన్ క్రాకర్స్‌లో గాలిలోని కాలుష్యకారకాల ఉద్గారాలను తగ్గించే పదార్థాలు ఉంటాయి. ఇవి కాలుష్యాన్ని తగ్గిస్తాయే తప్పా.. సృష్టించవు. అంతేకాకుండా పటాకుల కంటే 30 శాతం తక్కువ శబ్ధాన్ని కలిగిస్తాయి.
హోమ్ మేడ్ ఫుడ్
పండుగ సమయంలో ఇంట్లో చక్కగా అందరూ కలిసి వంటలు చేసుకుంటే మీరు టేస్టీ, హెల్తీ ఫుడ్ తినొచ్చు. బయట ఫుడ్ ఆర్డర్ ఎంత మంచిగా ఉన్నా.. దానిని ప్లాస్టిక్ డబ్బాల్లోనే తెస్తారు. కొన్ని రెస్టారెంట్లు ప్లాస్టిక్ రహిత ఫుడ్ డెలివరీ చేస్తున్నా.. ఇంట్లో వండుకుంటే డబ్బును ఆదా చేసుకోవడంతో పాటు.. ఇంట్లో వారితో కలిసి కాస్త హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఈ సింపుల్ టిప్స్‌తో మీరు పర్యావరణహిత దీపావళి చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ప్రకృతికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. హేవ్ ఏ సస్టైనబుల్ దివాళి.
Also Read : హెల్తీ దీపావళి కోసం స్పెషల్ డైట్.. డ్రింక్.. డిటాక్స్ టిప్స్